Anantapuram : బెంగళూరు లాయర్లతో జగన్ వరుస మీటింగ్స్

Jagan holds series of meetings with Bengaluru lawyers

Anantapuram : వచ్చే నాలుగేళ్ల తర్వాత మన ప్రభుత్వమే వస్తుందని జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వచ్చే నాలుగేళ్ల తర్వాత పరిస్థితి ఏమో కానీ.. ఇప్పుడు మాత్రం పార్టీ పరిస్థితి తీవ్ర సంకట స్థితిలో పడిపోయింది. ముఖ్యంగా మద్యం కుంభకోణం పార్టీ మొత్తాన్ని చుట్టేస్తుంది.

బెంగళూరు లాయర్లతో జగన్ వరుస మీటింగ్స్

అనంతపురం, మే 19
వచ్చే నాలుగేళ్ల తర్వాత మన ప్రభుత్వమే వస్తుందని జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వచ్చే నాలుగేళ్ల తర్వాత పరిస్థితి ఏమో కానీ.. ఇప్పుడు మాత్రం పార్టీ పరిస్థితి తీవ్ర సంకట స్థితిలో పడిపోయింది. ముఖ్యంగా మద్యం కుంభకోణం పార్టీ మొత్తాన్ని చుట్టేస్తుంది.వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా? వరుస అరెస్టులతో కలవరపాడుకు గురవుతున్నారా? బెంగళూరులో న్యాయ నిపుణులతో సమావేశం అవుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రధాన నేతలంతా అరెస్టులు అవుతున్నారు. సీనియర్ నేతలు సైడ్ అయిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.

వచ్చే నాలుగేళ్ల తర్వాత మన ప్రభుత్వమే వస్తుందని జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వచ్చే నాలుగేళ్ల తర్వాత పరిస్థితి ఏమో కానీ.. ఇప్పుడు మాత్రం పార్టీ పరిస్థితి తీవ్ర సంకట స్థితిలో పడిపోయింది. ముఖ్యంగా మద్యం కుంభకోణం పార్టీ మొత్తాన్ని చుట్టేస్తుంది.అయితే పార్టీకి ఈ పరిస్థితి వస్తుందని ముందే తెలుసు అని జగన్మోహన్ రెడ్డిచాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన ఊహించని విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పై ఫోకస్ పెడుతోంది కూటమి. ముఖ్యంగా అప్పటి అధికారులను సైతం వదలడం లేదు. అధికారులే సూత్రధారులు కావడంతో జగన్మోహన్ రెడ్డి కలవర పడుతున్నారు. రాజకీయ నేతల వద్ద ఏ సమాచారం ఉండదు. వారి నుంచి సేకరించినా ఏం జరగదు. కానీ అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారుల వాంగ్మూలం చాలా ఇబ్బందుల్లో పెడుతుంది.

జగన్మోహన్ రెడ్డికి అది తెలియంది కాదు. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలంతా కటకటాల పాలయ్యారు. తాజాగా ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి సైతం జైలుకు వెళ్లారు.అయితే జైలు పరిణామాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఎవరు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూడడం లేదు. ఒకరిద్దరు నాయకులు వస్తున్నా వారు తమకెందుకులే అన్నట్టు ఇన్వాల్వ్ కావడం లేదు. ముఖ్యంగా రాయలసీమలోని జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు, సొంత సామాజిక వర్గ నేతలు మాత్రమే ఆయన వెంట ఉన్నారు. అంతెందుకు తాజా మాజీ మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖం చూడడం లేదు. ప్రస్తుతానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుదాం. అలాగని యాక్టివ్ గా ఉండొద్దు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకుందాం. అన్న నిర్ణయానికి వచ్చారు చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.

అయితే పార్టీలో ఈ పరిస్థితి చూస్తున్న జగన్మోహన్ రెడ్డి కలవరపాటుకు గురవుతున్నారు. ఇబ్బంది ఉంటుందని గుర్తించామని.. కానీ అంచనాలకు మించి ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి.ప్రస్తుతం బెంగళూరులోనేఎక్కువగా గడుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అక్కడే పార్టీ ముఖ్య నేతలతో పాటు న్యాయవాదులతో భేటీ అవుతున్నారు. కేసులకు గురవుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను బయటకు ఎలా తెచ్చేది అన్న వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు మద్యం కుంభకోణం లో నిందితులంతా జైల్లోనే ఉన్నారు. అందులో ఏ ఒక్కరు అప్రూవర్ గా మారిన ఇబ్బందులు వస్తాయని తెలుసు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా న్యాయ నిపుణులతో వరుసగా భేటీలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

Read more:Andhra Pradesh : బీజేపీకి దగ్గర అయ్యేపనిలో జగన్

Related posts

Leave a Comment