సంక్షిప్త వార్తలు:05-1-2025:సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ మీడియా సమావేశం నిర్వహించారు. , ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరు తో కర్రగుట్టలను చుట్టుముట్టి మావోయిస్టులను, ఆదివాసులను చంపుతున్నారు మావోయిస్టులు చర్చలకు సిద్ధమని లేఖ రాసినానీ కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు లతో శాంతియుతంగా చర్చలు జరపాలి.
ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి
యాదాద్రి భువనగిరి
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ మీడియా సమావేశం నిర్వహించారు. , ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరు తో కర్రగుట్టలను చుట్టుముట్టి మావోయిస్టులను, ఆదివాసులను చంపుతున్నారు మావోయిస్టులు చర్చలకు సిద్ధమని లేఖ రాసినానీ కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు లతో శాంతియుతంగా చర్చలు జరపాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలను పరిష్కరించడం మీద లేదని అన్నారు.
అంతరాష్ట్ర మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్
జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్
నల్గోండ
గత కొన్ని రోజులుగా వరుసగా తెలంగాణ లోని దామరచర్ల, నల్గొండ పట్టణం, నార్కట్పల్లి, ఇబ్రహీంపట్నంమరియు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్టూర్, పొన్నూరుపట్టణాలలో రాత్రి సమయంలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిల్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ను నల్గోండ పోలీసులు అరెస్టు చేసారు. నిందితులనుంచి పద్నాలుగు ఖరీదైన మోటార్ సైకిల్ లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నలమాలయెర్రబ్బాయి @ లూథర్, గుంజి అంకమ రావు, మట్టిపల్లి శ్రీకాంత్ లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.
మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్

విజయవాడ
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. కృష్ణా జిల్లా కంకిపాడులోని ఆయానా కన్వెన్షన్ లో జరిగిన ఈ వివాహ మహోత్సవ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి రాకను పురస్కరించుకుని మంత్రి లోకేష్, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛం అందించి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి నారా లోకేష్ నూతన వధూవరులు నిహార్, శ్రీ సాయి నర్మదలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
హత్య కేసులో నిందితుల అరెస్టు

కాకినాడ
ఈనెల 27వ తేదీన కాకినాడలో జరిగిన యువకుడి హత్య చేసిన కేసును కాకినాడ టూటౌన్ పోలీసులు ఛేదించారు.. బుధవారం కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను మీడియాకు వివరించారు.. కాకినాడ బ్యాంక్ వీధికి చెందిన మీసాల గౌతమ్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఆటో దగ్గరకు వెళ్తుండగా అతని స్నేహితులైన నలుగురు యువకులు ఆటో డ్రైవర్ ఆపి మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వమని అడిగారు లేవని చెప్పడంతో గొడవపడి కాంక్రీట్ సిమెంట్ రాళ్లతో గౌతం ముఖంపై బలంగా కొట్టారు తీవ్రంగా గాయపడిన మృతుడు అదే రోజు మృతి చెందాడని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్ చేశామని తెలిపారు..**
కర్మయోగి పుస్తకం ఆవిష్కరణ

కాకినాడ
సీనియర్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, కైట్ విద్యాసంస్థల గౌరవాధ్యక్షులు యం గోపాలకృష్ణ రాసిన కర్మయోగి పుస్తకాన్ని కాకినాడ జేఎన్టీయూ కళాశాలలో ఆవిష్కరించారు.ఈకార్యక్రమంలో కలెక్టర్ షాన్ మోహన్, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు, మేజర్ జనరల్ ప్రసాద్, ప్రొఫెసర్ మురళీకృష్ణ, కైట్ కాలేజ్ చైర్మన్ పోతుల విశ్వం, కైట్ డైరెక్టర్ ఐశ్వర్యలు ఈపుస్తకావిష్కరణలో పాల్గొని పుస్తకాలు చదవడం వల్ల జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో విద్యార్థులకు తెలియజేశారు. అలాగే మాజీ ఐఏఎస్ అధికారి ఎం గోపాలకృష్ణ నాయుడు కాకినాడ ప్రాంతంలో గోదావరి ఎరువులు కర్మాగారాన్ని నిర్మించడానికి ఆయన కీలకపాత్ర వహించారని వక్తలు కొనియాడారు.ఈకార్యక్రమంలో కైట్ విద్యార్థులు,గోదావరి ఎరువుల కర్మాగారం విశ్రాంతి ఉద్యోగులు, వివిధ రాజకీయ నాయకులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
