Andhra Pradesh :ఏపీ లిక్కర్ స్కాం కేసు వైసీపీలో ప్రకంపనలు రేపుతోందా? కేసులో గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులు అరెస్టులు, రిమాండ్ బాట పడుతుండడం ఫ్యాన్ పార్టీలో గుబులు రేపుతోందా? ఇప్పటికే సిట్ పలువురు ముఖ్య నేతలను, ఉన్నతాధికారులను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తోంది.
జగన్ అరెస్ట్ తప్పదా..
కడప, మే 20
ఏపీ లిక్కర్ స్కాం కేసు వైసీపీలో ప్రకంపనలు రేపుతోందా? కేసులో గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులు అరెస్టులు, రిమాండ్ బాట పడుతుండడం ఫ్యాన్ పార్టీలో గుబులు రేపుతోందా? ఇప్పటికే సిట్ పలువురు ముఖ్య నేతలను, ఉన్నతాధికారులను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసులో గత ప్రభుత్వ హయాంలో సీఎంవోలో పనిచేసిన కీలక అధికారులంతా ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతుండడంతో వైసీపీలో గుబులు రేపుతోందట.జగన్ సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది. అలాగే మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను కూడా సిట్ అరెస్ట్ చేసి విచారిస్తోంది. అయితే సిట్ విచారణలో ఈ ముగ్గురు కీలక నిందితులు ఏం చెప్పారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ప్రాథమిక విచారణలో తేలిన అంశాలన్నింటిని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. దీంతో ముందు ముందు మరిన్ని కీలక అరెస్టులు జరిగే ఛాన్స్ ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.లిక్కర్ స్కాంలో అన్నీతానై వ్యవహరించిన ఏ1 రాజ్ కసిరెడ్డిని పోలీసులు ఎప్పుడో అరెస్టు చేశారు. ఆయన వాంగ్మూలంతో గత ప్రభుత్వంలో సీఎంవోలో కీలక అధికారులుగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డిని తాజాగా అరెస్టు చేశారు.
అంతేకాకుండా ప్రభుత్వంతో సంబంధం లేని బాలాజీ గోవిందప్ప అనే ఆడిటర్, భారతీ సిమెంట్స్ పర్మినెంట్ డైరెక్టరును రిమాండుకు తరలించారు. ఈ ముగ్గురి అరెస్టుతో సిట్ నెక్ట్స్ స్టెప్ ఏంటి అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ను అన్నివైపుల నుంచి చుట్టుముట్టాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా పథకం వేసిందని అంటున్నారు.లిక్కర్ స్కాంలో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ధనుంజయరెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితులు.. జగన్ తో మంచి అనుభందం ఉన్న మిథున్ రెడ్డిని ఇరుకునపెడితే జగన్ ను ఇబ్బంది పెట్టొచ్చని వ్యూహం ప్రభుత్వం అమలు చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి., లిక్కర్ స్కాంలో కమీషన్ల మొత్తం రాజ్ కేసిరెడ్డి ద్వారా ధనుంజయ్ రెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డికి చేరిందని వారిద్దరూ బిగ్ బాస్ కు అందజేశారని సిట్ లీకులిస్తోంది. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రమేయం ఉందని పరోక్షంగా సిట్ ప్రచారం చేస్తోందని అంటున్నారు.ప్రస్తుతానికి జగన్ ను ఇబ్బంది పెట్టే సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులో ఎక్కడా ఆయన పేరు ప్రస్తావించడం లేదని చెబుతున్నారు. కానీ, ఆయన చుట్టూ ఉన్నవారిని అరెస్టు చేయడం ద్వారా జగన్ ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు పంపుతున్నారని అంటున్నారు.
స్కాంలో వచ్చిన ముడుపులు వేరే వారికి బదిలీ చేయడంలో ఏ1 రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆర్డర్ ఆఫ్సప్లై నిర్ణయాల్లో ఇతర నిందితులతో కలిసి ధనుంజయ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.లిక్కర్ స్కాంలో ఏ1, తన సన్నిహితుల నుంచి ముడుపులు వసూలు చేసి చివరికు ఎవరికి చేర్చారో గుర్తించాల్సి ఉందని వెల్లడించింది. సిండికేట్ సభ్యుల సమావేశాల్లో పాల్గొని ముడుపులు సకాలంలో అందేలా చూశారని సిట్ గుర్తించిందట. ఈ కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డి, ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ3 సత్య ప్రసాద్, ఏ4 మిథున్ రెడ్డి, ఏ5 విజయ సాయిరెడ్డి కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నారని..ఏ1 కసిరెడ్డి కార్యాలయానికి పదే పదే వెళ్లి ముడుపుల వసూళ్లు పర్యవేక్షించారని సిట్ రిమాండ్రిపోర్టులో పేర్కొంది.ఏపీ లిక్కర్ స్కాంలో ఒకవైపు కీలక నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విచారించిన సిట్..ఆ తర్వాత వీరిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా..కోర్టు వీరికి 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ను విధించింది. వెంటనే వారిద్దరిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. అయితే వీరినుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని.. ఇద్దరిని ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్ట్లో సిట్ కోరింది తద్వారా వీరి నుంచి మరిన్ని కీలక విషయాలను రాబట్టేందుకు సిట్ వ్యూహాలను రచిస్తోంది.
ఇలా ఒకవైపు సిట్ ప్రశ్నలవర్షం, మరోవైపు కోర్టుల్లో వీరికి ముందస్తు బెయిళ్లు లభించకపోవడంతో జైల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుంటే మరోవైపు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ధనుంజయరెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డిలను ఈడీ కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈడీ విచారణలో బయటపడే విషయాలను బట్టి వీరి ఆస్తులతో పాటు బంధువులు, సన్నిహితుల ఆస్తులను కూడీ ఈడీ అటాచ్ చేసే అవకాశం స్పష్టంగా కన్పిస్తోంది.. ఈడీ విచారణలో ఎలాంటి విషయాలను బయటపెడతారో చూడాల్సి ఉంది.ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు మొత్తం ఏడుగురిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ ఏడుగురిలో ఆరుగురు నేరుగా ప్రధాన నిందితుడు ఏ1 అయిన కేసిరెడ్డితో సంబంధాలు ఉన్నవారుగా సిట్ ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక ధనుంజయరెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డిలు సిట్ కస్టడీ విచారణలో ఏం చెప్పబోతున్నారనేదే ఉత్కంఠగా మారింది. అయితే ఓవైపు సిట్ వేట, మరోవైపు రంగంలోకి దిగిన ఈడీ..మరోవైపు కోర్టుల్లో వీరికి చుక్కెదురు…ఇలా ఎటువెళ్లినా నిందితులందరికి నిరాశే ఎదురవుతోంది.ఈ పరిణామాలు చూస్తుంటే…లిక్కర్ స్కాంలో వైసీపీ నేతలు తప్పించుకునే దారులన్నీ మూసుకుపోయినట్లే అన్న టాక్ విన్పిస్తోంది.
జగన్ పైనే వేళ్లన్నీ.
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? మద్యం కుంభకోణంలో తదుపరి అరెస్ట్ ఆయనదేనా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అనుమానంలో నిజం ఉందా? అంతటి సాహసం చంద్రబాబు చేస్తారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. సెంటిమెంట్ అనే ప్రాతిపదికన ఏపీ రాజకీయాలు జరుగుతుంటాయి. కాంగ్రెస్ పార్టీ అకారణంగా జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేయడంతోనే ఆయనపై ప్రజల్లో సానుభూతి వ్యక్తం అయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటయింది. అధికారంలోకి రాగలిగింది. మొన్నటికి మొన్న చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టడం కూడా సింపతి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో టిడిపి కూటమి గెలుపునకు కారణమైంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారా? అనే ప్రశ్న వినిపిస్తోంది.ప్రస్తుతం మద్యం కుంభకోణం ఏపీలో కుదిపేస్తోంది. ఈ కేసులో వరుసుగా కీలక వ్యక్తుల అరెస్టులు జరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫుల్ ఫోకస్ పెట్టింది. సిఐడి ప్రాథమిక విచారణ చేపట్టింది. కీలక ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది.
ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, అధికారుల పేర్లు బయటపడ్డాయి. దీంతో అరెస్టుల పర్వం కూడా ప్రారంభం అయింది. ఇప్పటికే 8 మంది వరకు అరెస్ట్ అయ్యారు. తదుపరి అరెస్టు జగన్మోహన్ రెడ్డి ది అని తెగ ప్రచారం నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా రాజ్ కసిరెడ్డి ఉన్నారు. ఇదే విషయాన్ని ఇదే కేసులో ఏ 5 గా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనకు నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరయ్యారు. ఆధారాలతో పాటు కీలక వాంగ్మూలం కూడా ఇచ్చారు. రాజ్ కసిరెడ్డి తో పాటు ఆయన ప్రధాన అనుచరుడు అరెస్ట్ అయ్యారు. అంతకుముందు వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఏపీ బేవరేజెస్ ఎండిగా పనిచేసిన వాసుదేవ రెడ్డి సైతం అరెస్టయ్యారు. ఇటీవల వైసిపి హయాంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.
ఈ వరుస కీలక వ్యక్తులు అరెస్టు కావడంతో తదుపరి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి అని తెగ ప్రచారం జరుగుతోంది.కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఇంకా నాలుగేళ్ల పాలన ఉంది. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా బదనం చేస్తేనే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అవుతుందని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం ద్వారా మరోసారి ఆయన అవినీతిని బయట పెట్టవచ్చు అని కూటమి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కు ముహూర్తం ఖరారు చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు కడపలో మహానాడు జరగనుంది. మహానాడుకు ముందే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారని.. తద్వారా టిడిపి క్యాడర్లో ఫుల్ జోష్ వస్తుందని అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డిని అంత త్వరగా అరెస్టు చేయరని.. ముందు చుట్టూ ఉన్న నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తారని మరో అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి
Read more:Andhra Pradesh : చాట్ జీపీటీ, ఏఐని ఓన్ చేసుకుంటున్న బాబు