Hyderabad : అమెరికాకు మాజీ మంత్రి..

Former minister Kodali Nani, who was suffering from heart problems, underwent bypass surgery last month.

Hyderabad :గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న మాజీ మంత్రి కొడాలి నాని.. గత నెలలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అయితే, ఆయన మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. గత నెలలో ముంబైలో ఆయనకు గుండె శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన వైద్యుల సలహా మేరకు అమెరికాలో చికిత్స పొందనున్నారు.

అమెరికాకు మాజీ మంత్రి..

హైదరాబాద్, మే 19
గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న మాజీ మంత్రి కొడాలి నాని.. గత నెలలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అయితే, ఆయన మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. గత నెలలో ముంబైలో ఆయనకు గుండె శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన వైద్యుల సలహా మేరకు అమెరికాలో చికిత్స పొందనున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఆయన అమెరికాకు బయలుదేరనున్నారు.గుండె సంబంధితన సమస్యతో బాధపడుతోన్న మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత కొడాలి నాని త్వరలో అమెరికా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. గత నెల మొదటివారంలో కొడాలి నాని గుండెకు ముంబయిలో శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మెరుగైన చికిత్స కోసం వైద్యుల సలహా మేరకు అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

కానీ, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పార్టీ నేతలు తెలిపారు.సర్జరీ అనంతరం కొడాలి నాని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి.. ముంబయి‌లోనే నెల రోజుల పాటు ఉన్నారు. నుంచి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన తరువాత ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ముఖ్యమైన వాళ్లను మాత్రమే కలుస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లడానికి సిద్ధమయ్యారు.మార్చిలో అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరారు. కొడాలికి ముందు గ్యాస్టిక్ సమస్య అని చెప్పగా.. ఆ తర్వాత గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్టు నిర్దారించారు. వైద్య పరీక్షల్లో ఆయన గుండెలో మూడు రక్తనాళాలు మూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు.

దీంతో ఏప్రిల్ 2న ప్రత్యేక విమానంలో కొడాలి నానిని ముంబైకి తరలించారు.ఏప్రిల్ 4న ముంబయిలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌లో డాక్టర్ రమాకాంత్ పాండే ఆధ్వర్యంలో దాదాపు 8 గంటల పాటు బైపాస్ సర్జరీ జరిగింది. ఆపరేషన్ తర్వాత మూడు రోజుల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కోలుకున్న తర్వాత ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. కొడాలి నాని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ నేతలు తెలిపారు.వైద్యుల సూచన మేరకు ఎవరినీ కలవడం లేదు. మెరుగైన చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గతంలోనే ఈ ఆలోచన చేసినప్పటికీ, ఆపరేషన్ తర్వాత కొంతకాలం ఆగి వెళ్లాలని వైద్యులు సూచించారు. అందుకే ఇప్పుడు అమెరికా వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ నేతలు ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ, ‘నాని ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదు” అని స్పష్టం చేశారు అయితే, అమెరికాకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనే అనుమానం ఆయన అభిమానులు వ్యక్తం చేస్తుననారు.

Read more:Andhra Pradesh : దేశంలోనే తొలిసారి ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్, ట్రీ ట్రాన్స్‌లొకేషన్

Related posts

Leave a Comment