సంక్షిప్త వార్తలు : 20-05-2025:శ్రీ వెంకటేశ్వర దేవాలయ స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి ని దర్శించుకొని చిన్న జీయర్ స్వామి వారి తీర్థ గోష్టి కార్యక్రమం లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గోన్నారు.సామాన్య కార్యకర్తగా హరీష్రావు కార్యక్రమంలో పాల్గోన్నారు.దేవాలయం లో తీర్థ గోష్టి కార్యక్రమంలో భాగంగా కిక్కిరిసిన భక్తులను చూసి ఇబ్బంది కాకుండా స్వయంగా తానే భక్తులను పంపించారు.
శ్రీ వెంకటేశ్వర దేవాలయ స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాల్లో పాల్గోన్న హరీష్ రావు
సిద్దిపేట
శ్రీ వెంకటేశ్వర దేవాలయ స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి ని దర్శించుకొని చిన్న జీయర్ స్వామి వారి తీర్థ గోష్టి కార్యక్రమం లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గోన్నారు.సామాన్య కార్యకర్తగా హరీష్రావు కార్యక్రమంలో పాల్గోన్నారు.దేవాలయం లో తీర్థ గోష్టి కార్యక్రమంలో భాగంగా కిక్కిరిసిన భక్తులను చూసి ఇబ్బంది కాకుండా స్వయంగా తానే భక్తులను పంపించారు. రద్దీ కారణంగా భక్తులకు ఇబ్బందులు రాకుండా వాలంటీర్ పని కుడా చేసారు.
శ్రీధర్ బాబును భర్తరఫ్ చేయాలి
హైదరాబాద్
దళిత ఎంపీని అవమానించేలా వ్యవహరించిన మంత్రి శ్రీధర్ బాబును మంత్రి వర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని పలు మాల సంఘాలు హైదరాబాద్ లో ఆందోళనకు దిగాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ… ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. కాళేశ్వరం వద్ద సరస్వతి నది పుష్కరాల్లో… పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ప్రోటోకాల్ పాటించకుండా వివక్ష చూపారని అల్ ఇండియా షెడ్యుల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు రాజ్ ఉస్తాద్ మండిపడ్డారు.
స్థానిక ఎంపీ అయినా.. ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారన్ని ఇదేమిటని ప్రశ్నించిన దళిత కార్యకర్తలను అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. పుష్కరాల్లో దళిత ఎంపీని కావాలనే అవమానించేలా చేశారన్నారు. ఫ్లెక్సీల్లోనూ ఎంపీ ఫొటో లేకుండా చేశారని,…యువకుడు రాజకీయంగా జిల్లాలో ఎదుగుతున్నాడని ఓర్వలేక స్థానిక మంత్రి శ్రీధర్ బాబు ఇదంతా చేస్తున్నాడని ఆరోపించారు. తక్షణమే ముఖ్యమంత్రితో పాటు అధికారులు 48గంటల్లో స్పందించాలని.. లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
స్టీల్ ప్లాంట్ కార్మికుల అందోళన
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లోని కాంట్రాక్ట్ కార్మికులను ఒక్కసారి తొలగించడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నగరంలో అఖిల పక్ష కార్మిక,ప్రజా సంఘాల జేఏసీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు.స్లీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికుల పక్షాన అన్యాయంగా వ్యవహరిస్తోందని,తక్షణమే తొలగించిన కార్మికులను విదుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా దల్లి గోవింద రెడ్డి
జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా దల్లి గోవింద రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను జేసీ మయూర్ అశోక్ అందజేశారు. 64వ వార్డు కార్పొరేటర్ అయిన గోవింద రెడ్డి ఎన్నికను జేసీ మయూర్ అశోక్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మేయర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రాజు రెడ్డిని అధిష్టానం నిర్ణయించిందని, కూటమి పాలనలో మంచి పరిపాలనను ప్రజలు చూస్తారని ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు. గత నాలుగేళ్లుగా వైసీపీ వాళ్ళు జీవీఎంసీని దోచుకుని దాచుకున్నారని, ఇప్పుడే నిజమైన ప్రజా పాలన అందుతోందన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ కూటమి పక్షం వ్యక్తులు కావడంతో మంచి పాలన అందిస్తారన్నారు.