సంక్షిప్త వార్తలు : 20-05-2025:వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమం జరిగింది. , ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రకాశం పంతులుకు నివాళులర్పించిన వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమం జరిగింది. , ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శత్రుచర్ల పరీక్షిత్ రాజు, అలజంగి జోగారావు, తిప్పల నాగిరెడ్డి, మళ్ళ విజయ్ ప్రసాద్, వాసుపల్లి గణేష్, పలువురు సీనియర్ నాయకులు పాల్గోన్నారు.
గన్నవరం లో భారీ వాన
కృష్ణాజిల్లా గన్నవరం లో ఈరోజు తెల్లవారుఝాము నుండి గాలి వాన బీభత్సం సృష్టింది. నగరంలో ఎండ తీవ్రతతో ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నా సమయంలో వాతావరంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. గన్నవరం రహదారి ప్రాంతంలో నల్లటి మేఘాలు ఒక్కసారిగా కమ్మేసాయి. భారీ ఈదురు గాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది దీంతో లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పలుచోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది..
రోడ్డుపై వడ్లు పోసి రైతుల ధర్నా
మెదక్
శివంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ముందు తూప్రాన్ నర్సాపూర్ రహదారిపై మొలకెత్తిన వడ్లు రోడ్డుపై పోసి రైతులు ధర్నాకు దిగారు. నెల రోజులుగా వడ్లు కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళన, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేసారు. రైతు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సహకార సంఘం సీఈవో ను స్థానిక ఎమ్మెల్యే ఆదేశించారు.