సంక్షిప్త వార్తలు : 28-05-2025

Ganja worth Rs. 4 crore seized in Kothagudem district

సంక్షిప్త వార్తలు : 28-05-2025:తెలంగాణలో డ్రగ్స్, గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిత్యం ఎక్కడో ఒక చోట పట్టుబడుతూనే ఉంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వీటి వాడకం మాత్రం ఆగడంలేదు. తాభాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది.

కొత్తగూడెం జిల్లాలో రూ.4 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం
తెలంగాణలో డ్రగ్స్, గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిత్యం ఎక్కడో ఒక చోట పట్టుబడుతూనే ఉంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వీటి వాడకం మాత్రం ఆగడంలేదు. తాభాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో బుధవారం జూలూరుపాడు మండలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి 8.30 క్వింటాళ్ల గంజాయి పట్టుకున్నారు.  అనంతరం తొమ్మిది మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన గంజాయి ధర మార్కెట్ లో రూ.4 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి ముఠాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సమాజంలో అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉంది
ముఖ్య మంత్రి  రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: రైజింగ్ తెలంగాణ మా నినాదం, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్న ప్రధాని, దేశ వ్యాప్తంగా ఓబీసీ కుల గణన జరగాలని సీఎం ...

హైదరాబాద్
సమాజంలో రుగ్మతలు అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్ రెడ్డి  అన్నారు. బంజారాహిల్స్‌లో బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో గురుకుల అవార్డుల ప్రధానోత్స కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోఠిలోని మహిళా కళాశాలకు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నామని పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. పాలితులుగా ఉన్నా ఎస్సి, ఎస్టిలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. చాలామంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదని.. చదువు   మాత్రమే అని సిఎం అన్నారు.

ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువులతోనే   సాధ్యమవుతోందని తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని సిఎం   పేర్కొన్నారు.ఒక విద్యార్థి చదువు, ఆరోగ్యం బాగుండాలంటే.. పరిసరాలు, మౌలిక వసతులు బాగుండాలని అన్నారు. ఎస్సి, ఎస్టి, బిసిల పిల్లలకు చదువులు వద్దు, కులవృత్తులు మాత్రమే చేసుకోవాలని గత పాలకులు భావించారని.. దళితులు, బిసిలు గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ ఉండాలన్నట్లుగా మాజీ సిఎం వ్యవహరించారని మండిపడ్డారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఆశలపై నీళ్లు చల్లారని పేర్కొన్నారు. మాజీ సిఎం తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు కానీ, రాష్ట్రంలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. తన ఇంట్లో వాళ్లు ఒక చోట ఓడిపోతే.. మరోచోట పదవులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కానీ, ఈ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని స్పష్టం చేశారు.

థియేటర్ల బంద్ అన్నది దిల్ రాజు తమ్ముడు

Pawan Kalyan: 'నా దేవుడి సినిమాను నేనెందుకు అడ్డుకుంటాను'.. దిల్ రాజుపై జనసేన బహిష్కృత నేత సంచలన ఆరోపణలు - Telugu News | Atti Satyanarayana Sensational Comments On Dil Raju Over ...
విజయవాడ
జనసేన నుంచి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ సంచలన  వ్యాఖ్యాలు చేసారు. జూన్ 1న థియేటర్ల బంద్ అని ప్రకటించింది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి. దిల్ రాజు తన తమ్ముడుని కాపాడుకోవడానికి నాపై అభాండం వేశారు.. కమల్ హాసన్ను మించి ఆస్కార్ రేంజ్లో దిల్ రాజు నటించాడు. దురుద్దేశంతోనే నా పేరు చెప్పారు.. పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో దిల్ రాజు జనసేన పేరు ఎత్తారు. నేను థియేటర్ల బంద్ అని ఎక్కడా అనలేదని అన్నారు.

రాజ్యసభ సభ్యుడిగా పాకా వెంకట సత్యనారాయణ ప్రమాణ స్వీకారం

రాజ్యసభ సభ్యుడిగా వెంకట సత్యనారాయణ ప్రమాణం.. హాజరైన పలువురు ప్రముఖులు

న్యూఢిల్లీ
రాజ్యసభ సభ్యుడిగా పాకా వెంకట సత్యనారాయణ ఢిల్లీ లో బుధవారం జు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ పాకా సత్యనారాయణ ను ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుండి ఖాళీ ఏర్పడిన ఒక రాజ్యసభ స్థానానికి పాకా సత్యనారాయణ ఒక్క రే నామినేషన్ దాఖలు చేయడం తో కూటమి అభ్యర్థి గా పాకా సత్యనారాయణ ఏక గ్రీవంగా ఎన్నిక కావడంతో రాజ్యసభ లో పాకా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈకార్యక్రమంలో బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు వై సత్య కుమార్ యాదవ్ తదితరులు పాకా సత్యనారాయణ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు

Related posts

Leave a Comment