సంక్షిప్త వార్తలు:05-05-2025

rains-in-telangana

సంక్షిప్త వార్తలు:05-05-2025:ప్రసవమైన మహిళ కడుపులో వైద్యులు నిర్లక్ష్యంతో కాటన్ ప్యాడ్స్ మరిచిపోయారని సదరు బాలింత కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రాణాపాయస్థితిలో మహిళ వుందని ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఘటన, గత వారం రోజుల క్రితం మండల కేంద్రంలోనీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఉప్పల్ గ్రామానికి చెందిన తిరుమల అనే మహిళ డెలివరీ సమయంలో వైద్యులు క్లాత్ అందులోనే వుంచి కుట్లు వేయడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.

వడగళ్ల వర్షానికి పంట నష్టం

మెదక్ జిల్లా
మాసాయిపేట మండలం పోతాన్ పల్లి లో ఆదివారం  సాయంత్రం కురిసిన వడగళ్ల వర్షానికి ఎకరా వరి పొలం పంట పంట నష్టం వాటిల్లిందని రైతు తలారి విజయ్ ఆవేదన వ్యక్తంచేశారు.  అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నానని పూర్తిగా పంట నష్టం జరుగుతుందని ప్రభుత్వం అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాడు.

మహిళ కడుపులో కాటన్ ప్యాడ్స్
కమాపూర్ ఆసుపత్రిలో దారుణం

Viral: మహిళకు విపరీతమైన కడుపునొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. టెస్టులు  చేసిన డాక్టర్లు షాక్.. - Telugu News | Large Piece Of Cloth Found In UP  Woman's Stomach 2 Years After ...

హనుమకొండ
ప్రసవమైన మహిళ కడుపులో వైద్యులు నిర్లక్ష్యంతో కాటన్ ప్యాడ్స్ మరిచిపోయారని సదరు బాలింత కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రాణాపాయస్థితిలో మహిళ వుందని ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఘటన, గత వారం రోజుల క్రితం మండల కేంద్రంలోనీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఉప్పల్ గ్రామానికి చెందిన తిరుమల అనే మహిళ డెలివరీ సమయంలో వైద్యులు క్లాత్ అందులోనే వుంచి కుట్లు వేయడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.
కడుపు నొప్పితో  మళ్ళీ ఆసుపత్రికి వచ్చింది.  చాలా సేపటివరకు వైద్యులు ఎవరు రాకపోగా హాస్పిటల్  ఆయవైద్యం చేసింది. అందుబాటులో లేని వైద్యులు, ఫోన్ కాల్ ద్వారానే వైద్య తతంగం సిబ్బంది నడిపిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చి మహిళా బంధువులు నిలదీయగా ఘటన  వెలుగు చూసింది. డెలివరీ సమయంలో మొబైల్ ఫోన్లు మాట్లాడుతూ పట్టింపు లేకుండా వ్యవహరించారని బంధువుల ఆరోపణ.ఆసుపత్రి సూపరిండెంట్ నిర్లక్ష్య ధోరణి తోనే వైద్య సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.మరో ప్రాణం బలి కాకముందే ఆసుపత్రి ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం
ట్రాక్టర్, గడ్డివాము దగ్దం

ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం..
వరంగల్
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారు కొత్తపల్లి రోడ్డు పై ట్రాక్టర్లో తరలిస్తున్న గడ్డివాము కు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి.   గడ్డివాము తో పాటు ట్రాక్టర్ దగ్దం అయింది.  ప్రమాదాన్ని గ్రహించి  డ్రైవర్ మరియు సహాయకులు తప్పించుకున్నారు.
ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసారు.

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

శ్రీతేజ్‌ను పరామర్శించిన నిర్మాత అల్లు అరవింద్‌, బన్నీవాసు | Allu Aravind  Visited To Sri Tej Who Recently Shifted To Rehabilitation Centre | Sakshi

అల్లు అర్జున్ సినిమా రిలీజ్ లో గాయాపడిని శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు. రీ హాబ్  కు వెళ్లి డాక్టర్లను కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్ఆరు. శ్రీ తేజ్ కోలుకోవటం కోసం మా కుటుంబం అంతా ఎదురుచూస్తోంది. శ్రీతేజ్  రోజురోజుకు కోలుకుంటున్న విషయం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. శ్రీ తేజ్ చికిత్సకు సహకరిస్తున్నారు అని డాక్టర్లు వెల్లడించారు. ఇప్పటికే 2 కోట్లు శ్రీతేజ్ అకౌంట్ లో  అల్లు అర్జున్, పుష్ప యూనిట్ డిపాజిట్ చేసారు. త్వరలోనే శ్రీ తేజ్ మనందరి మధ్య సాధారణల పిల్లల్లా ఉంటాడని అరవింద్ ఆశాభావం వ్యక్తం చేసారు.

సైనిక్ స్కూళ్లలో తెలంగాణ విద్యార్దులను కొనసాగించాలి

సైనిక్ స్కూల్ గురించి | పూర్తి వివరాలు - క్రాంతి కీన్: సైనిక్ స్కూల్  కోచింగ్ | నవోదయ | RMS

హైదరాబాద్
కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేట్ తో  మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడాదరు. ఆంధ్రా ప్రదేశ్ లో సైనిక్ స్కూల్స్ లో 67 శాతం లోకల్ కోటా లో తెలంగాణ  విద్యార్థులను తొలగించడం తో వేలాది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ లో సైనిక్ స్కూల్స్ ప్రారంభం అయ్యే వరకు తెలంగాణ విద్యార్థులకు ఆంధ్రా లో లోకల్ కోటా ఉంచాలని ఫోన్ లో విజ్ఞప్తి చేసారు. మంగళవారం  సాయంత్రం కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలవనున్నారు. అప్పటివరకు తల్లిదండ్రులు సంయమనం తో ఉండాలని విజ్ఞప్తి చేసారు.

Related posts

Leave a Comment