సంక్షిప్త వార్తలు:05-07-2025

CHOs staged an innovative protest in front of the Amalapuram Collector's office, wearing blindfolds.

సంక్షిప్త వార్తలు:05-07-2025:అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట సి హెచ్ ఓ లు  కళ్ళకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన దీక్షకు దిగారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా  అమలాపురంలో పది రోజులుగా హెల్త్ ఆఫీసర్ల ఆందోళన కొనసాగుతోంది. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ కళ్ళకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన దీక్షకు దిగారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసారు.

కళ్లకు గంతలు కట్టుకుని సీహెచ్ వోల దీక్ష

అమలాపురం
అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట సి హెచ్ ఓ లు  కళ్ళకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన దీక్షకు దిగారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా  అమలాపురంలో పది రోజులుగా హెల్త్ ఆఫీసర్ల ఆందోళన కొనసాగుతోంది. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ కళ్ళకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన దీక్షకు దిగారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసారు. ఎన్ హెచ్ ఎమ్ ఉద్యోగులతో సమానంగా 23% శాతం వేతన సవరణ జరపాలని డిమాండ్ చేసారు.

క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి , నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. గత పది రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యర్తం చేసారు. ఇప్పటికైనా అధికారులు సంఘ నాయకులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసారు. వేతన సవరణ అంశం , పెండింగ్ బకాయిలు , 6 సంవత్సరాలుగా ఒక్క రూపాయి వేతనం పెరగక పోగా రెండు సంవత్సరాలుగా ఉన్న బకాయిలు కోసం, ఇన్సెంటివ్స్ విషయంలో కూడా ఉన్న అపోహలు తీసివేసి కేవలం సి హెచ్ ఓ చేసే పని ఆధారంగానే ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఇప్పటికైనా మా ఆవేదన పట్టించుకొని పరిష్కరించాలని అన్నారు.

రాష్ట్రం ఒక గొప్ప నాయుకుడిని కోల్పోయింది

టీడీపీలో విషాదం - మాజీ ఎంపీ పాలకొండ రాయుడు కన్నుమూత

రాయచోటి
రాష్ట్రం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని, రాయచోటి టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ రాయుడు మరణం టిడిపి కి, జిల్లా ప్రజలకు తీరని లోటు అని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. వారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణానికి చేరుకుని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ రాయుడు భౌతిక గాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాలకొండ రాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేవలం ప్రజల కోసమే సుగవాసి పాలకొండ రాయుడు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి గొప్ప వ్యక్తిని అన్నారు.

నాలుగు శతాబ్దాలుగా రాజకీయ జీవితం అనుభవించిన గొప్ప నాయకుడు పాలకొండ రాయుడు అని అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ప్రజల కు సేవలందించారనీ గుర్తు చేశారు. ప్రజల కోసమే మొదటినుంచి తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పాలకొండ రాయుడు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు పాలకొండ రాయుడు కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందన్నారు. టిడిపి తరపున, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ల తరుపున పాలకొండ రాయుడు మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నామన్నారు. పాలకొండ రాయుడు కుటుంబానికి ఎల్లప్పుడూ టిడిపి అండగా ఉంటుందని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు వల్ల శ్రీనివాసరావు లు తెలిపారు.

గౌలిపుర స్లాటర్ హౌజ్ ను పరిశీలించిన జీహెచ్ఎంసి కమిషనర్

నల్గొండ నూతన కలెక్టర్‌గా ఆర్.వి. కర్ణన్ - Mana Telangana

హైదరాబాద్
పాతబస్తీ గౌలిపుర మేకల మండి కమేల స్లాటర్ హౌస్ ను జి.హెచ్.ఎం.సి. కమిషనర్ ఆర్. వి . కర్ణన్ పరిశీలించిన అనంతరం ఆరికటిక సంఘం నాయకులు. స్థానికుల తో స్లాటర్ హౌస్ నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ప్రారంభం కాకపోవడానికి కారణాలు ఏమిటి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్. వి కర్ణాన్ . అరె కటిక సంఘం నాయకులతో స్లాటర్ హౌస్ ను త్వరలోనే ప్రారంభం కల్పించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ వెంకన్న. గౌలిపుర కార్పొరేటర్ ఆలే భాగ్యలక్ష్మి .స్థానిక నాయకుల తో పాటు స్థానికులు పాల్గొన్నారు.

పైనికదాడలపై హర్షం

Heartbroken Indian sporting fraternity mourns Pahalgam terror attack -  Jammu Links News

సికింద్రాబాద్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ దాడి చేసి గట్టిగా బుద్ధి చెప్పిందని సికింద్రాబాద్ లోని యువకులు సంబరాలు జరుపుకున్నారు.పార్టీలకతీతంగా యువకులంతా ఏకమై త్రివర్ణ పతాకాలతో సీతాఫలమండిలో ర్యాలీ నిర్వహించి, మిఠాయిలు తినిపించుకుంటూ జయజయ ధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది భాస్కర గిరి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూరం పేరిట ఈ రోజు తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో మన భారత ఆర్మీ పాకిస్థాన్ లోని 9ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 80మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిందని తెలిపారు.

ఇది పహల్గాంలో అమరులైన టూరిస్టులపై జరిగిన దాడికి ప్రతీకార చర్య మాత్రమే కాదు, ఆ అమరులకు ఘనమైన నివాళిగా పేర్కొన్నారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని వేడుకున్నారు. దేశాధినేత ఎలా ఉండాలి అంటే మోడీ లాగా ఉండాలని చెప్పుకునే విధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీని చూసి భారతీయులంతా గర్వపడుతున్నట్లు వెల్లడించారు.

పలు ఉత్తరాది ప్రాంతాల విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా

Vaartha Telugu News paper | Latest Telugu News | Google News

రంగారెడ్డి
ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ప్రముఖ ఎయిర్ ఇండియా కంపెనీ ఈరోజు నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోద్పూర్, అమృత్సర్, భుజ్, జాంనగర్, చండీగఢ్, రాజ్కోట్ ప్రాంతాలకు తమ విమాన సర్వీసు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అమృత్సర్ నుండి విదేశాలకు వెళ్లే రెండు అంతర్జాతీయ విమానాలను కూడా ఢిల్లీ కి ఎయిర్ ఇండియా అధికారులు మార్చారు. ప్రస్తుతం యుద్ధమేఘాల పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

Related posts

Leave a Comment