సంక్షిప్త వార్తలు : 03-06-2025:ఆకివీడులో ఒకటో తరగతి చదువుతున్న 8 సంవత్సరాల బాలికను సమీపాన నివసిస్తున్న మాంసం వ్యాపారి షేక్ మీరా అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ ఉండడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రులు తిరపతి నుంచి ఇక్కడికి వచ్చి బడ్డీ కొట్టు నడుపుకుంటున్నారు.
ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఆకివీడు
ఆకివీడులో ఒకటో తరగతి చదువుతున్న 8 సంవత్సరాల బాలికను సమీపాన నివసిస్తున్న మాంసం వ్యాపారి షేక్ మీరా అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ ఉండడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రులు తిరపతి నుంచి ఇక్కడికి వచ్చి బడ్డీ కొట్టు నడుపుకుంటున్నారు.
ఆకివీడు సంత మార్కెట్ ప్రాంతంలోని పడాల వారి వీధిలో నివసిస్తున్నారు. బాలికను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. పోలీసులు నిందితుడి ని అదుపులోకి తీసుకున్నారు. బాలికకు ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేస్తున్నారు. బంధువులు. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆకివీడు ఎస్ఐ హనుమంత నాగరాజు సంఘటన స్థలానికి చేరి వివరాలు సేకరించారు.
విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులపై కేసులు నమోదు

హైదరాబాద్
విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసులు నమోదు చేసారు. ఆపరేషన్ గోమాత పేరుతో రోడ్డుపై గుంపులు గుంపులుగా విహెచ్పి ప్రతినిధులు చేరుకున్నారు. డీజీపీకి మెమొరండం అంటూ ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్లపై పార్క్ చేసిన వాహనాలను నెట్టేసారు. రోడ్డుపైకి రాకుండా భారీ గేట్లను ఏర్పాటు చేస్తే వాటిని కుడా నెట్టేసారు. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారని సుల్తాన్ బజార్ పోలీసులకు ఎస్ఐ మధుసూదన్ ఫిర్యాదు చేసారు. రోడ్డుపై వెళ్లే ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన విహెచ్పి ప్రతినిధులు శశిధర్, దీపక్ యాదవ్, సుభాష్, బాలకృష్ణ, జగదీశ్వర్, శ్రీనివాసరాజు, అజయ్ రాజ్, అభిషేక్, విజయరామ్, శ్రీధర్, రమేష్ లపై కేసులు నమోదు అయ్యాయి.
లక్షల మందికి రేషన్ సరుకులు

ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకత ఉండాలనే ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా 29,760 రేషన్ దుకాణాల ద్వారా ఇప్పటి వరకు 34.81 లక్షల మందికి రేషన్ సరకులు అందించాం. 3.73 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇంటింటికీ వెళ్లి రేషన్ సరకులు ఇచ్చాం. గత ఏడాది ఇదే సమయానికి అప్పటి ప్రభుత్వం 9260 ఎండీయూ వాహనాలతో 25.18 లక్షల మందికి మాత్రమే సరుకులు పంపిణీ చేసింది. వాళ్లతో పోల్చుకుంటే మనం 60 శాతం ఎక్కువగానే ఇచ్చాం.
వృద్ధులు, దివ్యాంగులకు ఎవరూ రేషన్ షాపులకు రావాల్సిన అవసరం లేదు. ఈ నెల 5లోగా రేషన్ ఇంటికే ఇవ్వాలని డీలర్లను ఆదేశించాం. కొన్ని చౌక ధరల దుకాణాల వద్ద సర్వర్ సమస్యలు తలెత్తాయని తెలిసి, వెంటనే పరిష్కరించి పంపిణీ కొనసాగించాం. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయి. పనులు మానుకొని రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్డుదారులకు మరింత సౌకర్యం కల్పిస్తూ.. ఏ దుకాణానికైనా వెళ్లి రేషన్ తీసుకునేలా పోర్టబులిటీ తీసుకొచ్చాం. ఇందుకోసం ప్రతి డీలర్కు 10 శాతం ఎక్కువగా సరకులు సరఫరా చేశాం” అన్నారు.
