సంక్షిప్త వార్తలు : 03-06-2025:రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై యేడాది అయిందని జనసేనపార్టీ తిరుపతి పట్టణాధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. ఈ మేరకు ఒక కరపత్రం విడుదల చేసారు. రాజారెడ్డి మాట్లాడెఉతూ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం వదిలి యేడాది అయ్యింది. సుపరిపాలన మొదలై యేడాది అయ్యింది.
జూన్ 4న పీడ విరగడై యేడాది
కరపత్రాలను విడుదల చేసిన జనసేన
తిరుపతి
రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై యేడాది అయిందని జనసేనపార్టీ తిరుపతి పట్టణాధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. ఈ మేరకు ఒక కరపత్రం విడుదల చేసారు. రాజారెడ్డి మాట్లాడెఉతూ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం వదిలి యేడాది అయ్యింది. సుపరిపాలన మొదలై యేడాది అయ్యింది. రాష్ట్రానికి దక్కిన మహర్థశకు ప్రతీకగా రేపు దీపావళి, సంక్రాంతి పండుగులను చేసుకుంటాం.
తిరుపతిలో పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటామని అన్నారు. ఇళ్ళ ముందు రంగవల్లులు, దీపాలను వెలిగించి పండుగ చేసుకుంటాం. వెన్నుపోటు దినం చేసుకోవడానికి సిగ్గుండాలి. వెన్నుపోటు దినం కరెక్ట్ గా లేదు..గొడ్డలిపోటు దినోత్సవం చేసుకోండి. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసినందుకు వెన్నుపోటు దినం చేసుకో జగన్. కూటమి అభివృద్ధిని చూసి ఓర్వలేకే పనికిమాలిన కార్యక్రమాలు వైసిపి చేస్తోందని అన్నారు.
తెలుగులో విడుదలైన “నరివెట్ట” చిత్రంలో ఎమోషన్స్ సీన్స్ లో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరో “టొవినో థామస్” !!!

మలయాళ హీర టొవినో థామస్ నటించిన లేటెస్ట్ కాప్ యాక్షన్ డ్రామా చిత్రం ‘నరివెట్ట’ మలయాళంతో పాటు తెలుగులో విడుదలై మంచి విజయం సాధించింది, టొవినో నటనకు ప్రసంశలు వస్తున్నాయి. మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ హీరోకు తెలుగులోనూ మంచి గుర్తింపు దక్కింది. నరివెట్ట సినిమా చూస్తూ ఎమోషనల్ అయిన ఆడియన్స్, మలయాళంలో అలాగే తెలుగు లోను సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో ప్రదర్షింపబడుతున్న ఈ సినిమా ను చూసి ఆడియన్స్ బావోద్యేగానికి లోనవుతున్నారు, ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హీరో టొవినో థామస్.
‘ఐడెంటిటీ’ ‘ఏఆర్ఎమ్’ మూవీస్ లో టొవినో తన పాత్రతో ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ దక్కించుకున్నాడు. లేటెస్ట్ గా నరివెట్ట సినిమా ద్వారా ఇలా పోలీస్ స్టోరీ చిత్రంతో రావడంతో తెలుగు ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాను అనురాజ్ మనోహర్ డైరెక్ట్ చేస్తుండగా అబిన్ జోసెఫ్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో సురాజ్ వెంజరమూడు, చెరణ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.
జగనే పెద్ద వెన్నుపోటుదారుడు

విశాఖపట్నం
వైసీపీకి వెన్నుపోటు దినం నిర్వహించే నైతిక హక్కు లేదని.. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డినే పెద్ద వెన్నుపోటు దారుడని ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్,విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా మని అన్నారు.శివ కుమార్‌కి వెన్ను పోటు పొడిచి ఆ పార్టీని జగన్ తీసుకున్నారని మండిపడ్డారు గండి బాబ్జి.
వైసీపీ అధినేత జగన్.. తన బాబాయ్ హత్యకి గొడ్డలి పోటు పొడిచారని.. ఇప్పుడు వెన్నుపోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందని ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖపట్నం జిల్లా టీడీపీ అధ్య క్షులు గండి బాబ్జి విమర్శించారు. సొంత చెల్లికి, తల్లికి వెన్నుపోటు పొడిచింది జగనే అని ఆరోపించా రు. వైసీపీ హయాంలో ఏపీ సర్వ నాశనం అయిందని గండి బాబ్జి విమర్శించారు.
మిస్ వరల్డ్ పోటీలపై రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు చేసాం
మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్ జూన్ 3
మిస్ వరల్డ్ పోటీలపై బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్‌రావుకు సవాల్ చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు చాలా దేశాలు పోటీ పడ్డాయని, ఎన్నో దేశాలతో పోటీ పడి హైదరాబాద్‌కు అవకాశం దక్కించుకుందని తెలియజేశారు. హరీష్ రావుకు జూపల్లి రీకౌంటర్ ఇచ్చారు. తెలంగాణ పర్యాటక రంగానికి ప్రాచుర్యం కోసమే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించామన్నారు. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, హస్తకళల గొప్పతనం ప్రపంచానికి తెలిసిందని, బిఆర్ఎస్ చేసిన ప్రతి ఆరోపణపై బహిరంగా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని జూపల్లి స్పష్టంచేశారు.
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు రూ.31 కోట్లు ఖర్చు చేశామని, రూ.31 కోట్ల ఖర్చులో స్ఫానర్ల ద్వారానే రూ.21 కోట్లు వచ్చాయని వివరించారు. మరో రూ.12 కోట్ల ఆదాయంపై ఒప్పందాలు ఉన్నాయని, మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.10 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల కోట్లు ఖర్చు చేసినట్లు హరీష్ రావు నిరూపిస్తారా? అని సవాల్ విసిరారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు 30 తులాల బంగారం ఇచ్చారనేది అబద్ధమని జూపల్లి దుయ్యబట్టారు. 30 తులాలు కాదు అని, మూడు గ్రాముల బంగారం కూడా ఇవ్వలేదన్నారు.
మనుషులకు ఆధార్ కార్డు లాగే త్వరలో భూములకు భూధార్ కార్డ్ లు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్ జూన్ 3
మనుషులకు ఆధార్ కార్డు లాగే భూములకు త్వరలో భూధార్ తీసుకువస్తాం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భూభారతి చట్టం తీసుకొచ్చామని అన్నారు. ఖమ్మం జిల్లా- ఎర్రుపాలెం సదస్సుకు మంత్రులు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా తుమ్మల సదస్సులో మాట్లాడుతూ.. కంప్యూటర్ లో భూధార్ నంబర్ కొట్టగానే అన్నివివరాలు వస్తాయని, లైసెన్స్ డ్ సర్వేయర్లను నియమించి భూములను సర్వే చేయిస్తామని చెప్పారు. గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి 3500 మంది రెవెన్యూ అధికారులను నిమమిస్తున్నామని, రెవెన్యూ అధికారులు గ్రామాల్లోనే రైతుల సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. భూమి సమస్యలకు పరిష్కారాలు అభించక పదేళ్లపాటు రైతులు ఇబ్బంది పడ్డారని తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు.
వరంగల్ జిల్లాలో కరోనా కలకలం..
ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆరుగురుకి కరోనా పాజిటివ్

వరంగల్ జూన్ 3
వరంగల్ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. వరంగల్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆరుగురుకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. తీవ్రమైన దగ్గు, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగడంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వరంగల్ ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని నెటిజన్లు కోరుతున్నారు. వరంగల్‌ను కంటైన్మెంట్ జోన్ ప్రకటిస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

