Andhra Pradesh : మన మిత్రలో మరిన్ని సేవలు

nara lokesh

Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి దూసుకుపోతుందని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఐదు లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

మన మిత్రలో మరిన్ని సేవలు

విజయవాడ, మే 16
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి దూసుకుపోతుందని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఐదు లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భారీ పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. వాళ్లకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు ఆ దిశగానే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం ఈ మన మిత్ర యాప్ ద్వారా 317 సేవలు అందుతున్నాయి. దీన్ని మే చివరి నాటికి 400కు పెంచాలని అధికారులకు నారా లోకేష్ సూచించారు. ప్రస్తుతానికి ఈ యాప్‌లో రెవెన్యూ శాఖ పరంగా భూరికార్డులు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం, మరణ ధ్రువీకరణ పత్రం, జన్మ ధ్రువీకరణ పత్రం, పంట నష్టం అంచనా వివరాలు, భూ మార్పిడికి సంబంధించిన వివరాలు, ఐ పట్టా పాస్‌బుక్‌ల వివరాలు లభిస్తున్నాయిగ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికల వివరాలు, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కోసం దరఖాస్తు, నీటి సరఫరాల, పారిశుద్ధ్యానికి సంబంధించిన ఫిర్యాదులు, గ్రామస్థాయిలో వివిధ పన్నుల చెల్లింపు, భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తుల, వీధి దీపాల నిర్వహాణకు సంబంధించిన ఫిర్యాదులు, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన ఫిర్యాదుల సేవలు లబిస్తాయి.

పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను చెల్లింపు, నీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణకు సంబంధించిన ఫిర్యాదులు, భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు, వ్యాపార లైసెన్స్‌ కోసం దరఖాస్తు, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన ఫిర్యాదులు, వీధి దీపాల నిర్వహణకు సంబంధించిన ఫిర్యాదుల సేవలు లభిస్తాయి. విద్యాసంస్థల గురించి సమాచారం, ఉద్యోగాల నోటిఫికేషన్ల సమాచారం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల వివరాలు, ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారం, ప్రభుత్వ పాఠశాలలలు, కళాశాలల వివరాలు ఈ మన మిత్ర వాట్సాప్‌ యాప్‌లో లభిస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రుల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వివరాలు, వైద్య శిబిరాల సమాచారం, టీకాల కార్యక్రమాల వివరాలు, ఆరోగ్య పథకాల గురించి సమాచారం, రక్త నిధి కేంద్రాల వివరాలు లభిస్తాయి. ఆర్టీసీ బస్సుల సమయం, టికెట్ బుకింగ్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సమాచారం, వాహన పన్ను చెల్లింపుల వివరాలు లభిస్తాయి. వీటితోపాటు పోలీస్ శాఖ ఫిర్యాదులు, విపత్తు నిర్వహణకు సంబంధించిన సమాచారం, సామాజిక సంక్షేమ పథకాల గురించి సమాచారం, వ్యవసాయ శాఖకు సంబంధించిన మసాచారం, విద్యుత్ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు, చెల్లింపుల వివరాలు ఈ వాట్సాప్ యాప్‌లో లభిస్తాయి.

Read more:Andhra Pradesh : వైఎస్ రెడ్డి ఎవరో తెలుసా

Related posts

Leave a Comment