Congress government:కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం:కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్ లు అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో మంథని మండలం పుట్టపాక, చల్లపల్లి, అక్కెపల్లి గ్రామాల్లోని ఉపాధి హామీ పని స్థలాలకు వెళ్లి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం
-పలు గ్రామాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్ లు అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో మంథని మండలం పుట్టపాక, చల్లపల్లి, అక్కెపల్లి గ్రామాల్లోని ఉపాధి హామీ పని స్థలాలకు వెళ్లి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కాంగ్రెస్ మ్యానిపెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తమ మ్యానిఫెస్టో లో పెట్టిన ప్రకారం మహిళా శక్తిని వెలికితీసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
ఇందులో భాగంగానే మహిళల పేరిటనే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, మహిళల పేరిటనే రేషన్ కార్డుల జారీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్లుఅందజేయడం జరుగుతుందని అన్నారు. అంతేగాకుండా ఆర్టీసిలో మహిళలు అద్దె బస్సులను నడుపుకోవడం, ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణం, భోజన పథకం లాంటి కార్యక్రమాలను మహిళలకు అప్పగించడం జరుగుతుందని అన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలను నిర్వీర్యం చేయడం జరిగిందని అన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళామణులందరిని పారిశ్రామికవేత్తలుగా చూడాలన్న సంకల్పంతో వారికి ప్రభుత్వ పరంగా వివిధ పథకాలను అమలుచేయడం జరుగుతుందని అన్నారు. అంతేగాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలోమంత్రిగా శ్రీధర్ బాబు ఉన్న సమయంలోనే ఊరూర వరి ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేసేకార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు.
సన్న వడ్లకు క్వింటాళ్కు రూ.500 బోనస్, రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ లాంటి పథకాలను అమలు చేయడంజరుగుతుందని అన్నారు. పలుగ్రామాలలోని వీధుల్లో తిరుగుతూ -జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ యొక్క సందేశం ప్రజలకు వివరించారు.మహాత్మాగాంధీ ,అంబేద్కర్,రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం అని అన్నారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు జనగామ నర్సింగారావు, పెండ్రు రమా సురేష్ రెడ్డి, మూల సరోజన, కుడుదుల వెంకన్న, రావికంటి సతీష్, కొత్త శ్రీనివాస్, మంథని సత్యనారాయణ, ఆకుల కిరణ్, బూడిద శంకర్, చాట్లపల్లి సంతోష్, కల్వల రాజేశం, పోరెడ్డి తిరుపతి రెడ్డి, మంథని రాకేష్,ఊట్ల అనిల్, మంథని శ్రీనివాస్, మబ్బు తిరుపతి, అక్కపాక సది, భీముని వెంకటస్వామి,సేమంతుల ఓదెలు, కరుణ కృష్ణ, ఎరుకల ప్రవీణ్, రేపాక లక్ష్మణ్, ఎడ్ల శ్రావణ్, అయిలి శ్రీను, రాజేశం, సవాయి గట్టయ్య, కన్నూరి రాజబాపు, కన్నూరి సదానందం, రవి,కన్నూరి సుదర్శన్, మారిశెట్టి కుమార్, మునిగళ్ల ప్రదీప్, హుస్సెన్ బీ, తదితరులు పాల్గొన్నారు.
Read moreసంక్షిప్త వార్తలు:04-08-2025