Amaravati :ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్ ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. ఎయిమ్స్‌లో ఉన్న విభాగాలతోపాటు తాజాగా గుండెకు సంబంధించి సర్జరీ విభాగాన్ని ప్రారంభించినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ అహంథెం సాంతా సింగ్ తెలిపారు.
ఎయిమ్స్ లో రోబోటిక్ సర్జరీలు
అమరావతి, మే 14
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్ ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. ఎయిమ్స్‌లో ఉన్న విభాగాలతోపాటు తాజాగా గుండెకు సంబంధించి సర్జరీ విభాగాన్ని ప్రారంభించినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ అహంథెం సాంతా సింగ్ తెలిపారు. ఎయిమ్స్‌లో గుండెకు సంబంధించిన అన్ని పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలూ అందుబాటులోకి రాగా.. ఇటీవల ఓపెన్ హార్ట్ సర్జరీని కూడా విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ఎయిమ్స్‌లో రోబోటిక్ సర్జరీలను ప్రారంభించామన్నారు.ఎయిమ్స్‌లో నర్సింగ్ కళాశాల విద్యార్థులతో ప్రపంచ నర్సింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాక్‌థాన్‌ను నిర్వహించారు. ఎయిమ్స్ నుంచి మంగళగిరి అంబేడ్కర్ విగ్రహం కూడలి వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కార్డియాక్ అరెస్ట్ సమయంలో అత్యవసరంగా నిర్వహించాల్సిన సీపీఆర్‌పై అవగాహన కల్పించారు.
మంగళగిరిలోని ఎయిమ్స్ని ముఖ్యమంత్రికి అత్యవసర వైద్యసేవల నిమిత్తం కంటింజెన్సీ ఆసుపత్రిగా కూడా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇప్పటి వరకు మణిపాల్ ఆసుపత్రి ఒక్కటే కంటింజెన్సీ ఆస్పత్రిగా ఉంది.కేంద్రం విభజన చట్టం ప్రకారం అమరావతి పరిధిలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు అక్కడ పనుల్ని వేగవంతం చేస్తూ ఒక్కో విభాగాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఎయిమ్స్‌లో ప్రజలకు సేవలు కూడా అందుతున్నాయి. ఈ మేరకు ఇటీవల ఎయిమ్స్‌లో ట్రామా కేర్ సెంటర్ నిర్మాణం కోసం భూమిని కేటాయించారు. నేషనల్ హైవే పక్కన 10ఎకరాల భూమి కోసం ప్రతిపాదనలు పంపించారు. 183 ఎకరాల్లో నిర్మించిన ఎయిమ్స్‌లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కాలేదు.. ఈ విషయాన్ని గమనించి, అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ చొరవతో.. ఎయిమ్స్‌కు వెళ్లే దారిలో నేషనల్ హైవే పక్కన కొలనుకొండలో 10 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు అక్కడ ట్రామా కేర్ ఏర్పాటుకు అడుగులుపడుతున్నాయి. ఎయిమ్స్‌కు 965 పడకలు మంజూరు కాగా.. ప్రస్తుతం 650 ఉన్నాయి. ఈ సంఖ్యను పెంచడంతో పాటు ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు
విమ్స్ లో మోకాళ్ల ఆస్పత్రికి ఆపరేషన్లు
విశాఖపట్నంవాసులకు తీపికబురు.. రూపాయి ఖర్చు లేకుండా మోకాళ్ల నొప్పులకు ఫ్రీగా ట్రీట్మెంట్ అందుతోందని మీకు తెలుసా. అవును నగరంలో విమ్స్ ఆస్పత్రిలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. విమ్స్‌లోని ఎముకల విభాగానికి ఎక్కువ మంది వస్తుండగా.. మోకాళ్ల నొప్పులకు అత్యాధునిక ప్లాస్మా చికిత్స ఉచితంగా అందుబాటులో ఉంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేలల్లో ఖర్చయ్యే ఈ చికిత్సను విమ్స్‌లో ఉచితంగా అందిస్తున్నారు. దీని ద్వారా చాలా మంది నొప్పుల నుంచి ఉపశమనం పొందుతున్నారు. విమ్స్ ఆసుపత్రి ఇప్పుడు కేజీహెచ్‌కి మరో ఆసుపత్రిలా ఉపయోగపడుతుంది. కేజీహెచ్ దూరంగా ఉన్నవాళ్లు, శివారు ప్రాంతాల వాళ్లు ఇక్కడికి వస్తున్నారు. ప్రతిరోజు 500 నుంచి 700 మంది ఓపీకి వస్తుంటారు. అందులో 180 నుంచి 225 మంది వరకు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటారు. అన్ని విభాగాలకన్నా ఎముకల సమస్యలతో వచ్చేవాళ్లే ఎక్కువ.
విమ్స్‌లో మోకాళ్ల నొప్పులకు సరికొత్త ప్లాస్మా ట్రీట్మెంట్ ఉంది. బయట ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా డబ్బులు అవుతాయి. కానీ విమ్స్‌లో మాత్రం ఉచితంగా చేస్తున్నారు. దీని ద్వారా ఏటా వేల మంది నొప్పులు తగ్గిపోతున్నాయి. 50 ఏళ్లు దాటకుండానే చాలామంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారని.. కొంతమందికి మోకాళ్ల చిప్పలు అరిగిపోయి నడవలేని పరిస్థితి వస్తుంది. దీనికి ప్లాస్మా థెరపీ అనే కొత్త వైద్యం అందుబాటులో ఉంది.బయట ఆసుపత్రుల్లో ఈ ట్రీట్మెంట్ ఖరీదైనది కావడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి విమ్స్‌లో ఉచితంగా ప్లాస్మా చికిత్స అందిస్తున్నాము అన్నారు. ఈ ట్రీట్మెంట్లో మోకాళ్లలోని రక్తాన్ని తీసి, దాని బదులు ప్లాస్మాను ఎక్కిస్తారు. ఇలా రెండు మూడు సార్లు చేస్తే రోగులు నార్మల్‌గా నడవగలుగుతారు. ఈ విభాగంలో 5 మంది డాక్టర్లు, 10 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడేవాళ్లకు పీఆర్పీ విధానంలో ట్రీట్మెంట్ చేస్తున్నారు అక్కడి డాక్టర్లు. దీనివల్ల రోగులు నొప్పి లేకుండా నడవగలుగుతారని.. ఈ తరహా చికిత్స రాష్ట్రంలో మరే ఇతర ప్రభుత్వాసుపత్రిలో లేదని.. ఆ ఘనత విమ్స్కే దక్కుతుందంటున్నారు. ఎముకల విభాగం ఓపీకి ఎక్కువ మంది వస్తుండగా.. ఫిజియోథెరపీతోనే చాలామందికి నొప్పులు తగ్గుతున్నాయట.. అవసరమైన వాళ్లకు ఆపరేషన్లు కూడా చేస్తున్నారు డాక్టర్లు. విమ్స్‌లో ఏడాదిలో మోకాళ్ల చిప్పల మార్పిడి – 38, తుంటి ఎముక – 22, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపి(పీఆర్పీ) (మోకాళ్ల నొప్పులు ఉన్న వారికి) – 1800, ఫిజియో థెరపి – 18,000 పూర్తిచేశామంటున్నారు. విశాఖవాసులు ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు విమ్స్ డాక్టర్లు.
Read more:Kurnool : కోట్ల ఇంటి పేరు కనుమరుగునా
