Jammikunta :గురువారం జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జమ్మికుంట పట్టణ పరిధిలోని మోత్కులగూడెం, లో అంతర్జాతీయ ఋతు శ్రావ పరిశుభ్రత దినోత్సవం మరియు యోగ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా యోగ పై మరియు ఋతుపరిశుభ్రతపై కిషోర బాలికలకు మరియు మహిళలకు డాక్టర్ సంధ్యారాణి, అవగాహన కల్పించినారు.
ఋతు పరిశుభ్రతపై
మహిళలకు డాక్టర్ సంధ్యారాణి,అవగాహన..
జమ్మికుంట
గురువారం జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జమ్మికుంట పట్టణ పరిధిలోని మోత్కులగూడెం, లో అంతర్జాతీయ ఋతు శ్రావ పరిశుభ్రత దినోత్సవం మరియు యోగ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా యోగ పై మరియు ఋతుపరిశుభ్రతపై కిషోర బాలికలకు మరియు మహిళలకు డాక్టర్ సంధ్యారాణి, అవగాహన కల్పించినారు. ఈ సందర్బంగా డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ మహిళలు రుతు శ్రావ సమయంలో సరైన పౌష్టికాహారం తీసుకోవాలని కిషోర బాలికలకు మరియు మహిళలకు సూచించారు. రుతు శ్రావ సమయంలో మహిళలు కనీసం రోజుకు నాలుగైదు గంటలకొకసారి సానిటరీ ప్యాడ్స్ మార్చుకోవాలని, వ్యక్తి గత పరిశుభ్రతను పాటించాలని సూచించారు.
బెల్లం, ఆకుకూరలు, ఖార్జుర, పాలు, పండ్లు, పెరుగు, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఈ అంతర్జాతీయ రుతు శ్రావ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో 5 రోజుల పాటు కిషోర బాలికలకు, మహిళలకు అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలలో మరియు అన్ని గ్రామాలలో అవగహన కల్పించడం జరుగుతుందని అన్నారు, ఈ కార్యక్రమములో డాక్టర్ సంధ్యారాణి, ఆరోగ్య విద్యాభోధకుడు , హెల్త్ సూపర్వైజర్ ఏ మోహన్ రెడ్డి, ఏఎన్ఎం లు అరుణ, సరళ , టి బి కోఆర్డినేటర్ తిరుపతి, సరిత, శైలజ ఆశా కార్యకర్తలు మరియు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు…
Read more:Jammikunta : చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పెండెం సర్వేశం, ఏకగ్రీవ ఎన్నిక
