Hyderabad : ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న టైంలో ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. అనుకున్న టైం కంటే ముందే రుతుపవనాలు వచ్చేస్తున్నట్టు వెల్లడించింది. ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు నిజంగా ఇది మంచి గుడ్ న్యూస్. మే 30 నాటికి దేశంలోకి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ అంతకంటే ముందుగానే వచ్చేస్తున్నట్టు మారిన వాతావరణం బట్టీ ఐఎండీ స్పష్టం చేసింది.
మరింత ముందుగా నైరుతి రుతుపవనాలు
హైద్రాబాద్, మే 13
ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న టైంలో ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. అనుకున్న టైం కంటే ముందే రుతుపవనాలు వచ్చేస్తున్నట్టు వెల్లడించింది. ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు నిజంగా ఇది మంచి గుడ్ న్యూస్. మే 30 నాటికి దేశంలోకి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ అంతకంటే ముందుగానే వచ్చేస్తున్నట్టు మారిన వాతావరణం బట్టీ ఐఎండీ స్పష్టం చేసింది.ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా అనుకున్న అంచనాలు కంటే నాలుగు రోజులు ముందుగానే వచ్చేస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మే 15 తర్వాత అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు చేరుకుంటాయని అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఉన్న అనుకూల వాతావరణం చూస్తే ఈ రెండు రోజుల్లోనే వర్షావరణం ప్రారంభంకానుందని స్పష్టమవుతుంది. రేపు లేదా ఎల్లుండి ఉదయం అండమాన్కు తాకనున్న రుతుపవనాలు… 25 తర్వాత ఎప్పుడైనా కేరళను తాకబోతున్నాయి. ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడతాయని చెబుతున్నారు.
చాలా ప్రాంతాల్లో గతేడాది కంటే ఎక్కువ వర్షాలు పడతాయని లెక్కలు వేస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోత మధ్య భారత వాతావరణ శాఖ పెచ్చిన గుడ్ న్యూస్ రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజల్లో ఆనందం నింపింది. కేరళలో రుతుపవనాల రాక భారతదేశంలో వర్షాకాలం ప్రారంభంగా పరిగణిస్తారు. వ్యవసాయానికి ఈ సీజన్ చాలా ముఖ్యమైంది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 1న వస్తాయి. కానీ ఈసారి మాత్రం చాలా ముందుగానే వస్తున్నట్టు వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2020 సంవత్సరంలో భారతదేశంలో జూన్ 1న, 2021 సంవత్సరంలో జూన్ 3న, 2022 సంవత్సరంలో మే 29న, 2023 సంవత్సరంలో జూన్ 8న, 2024 సంవత్సరంలో మే 30న రుతుపవనాలు దేశంలోకి వచ్చాయి. ఇప్పుడు మాత్రం వారం రోజులు ముందుగానే వస్తున్నట్టు లెక్కలు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ దంచి కొడుతోంది. సాయంత్రం నాలుగు తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ అకాల వర్షాలు రైతులకు చాలా నష్టం కలిగించాయి. ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
