సంక్షిప్త వార్తలు : 19-05-2025:కబ్జాదారుల ఆగడాలు శృతిమించుతున్నాయి ఇప్పటిదాకా ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు గురవుతున్నాయి అంటే ప్రైవేట్ స్థలాలు కూడా లేఔట్ సైతం కబ్జా చేసి ఫ్లాట్ యజమానులను సైతం లోపలికి రానీయకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసిన దౌర్జన్యం ఇది.బాధితులకు ఓ ఆశా కిరణాల హైడ్రా కనిపించడంతో వారందరూ ఫిర్యాదు చేయడంతో యాక్షన్ లోకి దిగిన హైడ్రా సోమవారం తెల్లవారుజామున భారీ బందోబస్తు మధ్య కబ్జాదారుడి ఆక్రమణ నుంచి హుడా లేఅవుట్ కాపాడారు.
కొరడా ఝళిపించిన హైడ్రా
హైదరాబాద్
కబ్జాదారుల ఆగడాలు శృతిమించుతున్నాయి ఇప్పటిదాకా ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు గురవుతున్నాయి అంటే ప్రైవేట్ స్థలాలు కూడా లేఔట్ సైతం కబ్జా చేసి ఫ్లాట్ యజమానులను సైతం లోపలికి రానీయకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసిన దౌర్జన్యం ఇది.బాధితులకు ఓ ఆశా కిరణాల హైడ్రా కనిపించడంతో వారందరూ ఫిర్యాదు చేయడంతో యాక్షన్ లోకి దిగిన హైడ్రా సోమవారం తెల్లవారుజామున భారీ బందోబస్తు మధ్య కబ్జాదారుడి ఆక్రమణ నుంచి హుడా లేఅవుట్ కాపాడారు.
ఎప్పుడో 2000 సంవత్సరంలో కూడా అనుమతితో 9.27 ఎకరాల్లో వేసిన హూడా లేఔట్ లో 79 ప్లాట్ ఓనర్స్ ప్లాట్లు కొనుక్కున్నారు ఈ లేఔట్ ను ఎన్ ఎస్ డి ప్రసాద్ అనే వ్యక్తి 2007లో అగ్రికల్చర్ ల్యాండ్ అంటూ రాత్రికి రాత్రి ఫెన్సింగ్ వేసి కబ్జా చేశాడు దీంతో బాధితులు గత సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో అధికారులు కబ్జాలను తొలగించారు
ఒకే దేశం ఒకే ఎన్నిక అసాధ్యం
భువనగిరి
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ వైఖరి అవలంబిస్తుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అసాధ్యం… రాజుల పరిపాలన దిశగా బీజేపీ అడుగులేస్తోంది. పహాల్గం ఉగ్రదాడి విషయం లో బీజేపీ విధానం తానే పాలక వర్గం తానే ప్రతిపక్షం తీరును గా వ్యవహారిస్తుంది. ఉమ్మడి రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రయోజనాలు కాపాడే ఎయిమ్స్ ను స్థానిక కేంద్ర మంత్రులు పట్టించుకోవడం లేదని అన్నారు.
చెన్నూరు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ నేతలపై దాడి
చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో ప్రజా సమస్యల పై మాట్లాడిన నాయకుడు పోగుల సతీష్ పై టీపీసీసీ మెంబర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేయి చేసుకోవడం తో గందరగోళం ఏర్పడింది. ప్రజా సమస్యలు అడిగిన వారిపై చేయి చేసుకోవడం ఏంటని స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. .