సంక్షిప్త వార్తలు : 20-05-2025:తనకు చెప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ముగ్గు పోశాడని ఆగ్రహంతో లబ్ధిదారుడిని కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కిషన్ తన్నిన వైనం వైరలయింది.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్ళపేట గ్రామానికి చెందిన బాలసాని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవ్వగా, ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసుకున్నాడు.
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడిని తన్నిన కాంగ్రెస్ నాయకుడు
రాజన్న సిరిసిల్ల
తనకు చెప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ముగ్గు పోశాడని ఆగ్రహంతో లబ్ధిదారుడిని కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కిషన్ తన్నిన వైనం వైరలయింది.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్ళపేట గ్రామానికి చెందిన బాలసాని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవ్వగా, ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసుకున్నాడు.
తనకు చెప్పకుండా ముగ్గు పోశాడని ఆగ్రహంతో లబ్ధిదారుడితో గొడవ పడగా, ఒకరి జోలికి ఒకరు వెళ్లకూడదని గ్రామ పెద్దలు తీర్మానించారు. దీంతో కాంగ్రెస్ నాయకుడు కిషన్ మరింత ఆగ్రహంతో రెచ్చిపోయి, శ్రీనివాస్ గౌడ్ ను కాలితో తన్ని దుర్భాషలాడాడు. ఊరిలో ఎవరు ఏ పని చేసినా తనకు చెప్పాలని, లేకపోతే ఎలాంటి పథకాలు రాకుండా ఆపేస్తానని ఇబ్బంది పెడుతున్నాడని గ్రామస్తులు వాపోతున్నారు.
రక్తం రహదారి
ఘోర రోడ్డు ప్రమాదం
వికారాబాద్
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో నేషనల్ హైవే 163 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని డిన్నర్ కు వెళ్లి వెళ్తున్న ఒక బస్సు, వెనుక నుంచి ఢీ కొట్టింది. బస్సులో సుమారు 60 మంది ఉన్నట్టు సమాచారం. నలుగురు బస్సులో ఇరుక్కుని మృతి చెందారు. స్థానికులు పోలీసులు మృతదేహాలను అతి కష్టంగా బయటకు తీసారు.
పరిగి లో డిన్నర్ కు హాజరై తిరిగి తమ గ్రామానికి ట్రావెల్స్ బస్సులో వెళుతుండగా ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన వెళ్లి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. క్షతగాత్రులను మృతదేహాలను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
పరిగి
చందన వెల్లి గ్రామానికి చెందిన నలుగురు మృతి పట్ల చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. షాబాద్ మండలం చందన వెల్లి గ్రామ వాసులు శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో నేషనల్ హైవే పై రాత్రి ప్రమాదవశాత్తూ ఘోర రోడ్డు ప్రమాదంలో గాయాల పాలై వికారాబాద్ లోని ఈషా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారి దగ్గరికి వెళ్ళి అయన , పరామర్శించారు. తరువాత
అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలన్నారు.
కృత్రిమ అవాసాలను విడుదల చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
విశాఖపట్నం
విశాఖలోని జాలారి ఎండాడ సము ద్రంలో రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృత్రిమ ఆవాసాలను విడుదల చేశారు. వీటి ఏర్పాటుతో మత్స్య సంపద వృద్ధి చెంది మత్స్యకారుల జీవనో పాధి మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రలో మొదటి విడతగా 22 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్తులో ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
భారీ వర్షానికి బెంగళూరు అతలాకుతలం
బెంగళూరు
కర్ణాటక రాజధాని బెంగ ళూరులో వర్ష బీభత్సం సృష్టించిం ది.నగరవ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాలతో పాటు వాహనాలు నీట మునిగాయి. రోడ్ల పైకి నీరు చేరడంతో వాహనదారు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. రహదారులపై నీళ్లు చెరువుల ను తలపించాయి. హెణ్ణూరు ప్రాం తంలోని ఓ అనాథాశ్రమంలోకి వర్షపు నీరు చేరడంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉదయం దాకా మంచాల పైనుంచి దిగే పరిస్థితి లేదు. కేఆర్ పురం పరిధిలోని సాయి లేఅవుట్లో ప్రజలు రెండో రోజూ ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. కాలనీలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది.నెలమంగళ మార్గంలో జాతీయ రహదారి సర్వీ స్ రోడ్లపై నాలుగు అడుగులకుపైగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.