సంక్షిప్త వార్తలు :19-05-2025

brife news

సంక్షిప్త వార్తలు :19-05-2025:దేశవ్యప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపించింది. ఈశాన్య రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ఐఎండి ప్రకటించింది. కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు, మిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణకు వర్ష సూచన, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీలో ధూళి తుఫాన్లు వుంటాయిని ఐఎండి తెలిపింది.

హైదర్ నగర్ లో హైడ్రా కూల్చివేతలు

హైదరాబాద్
సోమవారం ఉదయం కూకట్ పల్లి హైదర్ నగర్ వద్ద హైడ్రా కూల్చేవేతలు జరిగాయి. ఈ నేపధ్యంలో పోలీసులు  భారీగా మోహరించారు. సర్వేనెంబర్ 145/3 లో అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లు ,బారికేడ్లు తొలగించారు. అధికారులు, పోలీసులు మీడియాను అనుమతించలేదు

నైరుతి రుతుపవనాల ప్రభావం

నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ - ఏపీకి భారీ వర్ష సూచన!

హైదరాబాద్
దేశవ్యప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపించింది. ఈశాన్య రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ఐఎండి ప్రకటించింది. కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు, మిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణకు వర్ష సూచన, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీలో ధూళి తుఫాన్లు వుంటాయిని ఐఎండి తెలిపింది.

మరోవైపు,  నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. అంచనా వేసిన సమయానికంటే ముందుగానే కేరళను తాకే అవకాశం వుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో  నైరుతి రుతుపవనాలు వస్తరించాయి. ఈ నెల 27న కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. జూన్ మొదటి వారంలోనే తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల తాకిడి వుండే ఆవకాశం వుంది.

ఓ అండ్ ఎం పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

Nimmala: ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష | AP Minister Nimmala  Ramanaidu review of the projects Vijayawada Andhrapradesh Suchi

అమరావతి
ఓ అండ్ ఎం పనుల పై ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో, మంత్రి నిమ్మల రామానాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ఎమ్మెల్యేలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, కడా కమీషనర్ రాంసుందర్ రెడ్డి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఈ లు, ఎస్ఈ లు మరియు ఇతర ఉన్నత్తాధికారులు హజరయ్యారు.మంత్రి మాట్లాడుతూ వందల,వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, డ్రైన్స్, నిర్మిస్తే గత ప్రభుత్వం మెయింటెన్స్ కూడా లేకుండా గాలికొదిలేసింది. ఇరిగేషన్ పనులు, నిర్వహాణ మరియు మరమ్మత్తుల కోసం చంద్రబాబు విడుదల చేసిన రూ.344కోట్లు సద్వినియోగం చేసుకునేలా ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించాం.

తూడు, గుర్రపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనులు కోసం 10లక్షలు దాటితే, కాలయాపన లేకుండా, 7 రోజుల్లోనే పూర్తయ్యేలా, షార్ట్ టెండర్లు పిలవాలని ఆదేశించాం. రూ.10లక్షల లోపు ఉన్న పనులను, సాగు నీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టుకోవచ్చు.  గత ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్ట మట్టి తీయకపోగా, షట్టర్లు,డోర్లు, గేట్లకు మరమ్మత్తులు చేయకపోగా, గ్రీజు కూడా పెట్టలేదు. గత ప్రభుత్వం తప్పిదాలను సరిచేసుకుంటూ, ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నాం.  2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే నెలాఖరుకు పూర్తయ్యే లక్ష్యంగా నిర్వహాణ మరియు మరమ్మత్తు పనులను చేపట్టాలని అన్నారు.   పనులను సకాలంలో పూర్తిచేయడానికి చీఫ్ ఇంజనీర్లు, సూపరిండెంట్ ఇంజనీర్లు నిరంతరంగా పర్యవేక్షణ చేయాలని అన్నారు.

ఇంజనీరింగ్ ఫీజలు పెంచొద్దు

ఇంజినీరింగ్‌కు కటాఫ్‌ పెరిగే అవకాశం | general

హైదరాబాద్:
ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను పెంచొద్దని తెలంగాణ ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్ట రెడ్డి కి ఏబీవీపీ బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది .ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథ్వి తేజ రాష్ట్రంలో మూడేళ్లకు ఒకసారి పెరిగే ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను ఇష్టారీతిన పెంచడానికి ప్రతిపాదనలు పంపిన TAFRC నిర్ణయాన్ని ఎబివిపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది . కళాశాలలు తప్పుడు అడిట్ లెక్కలు చూపిస్తూ ఫీజులు పెంచుకొని పేద విద్యార్థుల దగ్గర లక్షలకు లక్షలు డబ్బులు వసూలు చేయడానికి సిద్ధం అవుతున్నాయి.

TAFRC పంపిన ప్రతిపాదనలను విద్యాశాఖ ఉన్నత అధికారులు తిరస్కరిస్తూ చివాట్లు పెట్టారు. దీనితో మనం అర్థం చేసుకోవచ్చు ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల పెంపును ఆశాస్త్రీయబద్ధంగా పెంచడానికి అనుమతి అడుగుతున్నాయి. డిమాండ్ లో ఉన్న కోర్సులకు లక్షల రూపాయలు డొనేషన్ల పేరుతో వసూలు చేస్తూ ఉన్నాయి అయినప్పటికీ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల యజమాన్యాల దాహం తీరకుండా ప్రభుత్వానికి ఫీజులు పెంపు చేయమని తప్పుడు లెక్కలు సమర్పించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

Related posts

Leave a Comment