సంక్షిప్త వార్తలు : 30-05-2025:కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడానికే మహానాడు పరిమితమైందని మండిపడ్డారు.
కడపలో జరిగిన మహానాడు అట్టర్ ప్లాప్ : శ్రీకాంత్ రెడ్డి
కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడానికే మహానాడు పరిమితమైందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. గత అయిదేళ్ళ పాలనలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన విశ్వసనీయత వైఎస్ జగన్‌దేనని అన్నారు.
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య
రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామంలో దొడ్డి అశోక్(45) ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య .ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని బంధువుల ఆరోపణ,పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
బుద్వేల్ న్యూ గ్రీన్ సిటీలోని పార్క్ కబ్జా

రంగారెడ్డి
రాజేంద్రనగర్ సర్కిల్ బుద్వేల్ న్యూ గ్రీన్ సిటీలో 543 గజాల పార్కు స్థలాన్ని కబ్జాకు గురయింది. నకిలీ ఎల్ఆర్ఎస్ తో బహుళ అంతస్థుల భవనాన్నినిర్మిస్తున్నరని స్థానికులు ఆరోపించారు. కబ్జాదారులపై పై చర్యలు తీసుకో వాలని సంబంధిత అధికారుల చూట్టు తిరిగినఅక్రమార్కలవైపు వత్తసు పలుకు తున్నారని వారు అంటున్నారు. రాజేంద్రనగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఏసీపిలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ వివరణ కోరిన కాలం దాటేస్తున్నారు.
ఇదే అదునుగా అక్రమార్కుడు నాలుగు అంతస్తులకు పైగా నిర్మాణాలు చేపట్టారు. రాజేంద్రనగర్ బీజేపీ యువ మోర్చా కో కన్వీనర్ మగాని శివకుమార్ దక్షిణం జోన్ కమిషనర్ కార్యాలయంలో కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. న్యూ గ్రీన్ సిటీకాలనీలో3816.89 గజాలతో ఫ్లాట్లు చేసారు. అందులో 543 గజాల పార్కు స్థలాన్ని వదిలిపెట్టారు. ఈపార్క్ పై కన్నేసి అట్టి పార్కు స్థలాన్ని కొందరు అక్రమార్కులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడు తున్నారు. నిర్మాణం కోసం తీసుకున్న పర్మిషన్ కూడా అక్రమపర్మిషన్, అని ఈ పార్కు స్థలాన్ని కాపాడాలని స్థానికుడు మగని శివ కోరారు.
అతివేగంతో డివైడర్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి

విశాఖ
రాష్ట్రంలో రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి ఈ ప్రమాదాల్లో అనేకమంది కుటుంబాలకు దూరం అవుతున్నారు త్వరగా వెళ్లిపోవాలని తాపత్రయంతో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనదారులు గమ్యస్థానంలో చేరడానికి అతివేగంతో వెళ్తున్నారు దీంతో అనేక ప్రమాదానికి గురై అక్కడకే మరణించిన సంఘటనలు చాలా చోటు చోటుచేసుకున్నాయి విశాఖ నగరంలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు సంఘటన స్థలం చేరుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా

తిరుమల
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. అభిషేక సేవలో కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
