Andhra Pradesh : మద్యం స్కామ్ అరెస్ట్ లు ఎవరు..

Andhra Pradesh: Who are the liquor scam arrests?

Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్ లో మద్యం స్కామ్ కేసు విచారణ వేగం అందుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురు అరెస్ట్ అయ్యారు. కీలక నిందితులందరీని అరెస్ట్ చేశారు. 2019 -2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల నిర్వహణ, డిస్టలరీ నుంచి కొనుగోలు విషయంలో పెద్దయెత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి.

మద్యం స్కామ్ అరెస్ట్ లు ఎవరు..

నెల్లూరు, మే 19
ఆంధ్రప్రదేశ్ లో మద్యం స్కామ్ కేసు విచారణ వేగం అందుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురు అరెస్ట్ అయ్యారు. కీలక నిందితులందరీని అరెస్ట్ చేశారు. 2019 -2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల నిర్వహణ, డిస్టలరీ నుంచి కొనుగోలు విషయంలో పెద్దయెత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వమే లిక్కర్ దుకాణాలను నిర్వహించడంతో పాటు డిజిటల్ పేమెంట్ కు అంగీకరించకపవడంపై కూడా పలు అనుమానాలు తలెత్తాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం స్కామ్ పై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసింది. దాదాపు పది వేల కోట్ల రూపాయల మేరకు కుంభకోణం జరిగిందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈడీ కూడా ఎంటర్ కావడంతో… దీంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా దీనిపై విచారణకు సిద్ధమయ్యారు. మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అయితే ఇప్పటి వరకూ నాటి ముఖ్యమంత్రి జగన్ కు దగ్గరగా ఉండి, కోటరీలో ప్రధానంగా ఉన్నవారిని కూటమి ప్రభుత్వం తొలుత టార్గెట్ చేసిందన్న ప్రచారం ఊపందుకుంది. విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన ఇచ్చిన ఆధారాల మేరకు రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు తర్వాత వరసగా దిలీప్ ను అరెస్ట్ చేశారు. గోవిందప్ప బాలాజీని మైసూరులో అరెస్ట్ చేసి తీసుకు వచ్చారు. వీరితో పాటు రాజ్ కసిరెడ్డితో సంబంధమున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్ ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డిలను కూడా అరెస్ట్ చేశారు. ఇక ఇదే కేసులో రాజంపేట పార్లమెంటు సభ్యులు మిధున్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో ఆయన అరెస్ట్ ఆగిందంటున్నారు. అయితే మిథున్ రెడ్డిని ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు. కానీ కీలకమైన నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమయినట్లు సమాచారం.

ఈ కేసులో జగన్ ను ఏ క్షణమైనా అదుపులోకి తీసుకుని విచారణ చేసే అవకాశముందని ప్రచారం ఏపీలో జరుగుతుంది. మద్యం స్కామ్ జగన్ మెడకు చుట్టుకుంటుందని తొలి నుంచి అందరూ భావిస్తుంది. నాడు స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచిన నేపథ్యంలో ఈ నెలలోనే జగన్ అరెస్ట్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. . ఇప్పటికే గత ఐదేళ్ల పాటు జగన్ తో సన్నిహితంగా ఉన్నవారందరూ ఒక్కొక్కరుగా ఈ కేసులో అరెస్ట్ అవుతున్నారు. వారు కీలకమైన సమాచారం సిట్ అధికారులకు ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే వైసీపీ నేతలు కూడా జగన్ అరెస్ట్ అవుతారని వ్యాఖ్యానిస్తుండటం ఇందుకు అద్దంపడుతుంది. ఎన్నికలకు ముందుగానే అరెస్ట్ చేస్తే సింపతీ అన్నది రాకుండా పోతుందని, చంద్రబాబు నాటి అరెస్ట్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని అంటున్నారు. నిన్న మాజీ మంత్రి పేర్ని నేని, నేడు భూమన కరుణాకర్ రెడ్డి కూడా జగన్ ను అరెస్ట్ చేస్తారని చెప్పడం వెనక అదే కారణమంటున్నారు. అయితే జగన్ కూడా మానసికంగా అరెస్ట్ కు సిద్ధమయ్యారని వైసీపీ నేతలే చెబుతుండటం విశేషం

Read more:Andhra Pradesh : కమ్మ నేతలు కామ్..

Related posts

Leave a Comment