సంక్షిప్త వార్తలు : 03-06-2025:ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీలో గల రైల్వే స్టేషన్లో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మరియు ఎంపీ చిన్ని పరిశీలించారు. విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీ దృష్టిలో ఉంచుకొని దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్లో డెవలప్ చేసే క్రమంలో కొండపల్లి రైల్వే స్టేషన్ లో పరిశీలించారు.
కొండపల్లి రైల్వే స్టేషన్ ని పరిశీలించిన ఎంపి చిన్ని
విజయవాడ
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీలో గల రైల్వే స్టేషన్లో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మరియు ఎంపీ చిన్ని పరిశీలించారు. విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీ దృష్టిలో ఉంచుకొని దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్లో డెవలప్ చేసే క్రమంలో కొండపల్లి రైల్వే స్టేషన్ లో పరిశీలించారు. అక్కడ ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
రైతు మృతి ..గ్రామస్థుల అందోళన

సిద్దిపేట
మర్కుక్ (మం) నరసన్నపేట గ్రామంలో విషాదం నెలకొంది. గుండెపోటుతో రైతు భిక్షపతి(40) మృతి చెందాడు. గతేడాది అనారోగ్యంతో భార్య మృతిచెందింది. చివరకు ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. 15 రోజుల క్రితం భూమి ఆర్ఆర్ఆర్ లో భూమి పోతుందని భిక్షపతికి అధికారులు నోటీసులు ఇచ్చారు. భిక్షపతి మృతికి అధికారులే కారణమంటూ గ్రామస్థులు రోడ్డుపై ధర్నాకు దిగారు. కిలో మీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో ముగ్గురు గల్లంతు

కామారెడ్డి
నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృత దేహాలకోసం గాలింపు జరిపారు. ఎల్లారెడ్డి మండలం సోమర్ పేట్ శివారులో ఘటన జరిగింది. మధుకర్ గౌడ్ , నవీన్ , హర్షవర్ధన్ గల్లంతయ్యారు.
సైకత శిల్పం ద్వారా హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు

సిద్దిపేట
సిద్దిపేట కోమటి చెరువుపై మాజీ మంత్రి హరీష్ రావు సైకత శిల్పం దర్శనమచ్చింది. హరీష్ రావు పుట్టినరోజు సందర్బంగా సైకత శిల్పం వేయించి పార్టీ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి అభిమానాన్ని చాటుకున్నారు. కోమటి చెరువుపై సైకత శిల్పం వద్ద కేక్ కట్ చేసి జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. కెసిఆర్, హరీష్ రావు సైకత శిల్పాలు అందిరిని ఆకట్టుకున్నాయి.
ఏనుగుల గుంపు పై అధికారుల హెచ్చరికలు

కొమరంభీం ఆసిఫాబాద్
సిర్పూర్ (టీ) మండలంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించే అవకాశం వుందని అధికారులు హెచ్చరించారు. దాంతో భయం భయంగా గ్రామస్తులు వున్నారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని అటవిశాఖ అధికారులు, గ్రామపంచాయతీలు డప్పు చాటింపులు చేయిస్తున్నారు.
