Bayya Yadav : స్లీపర్ సెల్ లో యూ ట్యూబర్ బయ్యా యాదవ్

YouTuber Bayya Yadav in sleeper cell

Bayya Yadav : యూట్యూబ్ సెలబ్రిటీ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు బయ్యా సన్నీ యాదవ్. ప్రపంచం మొత్తం బైక్ మీద తిరుగుతూ, అందుకు సంబంధించిన వీడియోస్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం, అవి బాగా వైరల్ అవ్వడం వంటివి జరుగుతూ ఉండేవి.

స్లీపర్ సెల్ లో యూ ట్యూబర్ బయ్యా యాదవ్

హైదరాబాద్, మే 30
యూట్యూబ్ సెలబ్రిటీ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు బయ్యా సన్నీ యాదవ్. ప్రపంచం మొత్తం బైక్ మీద తిరుగుతూ, అందుకు సంబంధించిన వీడియోస్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం, అవి బాగా వైరల్ అవ్వడం వంటివి జరుగుతూ ఉండేవి. అయితే బెట్టింగ్ యాప్స్ ని ఒక రేంజ్ లో ప్రమోట్ చేయడం వల్ల ఇతనిపై కేసులు నమోదు చేసి గత కొంతకాలంగా పోలీసులు ఇతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు రీసెంట్ గా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని ఇతన్ని విచారించగా కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో ఇతను పాకిస్తాన్ లో ఉండేవాడట. దుబాయ్ లో ఉన్నప్పుడు ఈయనకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన దుబాయి నుండి నేరుగా పాకిస్తాన్ కి వచ్చాడు. ఇప్పటి వరకు ఈయన 5 సార్లు పాకిస్తాన్ కి వెళ్లినట్టు సమాచారం.

అసలు ఇరు దేశాల మధ్య రాకపోకలు ఆగిపోయిన సమయంలో ఇతను పాకిస్తాన్ కి ఎలా చేరాడు?, దేశం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇతను శత్రు దేశం లో ఎందుకు తలదాచుకున్నాడు? అనే అంశాలపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు.రీసెంట్ గానే పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె తో సన్నీ కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోసం లో కూడా విచారిస్తున్నారు పోలీసులు. ఇతని గురించి తెలిసిన ఈ కొత్త నిజాలను చూసి నెటిజెన్స్ నోరెళ్లబెడుతున్నారు. ఎదో బెట్టింగ్ స్కాం లో ఒక్కటే ఇరుకున్నాడని అనుకుంటే, ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయం లో శత్రు దేశం లో తలదాచుకోవడం లో ఆంతర్యం ఏమిటి?, ఇతనికి కూడా పాకిస్తాన్ టెర్రరిస్ట్స్ తో సంబంధాలు ఉన్నాయా?, మన దేశం లో పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ చాలా మంది ఉన్నారు.

రీసెంట్ గానే వైజాగ్ లో కూడా ఒక స్లీపర్ సెల్ ని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.  సన్నీ యాదవ్ కూడా ఆ కోవకు చెందిన వ్యక్తియేనా? అని అతన్ని అనుసరించే వాళ్ళు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసులే తెలియచేయాల్సి ఉంటుంది. సన్నీ యాదవ్ ఒక విధంగా అరెస్ట్ అవ్వడానికి కారణం అన్వేష్ అనొచ్చు (నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు). బెట్టింగ్ యాప్స్ పై ఆయన పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. గతంలో ఈ అంశంపై వీళ్లిద్దరి మధ్య గొడవలు వేరే లెవెల్ లో జరిగాయి. అసభ్యకరమైన పాదయాజాలంతో దూషించుకున్నారు. అన్వేష్ వల్ల సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం లో కింగ్ అని తెలిసి అతని పై కేసు ని నమోదు చేసాడు, ఎట్టకేలకు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు.

Read more:Lucknow : యూపీలో దారికాస్తున్న నేరస్తుల ముఠాలు

Related posts

Leave a Comment