సంక్షిప్త వార్తలు : 26-05-2025:కాంగ్రెస్ పార్టీకి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప షాకిచ్చాడు. కాంగ్రెస్ పార్టీతో కోనప్ప తెగతెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్కు దూరంగానే ఉన్నానని.. దూరంగానే ఉంటానని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ… ఏ పార్టీ లోకైనా వెళ్తా కానీ.. కాంగ్రెస్లోకి మాత్రం పోనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప షాక్
కొమురంభీం మే 26
కాంగ్రెస్ పార్టీకి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప షాకిచ్చాడు. కాంగ్రెస్ పార్టీతో కోనప్ప తెగతెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్కు దూరంగానే ఉన్నానని.. దూరంగానే ఉంటానని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ… ఏ పార్టీ లోకైనా వెళ్తా కానీ.. కాంగ్రెస్లోకి మాత్రం పోనని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరానని.. కానీ, కాంగ్రెస్ 16 నెలల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ దేవుడు అని ఇదివరకే తాను చెప్పానని, ఆయనకు పాదాభివందనాలని కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే చెప్పానని కోనప్ప అన్నారు. తనను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తిని పార్టీలో తీసుకునేటప్పుడు చెప్పలేదనే బిఆర్ఎస్ నుంచి బయటికి వచ్చానని.. రాజకీయంగా బిఆర్ఎస్, కెసిఆర్ కుటుంబంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. తాను మళ్లీ బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాను కానీ కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం వెళ్లను కోనప్ప చెప్పారు.
శివయ్య దర్శనం ఎంతో ప్రశాంతం

శివయ్య దర్శనం మనస్సు కు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని సింగర్ స్మిత తెలిపారు. ఆమె శ్రీకాళహస్తీశ్వరాలయం కు కుటుంబ సమేతం గా విచ్చేశారు. రాహుకాల సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని గురు దక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం తీసుకున్నారు ఆలయ అధికారులు స్మిత కు స్వామి అమ్మవార్ల చిత్రపటం,తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్మిత మీడియా తో మాట్లాడుతూ శివయ్య ఆశీస్సులతోనే చక్కటి పాటలు పాడే అవకాశాలు వస్తున్నాయన్నారు. శివపార్వతుల దీవెనల కోసం శ్రీకాళహస్తీశ్వరాలయం కు వచ్చినట్లు వివరించారు
భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్

కరోనావైరస్ కొత్త రూపంలో పంజా విసురుతోంది. భారత్లో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటం జనంలో గుబులు పుట్టిస్తోంది. దేశంలో కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.. కరోనాతో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు.. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా బాగా పెరిగింది.. చాప కింద నీరులా చల్లగా పాకేస్తోన్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య దేశంలో వెయ్యి దాటిపోయింది.. తమిళనాడు, మహరాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలో బాధితులు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అక్కడి వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమై కోవిడ్ నిబంధనల్ని, టెస్టులను చేయడం మొదలుపెట్టింది.
బొలెరో బైక్ డి కాంట్రాక్టర్ మృతి

కడపజిల్లా పోరుమామిళ్ళ మండలంలోని చెన్నారెడ్డిపేట దగ్గర బోలోరో బైక్ డీ వ్యక్తి దుర్మరణం చెందారు.చెన్నారెడ్డి పేట దగ్గర ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.బోలోరో బైక్ ప్రమాదములో R&B కాంట్రాక్టర్ వెంకటరెడ్డి అక్కడికక్కడే మరణించాడు.కొండుగారిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు.శవాన్ని పోరుమామిళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు
మహానాడుకు సర్వం సిద్దం
కడప
రాయలసీమ జిల్లాల నడిబొడ్డున కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమం పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో పాటు పాలు చరిత్ర ఆత్మకు నిర్ణయాలకు వేదికగా నిలవనుంది తొలి రోజు 27వ తేదీన పార్టీ ప్రతినిధుల సభ సంస్థాగత నిర్మాణం భవిష్యత్తు కార్య చరణతోపాటు తెలుగుదేశం పార్టీ మౌలిక సిద్ధాంతాలు పార్టీ ఆవిష్కరణ పార్టీ నియమాలతో పాటు వాటి సవరణలపై ప్రధాన చర్చ జరగనున్నది అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు మంగళవారం ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో పసుపు పండగ ప్రారంభమవుతుంది.
అనంతరం ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలు ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షులు, పొలిట్బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు వేదికపైకి చేరుకుంటారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేసి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనతరం ‘మా తెలుగు తల్లికి’ గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పార్టీ కోసం పనిచేసి మృతిచెందిన కార్యకర్తలు, నేతలకు సంతాపం తెలియజేస్తారు. తర్వాత ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పిస్తారు. 11.30 గంటలకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేస్తారు. కోశాధికారి పార్టీ జమాఖర్చుల నివేదిక సమర్పిస్తారు.
