సంక్షిప్త వార్తలు : 19-05-2025:రాజేంద్రనగర్ సర్కిల్ ఆరంగర్ వద్ద రైల్వే వంతెన కింద దుర్గా నగర్ నుండి ఆరంఘర్ వైపు వెళ్లే దారిలో సిసి రోడ్డు నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి… దీని కారణంగా ఎల్బీనగర్ నుంచి మెహదీపట్నం వెళ్లే దారిలో ప్రధానంగా దుర్గా నగర్ నుండి ఆరాంఘర్ వైపు వచ్చే వన్ వే ట్రాఫిక్ ను 15 రోజులపాటు కాటేదాన్ ఓల్డ్ కర్నూల్ రోడ్డు, కాలేజీ గేట్ మీదుగా ద్వారా ట్రాఫిక్ మళ్ళించారు..
ఆరంగర్ దగ్గర ట్రాఫిక్ మళ్లింపులు
రంగారెడ్డి
రాజేంద్రనగర్ సర్కిల్ ఆరంగర్ వద్ద రైల్వే వంతెన కింద దుర్గా నగర్ నుండి ఆరంఘర్ వైపు వెళ్లే దారిలో సిసి రోడ్డు నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి.. దీని కారణంగా ఎల్బీనగర్ నుంచి మెహదీపట్నం వెళ్లే దారిలో ప్రధానంగా దుర్గా నగర్ నుండి ఆరాంఘర్ వైపు వచ్చే వన్ వే ట్రాఫిక్ ను 15 రోజులపాటు కాటేదాన్ ఓల్డ్ కర్నూల్ రోడ్డు, కాలేజీ గేట్ మీదుగా ద్వారా ట్రాఫిక్ మళ్ళించారు..సాధారణ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ట్రాఫిక్ సజావుగా సాగేలా ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తెలిపారు..
మేడ్చల్ లో దారుణ హత్య
ఐదు రోజులలో రెండవ దారుణం
మేడ్చల్
మేడ్చల్ పట్టణంలో ఐదు రోజులు గడవకు ముందే మరో దారుణ హత్య జరిగింది. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న మోతిలాల్ (45)ను తన మేనత్త కొడుకు అయిన శంకర్ (35) సోమవారం ఉదయం కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఆదివారం రాత్రి శంకర్ మద్యం తాగి వచ్చి తాము నివాసం ఉండే సరస్వతి నగర్ పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ మీద పడుకుంటే రైలు కింద పడి చనిపోతావని మోతిలాల్ హెచ్చరిస్తూ తన గృహానికి తెచ్చి విడిచిపెట్టాడు.
ఈ విషయమై వారి మధ్య వాగ్వాదం జరిగింది. సోమవారం ఉదయం పని మీద బయటకు వచ్చిన మోతిలాల్ ను తిడుతూ వెనుక నుంచి వచ్చిన శంకర్ నడిరోడ్డు పైన పొడిచి చంపాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనా సటానికి చేరుకున్న సీఐ సత్యనారాయణ, పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఫీజు బకాయిలు చెల్లించాలని బీఆర్ఎస్వీ నిరసన
పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ డిమాండ్ చేశారు.ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బి అర్ ఎస్ వి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత విద్యాశాఖను పూర్తిగా గాలికి వదిలేసింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకోవడానికి కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేడు అని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిగ్రీ ,పీజీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థులకు మొత్తం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతో మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. ప్రభుత్వం ఫీజు నియంత్రణ పై ఒక కమిటీ వేయాలని అన్నారు. ఫీజు బకాయిలను జూన్ మొదటి వారం లోపు విడుదల చేయకుంటే వేలమంది విద్యార్థులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
డ్రైవింగ్ నేర్చుకుంటూ…కారు ఢీ
చిన్నారి మృతి
సంగారెడ్డి
అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిది నర్రిగూడెం గ్రామంలో విషాదం నెలకొంది. నర్రిగూడెం గ్రామం ఒక మైదానంలో భర్త భార్యకు డ్రైవింగ్ నేర్పుతున్న క్రమంలో కారు అదుపుతప్పి అక్కడే ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలను కారు డీ కొట్టింది. ఘటనలో మణి వర్మ అక్కడి కక్కడే మృతి చెందాడు. ఏకావిన అనే పాపకు తీవ్రగాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించారు. ఢీ కొట్టిన మహిళా మహేశ్వరిని అదుపులోకి తీసుకోని కేసునమోదు చేసారు అమిన్ పూర్ పోలీసులు.
వినాయక నగర్ లో గుడిసెలు తొలగింపు..ఉద్రిక్తత
మేడ్చల్
మేడిపల్లి , వినాయక నగర్ సర్వేనెంబర్ 103లో రెండు ఎకరాల 12 గుంటల భూమి లో ఎనుముల రేవంత్ రెడ్డి నగర్ పేరుతో స్థానికులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి గుడిసెలు వేసారు. ప్రభుత్వ స్థలమంటూ పోలీస్ బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారుల కూల్చివేసే ప్రయత్నం చేసారు. వారిని స్థానికులు అడ్డుకున్నారు. గతంలో 1997లో ప్రభుత్వ మాకు పట్టాలు వచ్చిందని స్థానికుల వాదన. ఈ నేపధక్యంలో వినయక నగర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గతంలో 1997 లో అప్పటి మంత్రి సబీత ఇంద్రా రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 150 మందికి 60 గజాలు చొప్పున పట్టాలు ఇచ్చారు.
కానీ అప్పటినుండి ల్యాండ్ పొజిషన్ చూపించలేదని బాధితులు వాపోయారు. లాండ్ కోసం అప్పటి నుండి ఇప్పటి వరకు అధికారులను, నాయకులను కలిశామని హామీలు ఇస్తున్నారు తప్ప తమకు ఎవ్వరు న్యాయం చేయడం లేదని తమకు కేటాయించిన ప్రాంతంలో గుడిసెలు ఏర్పాటు చేసుకున్నామని బాధితులు మొరపెట్టుకున్నారు.తమకు న్యాయం చేసి తమకు పట్టాలు ఇచ్చిన స్థలం తమకే కేటాయించాలని కోరుతున్నారు. కానీ ఈ స్థలంలో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్న రెవెన్యూ అధికారులు వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. పట్టాలు ఉన్న తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు.