Andhra Pradesh: పి.గ‌న్న‌వ‌రంలో రెండు వర్గాల కొట్లాట!

Clash between two groups in P.Gannavaram!

Andhra Pradesh:మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా నుంచి రెండు రిజ‌ర్వుడు అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి ఘ‌న విజ‌యం సాధించింది జ‌న‌సేన పార్టీ.అయితే ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం ఒక‌టే ర‌చ్చ సాగుతోంది. పార్టీలో అంత‌ర్గ‌త వ‌ర్గ విభేధాలు నివురు గ‌ప్పిన నిప్పులా రాజుకుంటున్నాయి. పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం అయిన‌విల్లి మండ‌లంలో మాత్రం ఒక్క‌సారిగా బ్లాస్ట్ అయ్యింది.

పి.గ‌న్న‌వ‌రంలో రెండు వర్గాల కొట్లాట!

రాజమండ్రి, ఏప్రిల్ 11
మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా నుంచి రెండు రిజ‌ర్వుడు అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి ఘ‌న విజ‌యం సాధించింది జ‌న‌సేన పార్టీ. అయితే ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం ఒక‌టే ర‌చ్చ సాగుతోంది. పార్టీలో అంత‌ర్గ‌త వ‌ర్గ విభేధాలు నివురు గ‌ప్పిన నిప్పులా రాజుకుంటున్నాయి. పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం అయిన‌విల్లి మండ‌లంలో మాత్రం ఒక్క‌సారిగా బ్లాస్ట్ అయ్యింది. పార్టీలోని రెండు వ‌ర్గాలు ఇటీవ‌ల‌ కాలంలో బ‌హిరంగంగానే బాహాబాహీల‌కు దిగ‌్గా ఈసారి ఏకంగా ఓ కుటుంబంపై దాడులు చేసి తీవ్రంగా గాయ‌ప‌ర్చారు. అయితే దీనిపై ముందు నుంచి పి.గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే గిడ్డి స‌త్య‌నారాయ‌ణ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా ఈ అల‌స‌త్వంతోనే పార్టీలో ఈప‌రిస్థ‌తి దాపురించింద‌ని ప‌లువురు ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నార‌ట‌. జ‌న‌సేన పార్టీ ఆవిర్భ‌వించాక తొలి విజ‌యం రుచి చూపించిన రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో కూడా వ‌ర్గపోరు తారాస్థాయికి చేరింద‌ని తెలుస్తోంది. ముందు నుంచి పార్టీలో ఉంటూ క‌ష్ట‌ప‌డ్డ‌వారు దూరం జ‌ర‌గ్గా మొన్న‌టి వ‌ర‌కు వైసీపీలో చ‌క్రం తిప్పి ఇప్ప‌డు పార్టీలో చేరి పెత్త‌నం చెలాయిస్తున్నార‌ని కొంద‌రు జ‌న‌సేన నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక్క‌డ కూడా ఎమ్మెల్యే క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోసం విడ‌వ‌మంటే పాముకు కోపం అన్న చందంగా దాట‌వేత ధోర‌ణి స్థానిక ఎమ్మెల్యే దేవ వ‌ర‌ప్ర‌సాద్ వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ మ‌రికొంద‌రు మండిప‌డుతున్నారు. ఈనేప‌థ్యంలోనే గ‌త కొంత‌కాలంగా పార్టీ వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉంటున్నారు.. ఇటీవ‌లే పి.గ‌న్న‌వరం నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన పార్టీ నాయకుల సమావేశం రసాభాసగా మారింది.

కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి.. మాటల తూడాలు పేల్చుకున్నారు. ఇదంతా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలోనే జరగడం చర్చనీయాంశమైంది. అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ల నియామకంపై చర్చించేదుకు అంబాజీపేట, అయినవిల్లి మండలాలకు చెందిన టిడిపి, జనసేన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స‌మావేశం అయ్యారు. అయిన‌విల్లి  పార్టీ అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హిరిస్తున్నార‌ని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.  ఈ క్ర‌మంలోనే ఇదే మండ‌లానికి చెందిన‌ తోలేటి ఉమా, పోలిశెట్టి రాజేష్ మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.. దీంతో ఆదివారం అర్ధరాత్రి రాజేష్ త‌న కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి ఉమా ఇంట్లోకి మారణాయుధాలతో ప్రవేశించి ఉమాతో పాటు అడ్డువచ్చిన ఆ ఇంట్లో. మహిళలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఉమా తల పగిలిపోగా, మహిళలకు గాయాలయ్యాయి. బాధితుల్ని వైద్యం కోసం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఉమా అనుచరులు కూడా రాజేష్‌కు చెందిన కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. రాజేష్ ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. రాజేష్ కుటుంబికులు ఇచ్చిన ఫిర్యాదుపై ఉమ, అత‌ని వ‌ర్గీయులపై మ‌రో కేసు న‌మోద‌ైంది. అయితే ఇదంతా జ‌ర‌గ‌డానికి ఎమ్మెల్యే నాన్చుడు ధోర‌ణి, వ‌ర్గ విభేదాలపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని జ‌న‌సేన పార్టీలోని సామాన్య‌కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు..జ‌న‌సేన పార్టీలో పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఎంత కీల‌క‌మో.. రాజోలు నియోజ‌క‌వ‌ర్గం కూడా అంతే కీల‌కం.. ఎందుకంటే అక్క‌డ జ‌న‌సేన పార్టీ రెండోసారి ఘ‌న విజ‌యం సొంతం చేసుకుంది.

అయితే ఇక్క‌డ వ‌ర్గ విభేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పార్టీ అధిష్టానం జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థిగా దేవా వ‌ర ప్ర‌సాద్‌ను ప్ర‌క‌టించిన నాటి నుంచి ఆయ‌న గెలుపు వ‌ర‌కు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌స్తుతం ఆయ‌న వెంట లేక‌పోవ‌డం స్థానికంగా పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీ గెలుపులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఎన్ ఆర్ ఐ య‌నుమ‌ల వెంక‌ట‌ప‌తిరాజు ముందు నుంచి పార్టీలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా ప్రస్తుతం ఆయ‌న ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో వైసీపీలో ప‌నిచేసిన వారినే ఎమ్మెల్యే వెంట పెట్టుకుని తిప్పుకుంటున్నార‌న్న బాధ చాలా మంది జ‌న‌సైనికుల్లో క‌నిపిస్తోందంటున్నారు. అయితే ఇటీవ‌లే య‌నుమ‌ల వెంక‌ట‌ప‌తిరాజు సోష‌ల్ మీడియాలో చేసిన పోస్టు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తాను ఇండియా వ‌స్తే త‌న‌పై ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ త‌ప్ప‌డు కేసు బ‌నాయించి త‌న‌ను ఇబ్బంది పెట్టాల‌ని ఎమ్మెల్యే చూస్తున్నార‌ని ఆయ‌న చెప్ప‌కురావ‌డంతో మ‌రింత చ‌ర్చ‌నీయాంశం అయ్యింది..రాజోలులో సామాజిక కార్య‌క‌ర్త‌గా య‌నుమ‌ల వెంక‌ట‌ప‌తిరాజుకు మంచి పేరుంది. ఇది పార్టీకు తీవ్ర న‌ష్టాన్ని కలిగిస్తుందని చాలా మంది బాహాటంగా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలో పోటీచేసి గెలిచిన పి.గ‌న్న‌వ‌రం, రాజోలు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం వ‌ర్గ విభేదాలు ఒక్కొక్క‌టి బ‌య‌ట‌ప‌డుతున్నాయి..

Read more:Andhra Pradesh:ఇంకా ఆ ఫీలింగేనా.

Related posts

Leave a Comment