Andhra Pradesh : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ విస్తరణకు సిద్ధమయ్యారు. వచ్చే నెలలో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ నేతలను పక్కన పెట్టి మరీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.
ఆ నలుగురు ఎవరు..
నెల్లూరు, మే 13
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ విస్తరణకు సిద్ధమయ్యారు. వచ్చే నెలలో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ నేతలను పక్కన పెట్టి మరీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు… ఎవరికీ సీనియర్ నేతలన్న వారికి మంత్రి పదవులు దక్కలేదు. ఎన్నోఏళ్లుగా తాము పార్టీని నమ్ముకుని ఉంటే తమకు విషయంలో ఇలా జరిగిందేమిటి? అనేక మంది సీనియర్ నేతలు నొచ్చుకున్నారు. బయటపడకపోయినా మనసులో మాత్రం అసంతృప్తిగానే ఉంటున్నారు. దీంతో విస్తరణలో అయినా తమకు స్థానం దక్కుతుందేమోనని భావిస్తున్నారు.చంద్రబాబు ఒకరకంగా యువకులను మంత్రులుగా చేసి పాలనను పరుగు పెట్టించాలని భావించారు. కొందరయితే భవిష్యత్ లో లోకేష్ నాయకత్వం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారన్న టాక్ కూడా బలంగా వినిపించింది టాలెంట్ కన్నా, సీనియారిటీ కన్నా కొత్త వాళ్లకు అవకాశమివ్వడంలో మర్మం తెలియక అనేక మంది పార్టీ కార్యకర్తలు కూడా ఒకరకంగా ఇలా ఎందుకు జరిగిందబ్బా? అని తమలో తాము ప్రశ్నించుకున్నారు.
కానీ ఎవరికి సరైన సమాధానం మాత్రం దొరకలేదు. నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు సీనియర్లను పక్కన పెట్టడం గతంలో ఎన్నడూ జరగకపోవడంతో దీనికి కారణాలేమిటన్న దానిపై లోతుగానే తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఏడాదిలోనే వారిలో కొందరికి సీన్ లేదని అర్థమయింది.తమ శాఖలపై పట్టు సంపాదించుకోవడం మాట అటుంచి కనీసం వారికి అప్పగించిన బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారని చంద్రబాబు కొంత ఆందోళన చెందుతున్నారని తెలిసింది. జిల్లాల్లోనూ, నియోజకవర్గాల్లో నేతల మధ్య, కూటమి నేతల మధ్య సయోధ్యకు కూడా వీరు ప్రయత్నించడం లేదని, కొందరు అసలు జిల్లాల పర్యటన చేపట్టకపోవడంపై కూడా చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పాటు వైసీపీ నుంచి వస్తున్న విమర్శలకు సరైన సమాధానం కూడా మంత్రులు చెప్పలేకపోతున్నారన్న భావన చంద్రబాబులో బలంగా నాటుకుపోయింది.
దీంతో మంత్రి వర్గ విస్తరణంలో ముగ్గురు నుంచి నలుగురిని తప్పించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుంది.వచ్చే నెలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. జనసేన ఎమ్మెల్సీ నాగబాబును మంత్రివర్గంలో తీసుకునే కార్యక్రమం ఒకటుంది. ఈ కార్యక్రమంలోనే ముగ్గురి నుంచి నలుగురు మంత్రులను తప్పించి వారి స్థానంలో సీనియర్ నేతలను మంత్రులుగా చేయాలని భావిస్తున్నారు. ఈ మంత్రి వర్గ విస్తరణలో తమకు అవకాశం గ్యారంటీ అని సీనియర్ నేతలు గట్టిగా నమ్ముతున్నారట.ఇక మరో రెండేళ్ల తర్వాత మళ్లీ విస్తరణ చేపట్టి ఎన్నికల టీం ను కూడా చంద్రబాబు సిద్ధం చేసుకుంటారని, అందుకోసం యువనేతల పదవులకు ఎసరు వచ్చినట్లేనన్న ప్రచారం పార్టీలో ఊపందుకుంది. అందుకే జూన్ నెల వస్తుందంటే మంత్రుల గుండెల్లో దడ మొదలయిందట.
