Hyderabad :పేద ప్రజల గూడు కోసం గొప్పలు చెప్పి ఏది మిగిల్చకుండా గత పాలకులు అన్యాయం చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కంకణబద్ధులై ఉన్నామని అందులో భాగంగానే నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామని షాద్ నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు.
షాద్ నగర్ మున్సిపాలిటీ లో 3,4,19, 20,21 వార్డులలో ఇందిరమ్మ గృహాలకు శంకుస్థాపన
పేద ప్రజల గూడు కోసం గొప్పలు చెప్పి ఏది మిగిల్చకుండా గత పాలకులు అన్యాయం చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కంకణబద్ధులై ఉన్నామని అందులో భాగంగానే నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామని షాద్ నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలోగల 3, 4, 19, 20, 21 వార్డులలో మున్సిపల్ కమిషనర్ సునీత మరియు స్థానిక నాయకులతో కలిసి ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా వార్డులలో అనేకమంది లబ్ధిదారుల ఇళ్ల స్థలాల వద్దకు వెళ్లి భూమి పూజ నిర్వహించారు. పలుగు పారా పట్టి మట్టిని తీశారు. అనంతరం ఆయా కార్యక్రమాలను ఉద్దేశించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ..
గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు పేదల గుడు కోసం ఎన్నో గొప్పలు చెప్పి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నియోజకవర్గంలో ఇవ్వలేదని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేరిచేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గానికి 3500 ఇల్లు ప్రభుత్వం కేటాయిస్తుందని ఆయా గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ గృహాల శంకుస్థాపనకు శ్రీకారం చుట్టమన్నారు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి తాము ముందుకు వస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద రైతు కుటుంబం నుండి వచ్చారని నిరుపేదల బడుగు బలహీన వర్గాల సబ్బండ వర్గాల కష్టనష్టాలు తెలిసిన ఒక సామాన్య వ్యక్తిగా వారు కలలుగన్న కలల సౌధం ఇందిరమ్మ గృహం అని భావించి
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేశారని గుర్తు చేశారు. తెలంగాణను గత పాలకులు అప్పుల కుప్పచేసి ఆగం చేశారని ఘాటుగా విమర్శించారు. అప్పులను అధిగమించి కష్టనష్టాలను ఓర్చుకొని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు.
గత పాలకులు సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుండి ఇప్పుడిప్పుడే కోలుకొని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఓర్చుకొని ముందుకు సాగుతుంటే కొందరు అవాకులు చావాకులు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు ఎన్నో గొప్పలు చెప్పి గూడు లేకుండా పేదలకు గూడు మిగిల్చారని విమర్శించారు. గత పది ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు పంచలేదని అన్నారు. నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కిటికీలు, తలుపులు లేవని విద్యుత్ సౌకర్యం మంచినీటి సౌకర్యం కూడా లేదని అన్ని అసంపూర్తిగా చేసి పోయారని పేదలకు 10 ఏళ్ల నుండి గొప్పలు చెప్పుకొని కేవలం వారిని ఓటు బ్యాంకుగా మార్చుకున్నారే తప్ప వారికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఈ ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అసంపూర్తి నిర్మాణాలను పరిశీలించి జిల్లా కలెక్టర్ తదితర అధికారులతో మాట్లాడడం జరిగిందని ఈ పనుల కోసం ఏడుకొండల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందని త్వరలోనే పనులు పూర్తి చేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని
ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. మున్సిపల్ పరిధిలో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని అదేవిధంగా ఇందిరమ్మ గృహాల నిర్మాణాలకు కూడా పూర్తిస్థాయిలో సహకరించమని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం ఆయా వార్డులలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ఘనంగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత , మార్కేట్ కమిటి వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం,పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, మాజీ కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి,శ్రీనివాస్, అప్పి నేతలు అగ్గనూర్ బస్వo, చెంది తిరుపతి రెడ్డి, రఘు నాయక్, జృమద్ ఖాన్, ఇబ్రహీం, కొప్పునూరి ప్రవీణ్,రమేష్,రవి కుమార్, యాదగిరి యాదవ్, శేఖర్, శ్రీనివాస్ రెడ్డి, మాధువలు, తుపాకుల శేఖర్,శ్రీహరి గౌడ్,కృష్ణ, రాయికల్ శ్రీనివాస్, సీతారాం, నవీన్, ఖదీర్, మంగ అశోక్, నీరటి వాసు, మన్నే రవి, రాజు, గడ్డమీద రమేష్, మనీష్, అన్వర్,శివ కుమార్, మున్సిపల్ రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.
Read more:సంక్షిప్త వార్తలు :19-05-2025