Yoga :యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి.. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు సంయుక్తంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కు నందు యోగ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కు నందు పెద్ద ఎత్తున యోగ కార్యక్రమం నిర్వహణ
యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి.. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
యోగాంధ్ర లో అందరూ భాగస్వాములు కావాలి.
ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి.. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు సంయుక్తంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కు నందు యోగ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించిన యోగాంధ్ర- 2025 శిక్షణా కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జూ క్యూరేటర్ సెల్వం, డి ఎఫ్ ఓ వివేక్, యోగాంధ్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నం లో నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని అన్నారు. నెలరోజులు పాటు యోగాపై ప్రజలకు అవగాహన, ప్రయోజనాలు వివరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొంచామని అన్నారు.
ఈ నెల 21 న మహిళా వర్సిటీలో యోగా దినోత్సవాన్ని ప్రారంభించామని, అప్పటి నుండి ప్రతి రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరికి యోగా పై అవగాహన వచ్చేలా రానున్న రోజుల్లో మన జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత, విశిష్టత కలిగిన 5 ప్రదేశాల్లో భాగంగా నేడు ఎస్.వి జూ పార్క్ నందు యోగ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. తిరుమల, శ్రీహరి కోట, చంద్రగిరి కోట, శ్రీకాళహస్తి, యోగా పై పలు అవగాన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని అన్నారు. యోగ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని తెలిపారు అలాగే ప్రతి ఒక్కరు ఇంకో నలుగురికి యోగ చేయడం వల్ల ప్రయోజనాలను వివరించి వారి చేత కూడా యోగాను చేయించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని తెలిపారు. ప్రతి మండలానికి నలుగురు మాస్టర్ ట్రైనర్ లను ఏర్పాటు చేశామని వారు ఒక్కొక్కరు 200 మందికి ట్రైనింగ్ ఇచ్చి ప్రతి మండలంలో, గ్రామంలోని ప్రతి పౌరుడికి యోగా పై అవగాహన కలిగేలా చూస్తున్నామని. సుమారు జిల్లాలో 10 లక్షల మంది యోగా లో ప్రావీణ్యం పొందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విశాఖ పట్టణంలో గౌ.ప్రధానమంత్రి హాజరు కానున్న కార్యక్రమానికి కూడా జిల్లా నుండి యోగా లో శిక్షణ తీసుకున్న వారిని పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ప్రతి ఒక్కరికి యోగ పై అవగాహన కలిగేలా అవగాహన కార్యక్రమాలు జిల్లా అంతట చేపడుతామని తెలిపారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. జూన్ 21న విశాఖపట్నం లో సుమారు ఐదు లక్షల మంది తో యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నారు. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని అన్నారు. మునిసిపల్, మండల, గ్రామ స్థాయిలో జరిగే యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి రామ్మోహన్, సాంఘిక సంక్షేమ సాధికారతాధికారి మరియు నోడల్ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, టూరిజం శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, అటవీశాఖ అధికారులు మరియు సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆయుష్ సిబ్బంది, స్థానిక ప్రజలు,యువత విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Read more:AP : ఆపరేషన్ వైసీపీ స్టార్ట్
