Andhra Pradesh:చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ పంచాయితీ ఇప్పట్లో తేలేలా కనిపించడంలేదు. గతంలో వీడియోలతో అడ్డంగా బుక్ అయిన టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంపై పార్టీ అధిష్టానం బహిష్కరణ వేటు వేయడంతో…అక్కడ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. అయితే ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం ఇవాళో..రేపో తనపై విధించిన బహిష్కరణ వేటును ఎత్తివేస్తారనే ధీమాతో ఉన్నారట.
సత్యవేడు పంచాయితీ తీరేదెన్నడూ
తిరుపతి, ఏప్రిల్ 10
చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ పంచాయితీ ఇప్పట్లో తేలేలా కనిపించడంలేదు. గతంలో వీడియోలతో అడ్డంగా బుక్ అయిన టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంపై పార్టీ అధిష్టానం బహిష్కరణ వేటు వేయడంతో…అక్కడ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. అయితే ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం ఇవాళో..రేపో తనపై విధించిన బహిష్కరణ వేటును ఎత్తివేస్తారనే ధీమాతో ఉన్నారట.అందుకే పార్టీ కార్యక్రమాల్లో తనకు తానుగా పాల్గొంటున్నారన్న చర్చ జరుగుతోంది. కానీ పార్టీ క్యాడర్లో మాత్రం తీవ్ర అయోమయం కొనసాగుతోందట. ఎమ్మెల్యే ఆదిమూలం నాయకత్వంలో పనిచేయాలో, వద్దో ఎటూ తేల్చుకోలేక పార్టీ కేడర్ సతమతమవుతోందన్న టాక్ విన్పిస్తోంది. సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ పంచాయితీ ఏంటో మీరే చూడండి.సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. పదేళ్ల తర్వాత మొన్నటి ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఓ మహిళతో వీడియోలో కనిపించి అడ్డంగా బుక్కయ్యారు.
దీంతో నియోజకవర్గంలో వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన టిడిపి అధిష్టానం..ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోందన్న టాక్ జిల్లా రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది.సత్యవేడు నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఆదిమూలం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయనకు వైసిపి అధిష్టానం సత్యవేడు అసెంబ్లీ టికెట్ కాకుండా తిరుపతి ఎంపీ స్థానం కేటాయించడంతో ఆయన అలక బూనారు. తిరుపతి ఎంపీగా పోటీ చేయడం ఇష్టంలేక ఏకంగా పార్టీనే వదిలి టిడిపిలో చేరారు. టిడిపి నుంచి సత్యవేడు ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ వ్యవహారం తర్వాత సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. త్వరలోనే కొత్త ఇంచార్జిని నియమిస్తామని పార్టీ అధిష్టానం ప్రకటించినా…ఇప్పటివరకు అది కార్యరూపం రూపం దాల్చలేదు. దీంతో ఎవరి నాయకత్వంలో పనిచేయాలో తెలియక సత్యవేడు తెలుగు తమ్ముళ్లు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.
ఇదిలా ఉండే, పార్టీ వేటు తర్వాత కొద్దిరోజుల పాటు కేవలం ఇంటికే పరిమితం అయిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇప్పుడు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారట. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఎయిర్ పోర్టులో వారిని కలుస్తున్నారని తెలుగు తమ్ముళ్లలో టాక్ విన్పిస్తోంది. త్వరలోనే తనపై విధించిన బహిష్కరణ వేటు ఎత్తివేస్తారనే ధీమాతో ఉన్నారట.ఈ విషయంలో పార్టీ అధిష్టానంలో మాత్రం ఇంకా ఊగిసలాటే కనిపిస్తుందన్న వాదన విన్పిస్తోంది. ఎమ్మెల్యే ఆదిమూలంపై ఇంకా సస్పెన్షన్ వేటును కొనసాగిస్తూనే ఉంది. ఈ వ్యవహారం ఇలా ఉంటే సత్యవేడు టిడిపి నేతలు మాత్రం ఇదెక్కడి తలనొప్పి అంటూ తలలు పట్టుకుంటున్నారంట. పనుల కోసం ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలా, వద్దా అని తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ను సైతం నియమించకపోవడంతో ఇక్కడ అంతా గందరగోళ వాతావరణమే కన్పిస్తోంది. ఎవరినో ఒకరిని ఇన్చార్జ్ గా అయినా వేయండి లేదా ఆదిమూలంపై సస్పెన్షన్ను ఎత్తివేయండి అంటూ సత్యవేడు తెలుగు తమ్ముళ్లు నిలదీస్తున్నారని సమాచారం.
ఎమ్మెల్యే ఆదిమూలం పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో బయట వ్యక్తుల అజమాయిషీ నియోజకవర్గంలో పెరిగిందని అక్కడి తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. గంగా ప్రసాద్ అనే సీనియర్ టిడిపి నేత పార్టీ తరపున నియోజకవర్గానికి పెద్దదిక్కుగా ఉంటున్నారట. ఆయన కనుసన్నల్లోనే సత్యవేడు నియోకజవర్గానికి సంబంధించిన పార్టీ వ్యవహారాలన్నీ కొనసాగుతున్నాయట.ఆయన ద్వారా నియోజకవర్గ పార్టీ ఇంన్చార్జి పదవి దక్కించుకునేందుకు చాలామంది స్థానిక నేతలు ఆయన వద్దకు క్యూ కడుతున్నారని తెలుస్తోంది. అయితే నియోజకవర్గంలోనూ గంగా ప్రసాద్ కు వ్యతిరేకవర్గం కూడా తయారైందట. మొన్నటి ఎన్నికల ముందు వరకు సత్యవేడు టిడిపి ఇంన్చార్జిగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే హేమలత సైతం ఇప్పుడు మళ్లీ ఇంన్చార్జి పదవిని ఆశిస్తున్నారన్న టాక్ నియోజకవర్గంలో కోడై కూస్తోందట. మొత్తం మీద సత్యవేడు నియోజకవర్గం విషయంలో ఆచితూచి వ్యవహరించాలని పార్టీ అధిష్టానం భావిస్తుండగా..లోకల్ కేడర్ మాత్రం ఈ తలనొప్పికి ఫుల్ స్టాప్ పడేదెప్పుడని ఎదురుచూస్తున్నారంట.
Read more:Andhra Pradesh:ఇంటర్ లో ఎంబైపీసీ