Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తులు గత గురువారం అర్ధరాత్రితో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. అత్యధికంగా దరఖాస్తులు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి వచ్చాయి.
మెగా డీఎస్సీ వేళ ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం..
పలు ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా!
విజయవాడ, మే 19
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తులు గత గురువారం అర్ధరాత్రితో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. అత్యధికంగా దరఖాస్తులు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి వచ్చాయి. ఈ జిల్లాలో 39,997 మంది దరఖాస్తు చేశారు. ఇక అత్యల్పంగా కడప జిల్లా నుంచి వచ్చాయి. కేవలం 15,812 మంది మాత్రమే ఈ జిల్లాలో దరఖాస్తు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 7,159 మంది దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.ఇక మెగా డీఎస్సీకి సంబంధించిన రాత పరీక్షలు జూన్ 6 నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పలు పరీక్షల తేదీలు వాయిదా పడ్డాయి. జూన్ 6 నుంచి 26 మధ్య వేర్వేరు తేదీల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ల నియామక పరీక్షలు జరగాల్సి ఉన్నాయి.
అయితే ఈ పరీక్షలు రాసే వారిలో కూడా కొందరు డీఎస్సీకి సన్నద్ధమవుతున్నారు. అంతేకాకుండా అన్ని పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక పరంగానూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఏపీపీఎస్సీ ఆయా పరీక్షలను వాయిదా వేసింది. తదుపరి తేదీలు త్వరలో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రాజా బాబు ఓ ప్రకటనలో తెలిపారు.ఈ మెగా డీఎస్సీలో మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. డీఎస్సీ పరీక్షలకు మే 30 నుంచి హాల్‌టికెట్లను జారీ చేయనుంది. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ రాత పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదలకానుంది.
నాన్ లోకల్ కోటా కింద భారీగా దరఖాస్తులు
ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. 16, 347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే.. ఈ పోస్టుల కోసం ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి వేలాది మంది అప్లై చేసుకున్నారు. నాన్ లోకల్ కోటా కింద వీరు దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.టీచర్ జాబ్ సాధించేందుకు.. ఏపీ డీఎస్సీకి తెలంగాణ అభ్యర్థులు కూడా పోటీపడుతున్నారు. కూటమి ప్రభుత్వం 16 వేల 347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి 3.35 లక్షల మంది అప్లై చేసుకున్నారు. వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు 7 వేల 159 మంది ఉన్నారు. ఇందులో తెలంగాణ అభ్యర్థులే దాదాపు 7 వేల వరకు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ మెగా డీఎస్సీకి సంబంధించి నాన్ లోకల్ కోటా కింద 20 శాతం పోస్టులను కేటాయించారు. వాటికి ఏపీతోపాటు.. ఏ రాష్ట్రం వారైనా పోటీపడవచ్చు. అయితే.. టెన్త్‌లో సెకెండ్ లాంగ్వేజ్ తెలుగు తప్పనిసరిగా ఉండాలి.
నాన్ లోకల్ కోటా పోస్టుల కోసం.. ఏపీ సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, గద్వాల, నారాయణపేట నుంచి ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు.సరిహద్దు జిల్లాలే కాకుండా.. రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, సిద్ధిపేట, నిర్మల్, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో డీఎస్సీలో కొన్ని మార్కుల తేడాతో జాబ్ రానివారు.. ఏపీ డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ డీఎస్సీ పరీక్షలను జూన్ 6వ తేదీ నుంచి జులై 6వ తేదీ వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనున్నాయి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మెగా డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణను అందించడం ద్వారా.. వారి విజయావకాశాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ శిక్షణలో భాగంగా.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, సబ్జెక్టు నిపుణులతో తరగతులు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు స్టడీ మెటీరియల్స్, మాక్ టెస్టులు, ఇతర అవసరమైన వనరులను ఉచితంగా అందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Read more:Ongole : మిర్చి మాటున గంజాయి.