Andhra Pradesh :వై నాట్ 175 అన్న భారీ ధీమాతో బరిలోకి దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. భారీ విజయాన్ని ఊహించుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మైండ్ బ్లాక్ అయ్యింది. ఓటమి తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నైరాస్యంలోకి వెళ్లిపోయారు.
బీజేపీకి దగ్గర అయ్యేపనిలో జగన్
గుంటూరు, మే 19
వై నాట్ 175 అన్న భారీ ధీమాతో బరిలోకి దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. భారీ విజయాన్ని ఊహించుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మైండ్ బ్లాక్ అయ్యింది. ఓటమి తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నైరాస్యంలోకి వెళ్లిపోయారు. ఓటమి నుంచి బయటపడలేక పోతున్నారు. ఈ క్రమంలో అధినేత వైఫల్యాలను, నిర్ణయాలను సైతం తప్పుపడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో పరాజయంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఒకరు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ తప్పు చేసి ఉండకపోతే ఈరోజు అధికారంలో కొనసాగే వాళ్లమని చెప్పుకొచ్చారు. ఇదే విషయం అధినేత జగన్మోహన్ రెడ్డికి సైతం చెబుతాం అంటున్నారు.వైసీపీ ఆవిర్భావం నుంచి పనిచేసిన చాలామంది నేతలు సైలెంట్ అయిపోయారు. అటువంటి నేతల్లో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒకరు. ఆయన మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిజెపితో కలిసి వెళ్లకుండా తప్పు చేసినట్లు చెప్పుకొచ్చారు.
బిజెపితో ఎందుకు వెళ్ళకూడదు అని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి దృష్టికి త్వరలో తీసుకెళ్తామన్నారు. బిజెపితో కలిసి ముందుకెళ్లకుండా తాము చేసింది తప్పేనన్నారు. గత ఐదేళ్లుగా పాము రాజకీయంగా సహకరించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. రాజ్యసభలో అన్ని బిల్లులకు ఆమోదం తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. అటువంటి వారితో స్నేహం చేయవచ్చని కూడా చెప్పుకున్నారు ప్రసన్నకుమార్ రెడ్డి. చంద్రబాబుపై కేంద్ర పెద్దలకు నమ్మకం లేదని కూడా తేల్చేశారు.అయితే బిజెపి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మారడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం మద్యం కుంభకోణంలో కీలక అరెస్టులు జరుగుతున్నాయి. తదుపరి అరెస్టు జగన్మోహన్ రెడ్డి దేనని ప్రచారం సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 3500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. దీని నుంచి బయటపడేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిజెపి జపం అందుకుందన్న అనుమానాలు ఉన్నాయి. మరోవైపు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ అవుతోంది.
కేంద్రంలో టిడిపికి ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. దానికి చెక్ చెప్పాలంటే టిడిపికి ప్రత్యామ్నాయంగా తాము రెడీగా ఉన్నామన్న సంకేతాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పంపించినట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిజెపి కోసం ఎదురు చూస్తూనే ఉంటుందని ఒక సంకేతం పంపించారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. అయితే ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడారని ప్రచారం జరుగుతోంది.ఇటీవల జరిగిన జాతీయ పరిణామాల దృష్ట్యా మోదీ వేవ్ పెరిగింది. పాకిస్తాన్తో భారత్ యుద్ధం నేపథ్యంలో.. మోదీ నాయకత్వంపై దేశ ప్రజలు అత్యంత విశ్వాసంతో ఉన్నారు. మోడీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. కాంగ్రెస్ పార్టీ సైతం బలం పెంచుకునే పరిస్థితిలో లేదు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. మోడీ తప్పించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బతికించే వారు లేరని ఆ పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటికిప్పుడు స్నేహం కుదరకపోయినా.. భవిష్యత్తులో మాత్రం తాము ఒకరు ఉన్నామని చెప్పేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త ఎత్తుగడ వేసింది అన్న అనుమానాలు ఉన్నాయి. మరి అందులో ఎంత నిజం ఉందో చూడాలి.
Andhra Pradesh : మెగా డీఎస్సీ వేళ ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం..Read more: