సంక్షిప్త వార్తలు : 30-05-2025

brife news

సంక్షిప్త వార్తలు : 30-05-2025:ప్రధాని మోదీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం సంచలనం రేపింది. ప్రధాని బిహార్ లో పర్యటిస్తున్న సమయంలో ఈ బెదిరింపులు రావడంతో నిఘా అధికారులు అప్రమత్తమయ్యారు. మోదీని చంపేస్తానని కాల్ చేసిన 35 ఏళ్ల సమీర్ కుమార్ రంజన్ ను అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా కీలక విషయాలు బహిర్గతమయ్యాయి.

ప్రధాని మోదీని చంపేస్తా అంటూ బెదిరింపు కాల్?

న్యూఢిల్లీ,
ప్రధాని మోదీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం సంచలనం రేపింది. ప్రధాని బిహార్ లో పర్యటిస్తున్న సమయంలో ఈ బెదిరింపులు రావడంతో నిఘా అధికారులు అప్రమత్తమయ్యారు. మోదీని చంపేస్తానని కాల్ చేసిన 35 ఏళ్ల సమీర్ కుమార్ రంజన్ ను అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. రంజన్ మెట్రిక్యులేషన్ కూడా పాస్ కాలేదని కీప్యాడ్ మొబైల్ ఫోన్తో బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

చంద్రబాబును కలిసిన మంద కృష్ణ 

MandaKrishna Madiga : సీఎం చంద్రబాబును కలిసిన మంద కృష్ణ మాదిగ

న్యూఢిల్లీ
ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడును ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ  ఢిల్లీలో కలిశారు. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అవార్డును అందుకున్న మందకృష్ణ శుక్రవారం సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా మందకృష్ణను సీఎం అభినందించారు. వర్గీకరణ ఉద్యమ ప్రస్థానాన్ని గురించి ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు.

తండ్రిపై కొడుకు దాడి

Karimnagar Crime: తండ్రిపై కొడుకు దాడి.. బ్యాట్ తో కిరాతకంగా కొట్టి.. - NTV  Telugu

జగిత్యాల
ఆన్లైన్ బెట్టింగ్ కోసం డబ్బులు ఇవ్వలేదని  కొడుకు తండ్రిపై కత్తితో దాడి చేసాడు. దాడి సమయంలో జరిగిన తోపులాటలో తండ్రి కొడుకులు ఇద్దరికి కత్తిపోట్లు తగిలాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం పాత కోర్టు భవనం సమీపంలో రాచకొండ దేవభూమయ్య (62) అనే వ్యక్తి తన కుమారుడు నవీన్ (33) నివాసముంటున్నారు.

కొంతకాలంగా నవీన్ మద్యం, ఆన్లైన్ బ్యాటింగ్కు బానిసగా మారి డబ్బులు పోగొట్టుకుంటున్నాడని  తండ్రి  తెలిపాడు. ఇదే సమయంలో గురువారం మళ్ళీ డబ్బులు కావాలని తండ్రితో గొడవకు దిగగా, డబ్బులు లేవని చెప్పిన తండ్రిపై కత్తితో దాడికి ప్రయత్నించాడు.గొడవలో తండ్రి కొడుకులు ఇద్దరికి గాయాలయ్యాయని, తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని  పోలీసులు వెల్లడించారు..

మహానాడు విజయవంతంలో నేతలకు సన్మానం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాస్  బీసీ సంక్షేమ శాఖ మంత్రి బి. సవితమ్మ  ఘన సత్కారం

Mahanadu 2025: తెలుగుదేశం పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజేతగానే  నిలిచింది: చంద్రబాబు |  chandrababu-wishes-to-party-workers-on-the-occasion-of-mahanadu

బద్వేలు
తెలుగుదేశం పార్టీ మహానాడు – 2025 కార్యక్రమం ఘనవిజయంగా ముగిసిన సందర్భంగా, ఈ విజయానికి కృషి చేసిన నాయకులకు కడప జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  సన్మానం చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాస్  బీసీ సంక్షేమ శాఖ మంత్రి బి. సవితమ్మ  రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  శాలువాలు కప్పి సన్మానించారు.

క్రిందికి వ్రేలాడుతున్న కరెంటు తీగలు, స్తంభాల ఫొటోలు, వీడియోలు వాట్సాప్ ద్వారా పంపండి, చర్యలు తీసుకుంటాం’
ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

కరెంట్‌ స్తంభాలకు కేబుల్స్‌ తొలగింపు-Namasthe Telangana

మైదుకూరు
మైదుకూరు నియోజకవర్గంలో ఎక్కడైనా విద్యుత్ తీగలు, స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయని అనిపిస్తే వెంటనే వీడియో కానీ, ఫొటో కానీ తీసి 7337433363 నంబరుకు వాట్సప్ చేస్తే వెంటనే 24 గంటల లోపు చర్యలు తీసుకుంటామని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ కార్యాలయంలో ప్రత్యేక బృందం ద్వారా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా వాట్సప్ చేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు.క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగంతో అవగాహన కల్పిస్తున్నామన్నార

Related posts

Leave a Comment