సంక్షిప్త వార్తలు : 28-05-2025

Kompally Municipality.

సంక్షిప్త వార్తలు : 28-05-2025:కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో  వీధికుక్కలు పట్టపగలే పాదచారులకు చుక్కలు చూపిస్తున్నాయి.  నిన్న ఒక్క రోజే 4గురికి కుక్క కాటుకు గురయ్యారు. కొంపల్లి మున్సిపాలిటీ అధికారులు కనీస చర్యలు లేకుండా కాలం గడుపుతున్నారని స్థానికుల ఆరోపణ. ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు అంటూ స్థానికుల ఆగ్రహం.

కొంపల్లిలో కుక్కల హల్ చల్

కుత్బుల్లాపూర్
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో  వీధికుక్కలు పట్టపగలే పాదచారులకు చుక్కలు చూపిస్తున్నాయి.  నిన్న ఒక్క రోజే 4గురికి కుక్క కాటుకు గురయ్యారు. కొంపల్లి మున్సిపాలిటీ అధికారులు కనీస చర్యలు లేకుండా కాలం గడుపుతున్నారని స్థానికుల ఆరోపణ. ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు అంటూ స్థానికుల ఆగ్రహం. చిన్న పెద్ద తేడా లేకుండా పలువురిపై వీధి కుక్కలు ప్రతాపం చూపిస్తున్నాయి. నడి రోడ్డు పైన కుక్కలు గుంపులు గుంపులుగా చేరి స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి అని దూలపల్లి వాసులు.ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చింతపండు బస్తాల చోరీ

ఆంధ్రప్రదేశ్: చిత్తూరు చింతపండు ఎందుకు తగ్గిపోతోంది... చింత చెట్లు  ఏమైపోతున్నాయి? - BBC News తెలుగు

యాదాద్రి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొంతమంది  ఉద్యోగుల చేతివాటం బయటపడింది. ప్రసాద్ విక్రయశాల గోదాం నుంచిచింతపండు బస్తాలను  గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న వైనం బయటపడింది. ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని స్థానికులు, భక్తులు అంటున్నారు. యాదగిరిగుట్ట కొండపైన గోదాం నుంచి 10 బస్తాల చింతపండు దొంగతనం చేస్తూ సురక్ష ఉద్యోగులు పట్టుపడ్డారు. పూర్తి స్థాయి ఈఓ లేకపోవడంతో అధికారులు  ఇష్ట రీతిన వ్యవహరిస్తున్నారు.

శిశు విక్రయాల ముఠా అరెస్టు

Child Trafficking Gang: ఏపీలో కలకలం రేపుతున్న చంటిబిడ్డల విక్రయం - NTV  Telugu

సూర్యాపేట
సూర్యాపేట సీసీఎస్ పోలీసులు ఒక  అక్రమ శిశు విక్రయాల ముఠా ను అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో  ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులున్నారు. ముఠా నుంచి 16 నెలల మగ  శిశువు స్వాధీనం చేసుకున్నారు. శిశువును.. చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. రాజస్థాన్, అలహాబాద్, గుజరాత్ రాష్ట్రాల నుంచి 22 మంది శిశువులను తెచ్చి విక్రయించినట్లు గుర్తించారు. ఒక్కో శిశువుకు.. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు విక్రయించినట్లు సమాచారం. నిందితుల్లో.. హైదరాబాద్,  సూర్యాపేట, విజయవాడ వాసులు వున్నారు. గతంలోను నిందితులపై శిశు విక్రయాల కేసులున్నట్లు సమాచారం.

యోగా దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష 

దేశవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాయుధ బలగాలు, తీర రక్షక  దళం అన్నీ బయలుదేరాయి - ది హిందూ

విశాఖపట్నం
జూన్ 21న విశాఖ వేది కగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లను ప్రపం చ స్థాయి ప్రమాణాలకు అనుగుణం గా చేయాలని, చిన్నపాటి సమన్వ యం లోపం కూడా తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. యోగా దినోత్సవ ఏర్పాట్లు, క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలన నిమిత్తం జిల్లాకు విచ్చే సిన ఆయన జిల్లా కలెక్టర్, జాయిం ట్ కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి మీటింగు హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై అధికారులకు దిశాని ర్దేశం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నారని, దాన్ని దృష్టి లో పెట్టుకొని ప్రతి ఒక్కరూ బాధ్య తాయుతంగా వ్యవహరించాలని, పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకొని కార్యక్రమాన్ని సజావుగా నిర్వహిం చాలని సూచించారు. ఇటీవల జరిగిన నీతీ ఆయోగ్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి యోగా దినో త్సవం గురించి, నిర్వహణ, ప్రపంచ రికార్డు సాధించేందుకు అనుసరించే విధానాల గురించి వివరించారని కృష్ణబాబు గుర్తు చేశారు. దీన్నిబట్టి యోగా దినోత్సవ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, దానికి తగ్గట్టుగా సన్నద్ధం కావాలని అన్నారు.

అప్పులు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య

Electric Shock: అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య | Four Farmers Suicide  or Electric Shock Amidst Agricultural Struggles

ఏలూరు
తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో ప్రైవేట్ ఫైనాన్సు రికవరీ ఏజెంట్లు ఒత్తిడి తేవడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి తోటలో ఆత్మహత్యకు పాల్పడి ఘటన పెదవేగి మండలం కే కన్నాపురం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. కమిలి భాస్కరరావు 35 స్థానికంగా కూలీ పనులు చేస్తూ భార్య పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు.

అయితే గత కొంత కాలం క్రితం మహేంద్ర ఫైనాన్స్ అనే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ నుండి గృహ నిర్మాణ అవసరాల నిమిత్తం అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదు దీంతో రికవరీ ఏజెంట్లు ఇంటికి అతనిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు

Related posts

Leave a Comment