సంక్షిప్త వార్తలు : 29-05-2025

సంక్షిప్త వార్తలు : 29-05-2025:గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు  అడిషనల్ sp రవికుమార్ పర్యవేక్షణలో  నార్త్ జోన్ డిఎస్పి మురళీకృష్ణ  మంగళగిరిలోని రత్నాల చెరువులో కార్డన్ సెర్చ్ జరిగింది.  120 మంది పోలీస్ సిబ్బందితో  తనిఖీలు చేసారు.  ఇద్దరు రౌడీ షీటర్ లను అదుపులోకి తీసుకున్నారు.

రత్నాల చెరువులో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

మంగళగిరి
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు  అడిషనల్ sp రవికుమార్ పర్యవేక్షణలో  నార్త్ జోన్ డిఎస్పి మురళీకృష్ణ  మంగళగిరిలోని రత్నాల చెరువులో కార్డన్ సెర్చ్ జరిగింది.  120 మంది పోలీస్ సిబ్బందితో  తనిఖీలు చేసారు.  ఇద్దరు రౌడీ షీటర్ లను అదుపులోకి తీసుకున్నారు.  సరైన పత్రాలు లేని  85 మోటార్ సైకిల్స్  సీజ్  చేసారు. అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయని ఆరా తీశారు అడిషనల్ ఎస్పి.  ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రవికుమార్ తో పాటు  మంగళగిరి డిఎస్పి మురళీకృష్ణ   మంగళగిరి టౌన్ సీఐ వినోద్ కుమార్, తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు , ఎస్ఐ మహేష్, ఎస్ఐ ప్రతాప్  పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపులకు బీ ఆర్ ఎస్ నేత బలి

బీఆర్‌ఎస్‌ Vs కాంగ్రెస్‌.. నేతల మధ్య పొలిటికల్‌ వార్‌ | Political Words  Exchange Between Congress And BRS Leaders | Sakshi

బోరబండ
కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపులకు బోరబండ డివిజన్ బీ ఆర్ ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్(30) ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్ని నెలలుగా సర్దార్ ని పలురకాలుగా  కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధిస్తున్నట్లు,  15రోజుల క్రితం సర్దార్ ఇంటిని సైతం బాబా ఫసియుద్దీన్ కూల్చివేయించినట్లు ఆరోపణ. అన్ని వైపుల నుంచి వేదింపులు ఎక్కువ కావడంతో సర్దార్  ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబికులు అంటున్నారు. ఈ నేపధ్యంలో బోరబండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ వద్ద కుటుంబసభ్యులు. స్థానికులు ఆందోళనకి దిగారు. సర్దార్ మృతికి కారణమైన బాబా ఫసియుద్దీన్ మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు. రెండున్నర ఏళ్ల వయస్సున్న పిల్లలు ఉన్నారంటూ కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతం అయ్యారు.

భార్యను హతమార్చిన భర్త

అనుమానంతో భార్యను హతమార్చిన భర్త | Women Brutually Murdred By Her Husband  In Kurnool | Sakshi

ములుగు
ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ రోడ్ వద్ద రాత్రి వివాహిత సంగారబోయిన సౌందర్య దారుణ హత్యకు గురైంది, భార్య భర్తల మధ్య నెల రోజుల నుండి గొడవలు జరుగుతుండడంతో వారం రోజుల క్రితం సౌందర్య గ్రామంలోని తల్లి గారి ఇంటికి వెళ్లిపోయింది .అయితే కొందరు పెద్దమనుషులు సర్దిచెప్పి లక్ష్మయ్య ఇంటికి తీసుకువచ్చి భార్య భర్తలు ఇద్దరికి నచ్చ చెప్పారు.

,డిగ్రీ పరీక్షలు జరుగుతున్న క్రమంలో. సౌందర్య కుమారుడు అజయ్ హనుమకొండకు వెళ్ళాడు, ఈ క్రమంలో సౌందర్య , లక్ష్మయ్యకు మధ్య గొడవ జరిగింది, బుధవారం ఉదయం నుంచి వారి కిరణా షాపు మూసి ఉండడంగా లక్ష్మయ్య సౌందర్య ఇద్దరు కనిపించలేదు, పరీక్షల అనంతరం అజయ్ బుధవారం రాత్రి ఇంటికి చేరుకోగా. ఇంటికి గడియ పెట్టి ఉంది. తలుపు తీసి చూసేసరికి తల్లి సౌందర్య చనిపోయి కనిపించింది, దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు ,ఘటన స్థలానికి సిఐ,ఎస్ఐలు చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, కాగా భార్యపై అనుమానంతో కుమారు ఇంట్లో లేని సమయంలో లక్ష్మీ హత్య చేసి పారిపోయాడని గ్రామస్తులు చెబుతున్నారు

లారీ బోల్తా…డ్రైవర్, క్లీనర్లకు గాయాలు

బోల్తాపడిన లారీ – క్లీనర్‌ మృతి – డ్రైవర్‌ కు గాయాలు - Prajasakti

రంగారెడ్డి
శంషాబాద్ పరిధిలోని రాల్లగూడ ఔటర్ రింగ్ రోడ్డు పై నుండి అదుపుతప్పి లారీ బోల్తా పడింది.  ఔటర్ పై నుండి జారిపడి సర్వీస్ రోడ్డుపై  లారీ పడింది. ఘటనలో  డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని  ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. లారీ శంషాబాద్ నుండి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

పోలీసు కస్టడీకి వంశీ అనుచరుడు

Vamsi Relief: ఆ కేసులో వంశీకి బిగ్ రిలీఫ్ | vallabhaneni vamsi relief  custody dismissal fake housing patta case suchi

విజయవాడ
వైసిపి మాజీ ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరుడు ఓలుపల్లి రంగాను రెండు రోజులు పోలీస్ కస్టడీకి విజయవాడ కోర్టు అనుమతించింది.ఇప్పటికే రంగా, బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో, అక్రమ మైనింగ్ కేసులో ఏ 2 గా  విజయవాడ సబ్జైల్లో రిమాండ్ ఉన్నాడు. కోర్టు ఆదేశాల అనుసారం రెండు రోజులు పోలీస్ కస్టడీ నిమిత్తం విజయవాడ సబ్ జైలు నుండి ఓలుపల్లి రంగాను గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.

Related posts

Leave a Comment