సంక్షిప్త వార్తలు : 02-06-2025

Thummala nageshsarao

సంక్షిప్త వార్తలు : 02-06-2025:రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద  రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళులు అర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో   మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  పతాక ఆవిష్కరణ

భద్రాద్రి
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద  రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళులు అర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమానికి , కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తదితరులు హజరయ్యారు.

మిర్యాలగూడలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

నల్గొండలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
నల్గొండ
మిర్యాలగూడలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పట్టణంలో బతుకమ్మలు, బోనాలు,త్రివర్ణ పతాకాలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి,ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రారంభించారు. తరువాత  కళాభారతిలో తెలంగాణ ఖ్యాతిని వివరిస్తూ పలు సాంస్కృతి కార్యక్రమాలు జరిగాయి..

అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ఎమ్మెల్యే కోమటిరెడ్డి

Komatireddy Raj Gopal Reddy: మునుగోడు అభివృద్ధి కోసం ఏ త్యాగానికైనా సిద్దం:  రాజగోపాల్‌రెడ్డి | Munugodu Komatireddy Raj Gopal Reddy BJP TRS  bbr-MRGS-Telangana

మునుగోడు
11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మునుగోడు లోని ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి జాతీయ జెండా ఎగరేసారు. తరువాత గౌరవ వందనం స్వీకరించారు.
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మునుగోడు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.  మనకోసం మనం బ్రతకడం స్వార్థం, రాష్ట్రం కోసం దేశం కోసం సమాజం కోసం బ్రతకాలి.  నా రాష్ట్రం నా దేశం అనే అభిప్రాయం ప్రతి మనిషిలో ఉండడం అవసరం. అధికారంలో  ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మన రక్తంలో మన దేశం మన రాష్ట్రం  అనే భావన ఉండాలి.

మనమంతా ఒకటే మనమందరం ఐక్యమత్యం గా ఉన్నాం అని భవిష్యత్తు తరాలకు చాటి చెప్పడానికి జెండా పండుగలు చేయాలి.  నేనొక్కడినే అనుకుంటే అభివృద్ధి జరగదు నాతోపాటు మీరందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది.  అందరం కలిసి పని చేసి   అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సంకేతాన్ని ప్రజలకు పంపించాలని అన్నారు.నాయకుడు అనే వాడు గ్రామస్థాయిలో గాని రాష్ట్రస్థాయిలో గాని మానవత్వంతో ఆలోచించాలి. అప్పుడే ప్రజల మనసుల్లో ఉంటాడు.   స్వార్థంతో ఆలోచించే వారు నాయకులు కాలేరు
ఈ క్యాంపు కార్యాలయ వేదిక ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలనే సొంత ఖర్చుతో ఆధునికరించాము..  ఈ క్యాంపు కార్యాలయం నాది కాదు మీది. నియోజకవర్గ ప్రజలదని అన్నారు.

అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు అందజేత..

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు షాకింగ్ న్యూస్ - వారి అనుమతులను రద్దు చేయాలని  నిర్ణయం

జమ్మికుంట
ఆదివారం  జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారంలో బొంగోని వీరన్న & మారపల్లి బిక్షపతి, ఆధ్వర్యంలో ఒకటో వార్డు రెండో వార్డు లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను నిరుపేద కుటుంబం లబ్ధిదారులకు  కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జ్ వోడతల ప్రణవ్ బాబు, చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. లబ్ధిదారులకు స్వయంగా ఇంటికి వెళ్లి ఇందిరమ్మ మంజూరు పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఓడితల ప్రణవ్ బాబు, మాట్లాడుతూ మంజూరైన లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సత్కరించి మీరందరూ త్వరగా ఇల్లు కట్టుకోవాలని లబ్ధిదారులను కోరారు..పదేళ్లు టిఆర్ఎస్ ప్రభుత్వం మాటలే చెప్పింది గాని చేతుల్లో ఏ పని చేయలేదు.

ఒకసారి కాంగ్రెస్ పార్టీ మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకుంటుంది ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు,  కొత్త రేషన్ కార్డులు,  200 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుపేద కుటుంబాలకు సన్నబియ్యం, ఫ్రీ బస్సు, ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వం చేస్తుందని మీరంతా కాంగ్రెస్  ప్రభుత్వానికి  అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేశిని కోటి, పొన్నగంటి మల్లయ్య. ఎర్రం సతీష్ రెడ్డి, సుంకరి రమేష్, సాయిని రవి, గూడెపు సారంగపాణి, మొలుగురి సదయ్య, రేణుక, తాజా మాజీ కౌన్సిలర్లు  మేడిపల్లి రవీందర్, ఎలగందుల స్వరూప- శ్రీహరి,   పిట్టల శ్వేతా- రమేష్, దేశిని రాధా- సదానందం, దిడ్డి.రామ్మోహన్, కుతాడి రాజయ్య, బిట్ల కళావతి- మోహన్, జమ్మికుంట మార్కెట్ డైరెక్టర్లు గడ్డం దీక్షిత్, సూర్య, స్థానిక నాయకులు పాత సత్యం, ముద్దమల్ల రవి, ఎండి సలీం, పోతుల శ్రీనివాస్, లింగారావు, సదానందం, అజయ్, అనిల్, రవి, విష్ణు యూత్ కాంగ్రెస్ నాయకులు పర్లపెల్లి నాగరాజు, సజ్జాద్ మొహమ్మద్, తదితరులు పాల్గొన్నారు

అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన.. ఎమ్మెల్యే దొంతి

అమరవీరుల స్థూపానికి నివాళులు... ఆ తర్వాతే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్  (ఫోటోలు) | CM KCR Participated Telangana Fornation Day Celebrations | Cm  Kcr Participated Telangana ...
నర్సంపేట జూన్ 2
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డు కూడలిలో అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తో పాటు అది కారులు కాంగ్రెస్ నాయకులు అమరవీరులకు నివాళులు అర్పించి,అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు,సబ్బండ వర్గాల ప్రజలు ఉద్యమం చేయడం ద్వారా యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒరిగిందేమీ లేదని, నేడు మళ్ళీ ఇందిరమ్మ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇల్లు లేని ప్రతీ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామన్నారు.

నర్సంపేట నియోజకవర్గంలో 3500 ఇండ్లను మంజూరు చేశామని, 175 కోట్ల రూపాయలు నియోజకవర్గంలో ఇళ్లకు ఖర్చు చేస్తున్నామని,మున్సిపాలిటీ పరిధిలో 500 ఇండ్లు 25 కోట్ల పైచిలుకు రూపాయలు ఖర్చుపెట్టి పేదవారికి ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రొసీడింగ్ పత్రాలను అందచేస్తామన్నారు.అంతేకాకుండా రాజీవ్ యువ వికాసం పథకంలో నిరుద్యోగులైన యువతీ యువకులతో పాటు రైతులకు సైతం లబ్ధి చేకూరే విధంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,మహిళలు,ఎన్ ఎస్ యు ఐ సీ కిసాన్ సెల్  సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment