సంక్షిప్త వార్తలు : 20-05-2025:బోరుగడ్డ అనిల్ కి మరో కేసులో ఉచ్చు బిగిస్తోంది. పెదకాకాని మండల సర్వేయర్ మల్లిఖార్జున రావు బెదిరించిన కేసులో పెదకాకాని పోలీసులు అనంతపురం వెళ్లారు. ఈ కేసులో అనిల్ గత ఎనిమిది ఏళ్లుగా కోర్టుకి హాజరు కాలేదు. పిటి వారెంట్ పై అనిల్ ను తెచ్చి గుంటూరు కోర్టులో హాజరు పర్చనున్నారు.
బోరుగడ్డ అనిల్ కి మరో కేసులో ఉచ్చు
గుంటూరు
బోరుగడ్డ అనిల్ కి మరో కేసులో ఉచ్చు బిగిస్తోంది. పెదకాకాని మండల సర్వేయర్ మల్లిఖార్జున రావు బెదిరించిన కేసులో పెదకాకాని పోలీసులు అనంతపురం వెళ్లారు. ఈ కేసులో అనిల్ గత ఎనిమిది ఏళ్లుగా కోర్టుకి హాజరు కాలేదు. పిటి వారెంట్ పై అనిల్ ను తెచ్చి గుంటూరు కోర్టులో హాజరు పర్చనున్నారు.2016 మే 9 న సర్వేయర్ తన స్థలానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వాలని.విధులకు ఆటంకం కలిగించి బెదిరించారని పోలీస్ స్టేషన్ లో బాధితుడు పిర్యాదు చేసాడు.
సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వుండాలి
విజయవాడ
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సింగ్ నగర్ షాదీఖానాలో నియోజకవర్గ స్థాయి టిడిపి మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) హాజరు అయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పి బిల్డింగ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామ రాజు, పార్టీ నాయకులు నివాళులర్పించారు.సెంట్రల్ నియోజకవర్గం లో డివిజన్ ఇన్చార్లు, అనుబంధ సంఘ నాయకుల పేర్లను ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన డివిజన్ అధ్యక్షులు, ఇన్చార్లు, ప్రధానకార్యదర్శులు,అనుబంధ సంఘాల నాయకులకి ఎంపి కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపారు.
ఎంపి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో జరిగే మినీ మహానాడులో ముందుగా సెంట్రల్ నియోజకవర్గం కి హాజరుకావటం సంతోషంగా వుంది. సింగ్ నగర్ ప్లై ఓవర్, గుణదల ప్లై ఓవర్ సమస్యలపై మహానాడు తర్వాత ఎమ్మెల్యే బొండాతో కలిసి సీఎం చంద్రబాబును కలుస్తాము. ప్రతిపక్షంలో వున్న సమయంలో ప్రజల సమస్యలపై పోరాటం చేశాము.అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని అన్నారు.సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వుండాలని అన్నారు.. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రవేశపెట్టిన తీర్మానాలను ఎంపి కేశినేని శివనాథ్ అయోదించారు.
అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయండి.
కమిషనర్ ఎన్.మౌర్
నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని జీవకోన, రాజీవ్ గాంధీ కాలని తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులతో పాటు పారిశుద్ధ్య పనులను ఇంజినీరింగ్, హెల్త్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీవకోన వంటి ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు.
అలాగే అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఇంటింటి చెత్త సేకరణ పక్కగా చేయాలని, ఎక్కడా చెత్తకుప్పలు లేకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అన్నారు. డ్రెయినేజీ కాలువలు శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. చెత్త తొలగించడం, కాలువలు శుభ్రం చేయడం వంటివి ప్రణాళికాబద్దంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, తుడా ఈఈ రవీంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి రవి, తదితరులు ఉన్నారు.