సంక్షిప్త వార్తలు : 02-06-2025

సంక్షిప్త వార్తలు : 02-06-2025:తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా  వికారాబాద్ లోని సమీకృత కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జరిగిన ఉత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొని, జాతీయ పతాకాన్ని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు  గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు.

రాష్ట్ర అవతరణ వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్

వికారాబాద్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా  వికారాబాద్ లోని సమీకృత కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జరిగిన ఉత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొని, జాతీయ పతాకాన్ని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు  గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. ముందుగా వికారాబాద్ పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. తరువాత కలెక్టరేట్ లో జరిగిన వేడుకలలో పాల్గొన్న స్పీకర్ ప్రసాద్ కుమార్  సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు.సభా వేదికపై అమరవీరుల కుటుంబాల సభ్యులను సన్మానించారు.ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు పత్రాలను మరియు రైతులకు విత్తనాలను అందించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ అధికారులకు ప్రశంస పత్రాలను అందజేశారు.

సి ఏ అర్ హెడ్ క్వాటర్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు

Hyderabad: రాచకొండ కమిషనర్‌గా సుధీర్‌బాబు | Hyderabad: Sudhir Babu as  Rachakonda Commissioner ksv

మేడ్చల్
తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది,రెవెన్యూ పరంగా కూడా అభివృద్ధి చెందింది అని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. అంబర్ పేట్ లోని సి ఏ  అర్ హెడ్ క్వాటర్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ మహిళలను గౌరవించే సాంప్రదాయం తెలంగాణ రాష్ట్రంలో ఉంది.కాబట్టి మహిళల భద్రతకు పోలీస్ విభాగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది.అనేక మైన చారిత్రాత్మక కట్టడాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. మరో మారు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

రైతుకు అస్వస్థత

పొలంలోకి దిగిన కాసేపటికే 8 మంది రైతులకు అస్వస్థత.. అసలేం జరిగిందంటే?

అదిలాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలంలోని జైహింద్ పూర్ లో పోడు రైతులు ఆందోళన చెందుతున్నారు. పోడు భూముల్లో నిద్రిస్తున్న సమయంలో చౌదరి నగేశ్ అనే రైతు అస్వస్థతకు గురి అయ్యాడు. పోడు భూములలో మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ అధికారులు రావడంతో రాత్రి వేళ గత మూడు రోజులుగా పోడు భూముల్లో రైతులు, గ్రామస్థులు నిద్రిస్తున్నారు.

ఈ క్రమంలో చౌదరి నగేశ్ అనే రైతుకు నిద్రిస్తున్న సమయంలో ఆస్వస్థతకు గురి అయ్యాడు. 108 వాహనం రాకపోవడంతో నిద్రిస్తున్న ప్రాంతం నుండి ఎడ్లబండి పై గ్రామానికి తీసుకు వెళ్లి ఆటోలో కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి స్థానిక రైతులు, గ్రామస్థులు తీసుకు వెళ్లారు. గత మూడు రోజులుగా ఫారెస్ట్ అధికారులు తమ భూములల్లో మొక్కలు నాటేందుకు వచ్చి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని రైతులు గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం నిరంతర ప్రక్రియ
ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు

Telangana: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. మూడు నెలల్లో ప్రక్రియ  ప్రారంభం | Telangana Govt is Planning to Consideration of Applications for  Indiramma Houses
పాలకుర్తి
పాలకుర్తిలో నూతన తెలంగాణ తల్లి రెండో విగ్రహాన్ని వరంగల్ ఇన్చార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఒక అద్భుత కార్యక్రమం. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అఫీషియల్ గా డిక్లరేషన్ చేయలేని దుస్థితిలో నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. సోనియా గాంధీ దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాల్లో ముందుకు వెళుతుంది. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస పార్టీ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవారికి కన్నీటిని తుడిచే ప్రభుత్వం. అది తట్టుకోలేక… ఆవాకులు చవాకులు  పేలుతున్నారు. చచ్చిన పాముల పదేపదే చంపే ఉద్దేశం నాకు లేదు.. ఒకసారి కర్రు కాల్చి వాత పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తి మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలి. మొదట విడుతగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం.

పాలకుర్తిలో 3000  ఇండ్లు  ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇల్లు కట్టించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం నిరంతర ప్రక్రియ చిత్తశుద్ధితో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేదవారికి ఇస్తుంది. ఏ పార్టీ అని చూడం పేదవాడికి ఇళ్లు కట్టిస్తాం.ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే ఎస్ఎస్సి రెడ్డి నియోజకవర్గం కోసం కష్టపడుతున్నారని అన్నారు.
తరువాత గాదెపాక ఎల్లయ్య ఇంటిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జి ఝాన్సీ రెడ్డి భోజనం చేసారు.

పదహారు మంది మావోయిస్టుల లొంగుబాటు

8 మంది మావోయిస్టుల లొంగుబాటు-Namasthe Telangana

సుక్మా
16 మంది మావోయిస్టులు, సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చాహ్న,  సిఆర్పిఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఇద్దరిపై 16 లక్షల రూపాయల రివార్డు మరో ఆరుగురిపై 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా గతంలో పలు విధ్వంసకర సంఘటనలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Related posts

Leave a Comment