AP : స్పోర్ట్స్‌ కోటా లో దొంగాట

The AP Olympic Association has accused some leaders and sports associations of trying to cash in on the sports quota reservations being provided by the state government to encourage athletes.

AP :క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్లను సొమ్ము చేసుకునేందుకు కొందరు నేతలు, కొన్ని క్రీడా సంఘాలు ప్రయత్నిస్తున్నాయని ఏపీ ఒలింపిక్ అసోసియేషన్‌ ఆరోపించింది. క్రీడల్లో నకిలీలను తొలగించి.. అసలైన క్రీడాకారులకు న్యాయం చేయాలని, అర్హులకే స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు దక్కాలని డిమాండ్‌ చేస్తున్నారు.

స్పోర్ట్స్‌ కోటా లో దొంగాట

నెల్లూరు, మే 28
క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్లను సొమ్ము చేసుకునేందుకు కొందరు నేతలు, కొన్ని క్రీడా సంఘాలు ప్రయత్నిస్తున్నాయని ఏపీ ఒలింపిక్ అసోసియేషన్‌ ఆరోపించింది. క్రీడల్లో నకిలీలను తొలగించి.. అసలైన క్రీడాకారులకు న్యాయం చేయాలని, అర్హులకే స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు దక్కాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏపీ మెగా డిఎస్సీ 3శాతం స్పోర్ట్స్‌ రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో శాప్‌ నిబంధనల తీరుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో డీఎస్సీ క్రీడా కోటా సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌లో క్రీడా సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన జూడో క్రీడ నకిలీ సర్టిఫికెట్‌లపై వెంటనే దర్యాప్తు జరగాలని ఏపీవోఏ అధ్యక్షుడు ఆర్‌.కె.పురుషోత్తం డిమాండ్ చేశారు.మెగా డిఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల భర్తీలో భాగంగా చేపట్టిన సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌లో క్రీడా సంఘాల ప్రతినిధులకు ఉన్న ప్రాధాన్యతను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అవినీతి అక్రమాలకు దారి తీస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.కె.పురుషోత్తం ఆరోపించారు.

అసలైన క్రీడాకారులకు న్యాయం జరగాలంటే సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌లో క్రీడా సంఘాల ప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏపీవోఏ సర్వసభ్య సమావేశం విజయవాడలో  జరిగింది.క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించి పతకాలు సాధించిన క్రీడాకారులకు క్రీడా సంఘాలు సర్టిఫికెట్‌లను మంజూరు చేస్తాయని, క్రీడల్లో ప్రవేశించిన కొందరు దొంగలు అసలైన క్రీడాకారులకు కాకుండా క్రీడల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేని వ్యక్తులకు సర్టిఫికెట్‌లను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారన్నారు.క్రీడల్లో అక్రమాలతో సంవత్సరాల తరబడి కఠోర శిక్షణ తీసుకుని, నిరంతర శ్రమతో సర్టిఫికెట్‌ సాధించిన అసలైన క్రీడాకారులకు అన్యాయం జరుగుతందన్నారు. ఉద్యోగాల భర్తీ సమయంలో క్రీడాకారులు ధరఖాస్తునకు జతపర్చిన క్రీడా సర్టిఫికెట్‌ అసలైనదా..?, నకిలీదా..? అనే విషయాన్ని క్రీడా సంఘాలు దృవీకరించాల్సి ఉండగా అవేమి లేకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టడంపై సందేహాలు వ్యక్తం చేశారుడీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల భర్తీల్లో క్రీడా సంఘాలకు ప్రాతినిధ్యం లేదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో అక్రమాలు జరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌లో క్రీడా సంఘాలకు ప్రాధాన్యత ఉన్న రోజుల్లోనే జూడో పేరుతో నకిలీ సర్టిఫికెట్‌లతో సచివాలయాల్లో, పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు పొందారని, దానిపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.

జూడోలో నకిలీ సర్టిఫికెట్‌లతో ఉద్యోగాలు పొందిన వారి వివరాలను సేకరించి, పూర్తి ఆధారాలతో 2024 సెప్టెంబర్‌ 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని, దీనిపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, శాప్‌లో ఉన్న కొందరు అధికారులు నకిలీ సర్టిఫికెట్లకు సూత్రధారులని ఆరోపించారు.అసలైన క్రీడాకారులకు అన్యాయం చేస్తూ.., నకిలీలకు, క్రీడా కేటుగాళ్లకు శాప్‌ కొమ్ము కాస్తున్నారని, జూడో క్రీడ నకిలీ సర్టిఫికెట్‌లపై తిరుపతిలో విజలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేశామన్నారు. సర్టిఫికెట్‌ల వాస్తవికతను రుజువు చేసే ఫాం–2 లను గుర్తింపు లేని సంఘాలకు క్రీడా సంఘాలకు శాప్‌ పంచి పెడుతుందని ఆరోపించారు,కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ టాప్‌–9 ప్రయారిటీ జాబితాను

రాష్ట్రంలోనూ అమలు చేయాలని, క్రీడల్లో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, హాకీ, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్‌ క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఆ తరువాత మిగిలిన క్రీడాంశాలకు, ఆ తరువాత కేటగిరి–బి క్రీడాంశాలకు అవకావం ఇవ్వాలని డిమాండ్ చేశారు.క్రీడల్లో రాజకీయ జోక్యం తగదని, అన్ని క్రీడా సంఘాల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. అయితే ఇటీవల కాలంలో మితిమీరిన రాజకీయ జోక్యంతో క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.రాష్ట్రంలో అసలైన క్రీడాకారులకు న్యాయం చేసి, నకిలీ క్రీడాకారులు, క్రీడా సంఘాలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి పురుషోత్తం విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బాక్సింగ్, జూడో, ఫుట్‌బాల్, రెజ్లింగ్, స్క్వాష్, సైక్లింగ్, హ్యాండ్‌బాల్, తైక్వాండో, ఫెన్సింగ్, బాస్కెట్‌బాల్, జిమ్నాస్టిక్, వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read more:AP : కర్నూలు జిల్లాలో వజ్రాల వేట, రైతుకు దొరికిన రూ.30లక్షల వజ్రం

Related posts

Leave a Comment