సంక్షిప్త వార్తలు : 03-06-2025:రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఈ రోజు మేకర్స్ ప్రకటించారు.
డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్”, ఈ నెల 16న టీజర్ విడుదల
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఈ రోజు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 16న ఉదయం 10.52 నిమిషాలకు “రాజా సాబ్” టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ అనౌన్స్ మెంట్ తో రెబెల్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ డబ్బులతో నిండి ఉన్న గదిలో ఫెరోషియస్ గా కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది.
మరోవైపు “రాజా సాబ్” రిలీజ్ డేట్, టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.”రాజా సాబ్” సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో ఈ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. “రాజా సాబ్” సినిమాతో ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నారు డైరెక్టర్ మారుతి.నటీనటులు – ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, తదితరులు
తీర ప్రాంతంలో యోగాంధ్ర కార్యక్రమం
శ్రీకాకుళం
శ్రీకాకుళం పెద్దగణగళ్ళవానిపేట తీర ప్రాంతంలో ఘనంగా యోగాంధ్ర యోగా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్,జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అధికారులు,మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.పెద్దగణగళ్లవానిపేటలో 5000 మందికి పైగా మత్స్యకారులు యోగాసనాలు వేశారు.యోగాతో శారీరక రుగ్మతలు దూరమవుతాయని కలెక్టర్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో జరగనుందని అన్నారు
కడియం శ్రీహరిని అడ్డుకున్న మహిళ

జనగామ
ఇందిరమ్మ ఇండ్ల పంపిణి కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ తగిలింది. అయితే నిరసన తెలిపిన మహిళను పోలీసులు ఈడ్చుకెళ్లారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణి కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మహిళలు అడ్డుకున్నారు.
నిరుపేదలయిన తమకు కాకుండా లక్షలకు లక్షలు ఆస్తులున్న వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారంటు శివునిపల్లి గ్రామానికి చెందిన పుంజూరి రజిత – నాగరాజు దంపతులు ఫ్లెక్సీతో నిరసన కు దిగారు. తమకు ఇల్లు ఇవ్వాలని ఎమ్మెల్యేను దండం పెట్టి వేడుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకుని ఫ్లెక్సీని లాగేసుకుని బాధితులను ఈడ్చుకెళ్లారు.
క్రిమినల్స్ కు జగన్ మద్దతు ఇస్తున్నారా.

విజయవాడ
గంజాయి కేసుతో సంబంధం ఉన్న వారిని పరామర్శించడం ద్వారా సీఎం జగన్ రాజకీయంగా తనకు తానే నష్టపర్చుకున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. పోలీసులపై దాడికి పాల్పడ్డ గ్యాంగ్కు జగన్ మద్దతుగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఎంపీగా ఉన్న సమయంలో తనపై దాడి జరగడానికి జగన్ కారణమని ఆరోపించారు. ఇలా వ్యవహరించడం ఆత్మహత్యతో సమానమని విమర్శించారు.
ముక్కు నేలకు రాస్తే కేతిరెడ్డిని బీజేపిలో చేర్చుకుంటాం
ధర్మవరం
అవసరమైతే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని సైతం బీజేపీలో చేర్చుకుంటామని అనంతపురం ధర్మవరం బీజేపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ హరీష్ బాబు అన్నారు.ధర్మవరంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీలో చేరికల గురించి మిగతా పార్టీ వాళ్లు ఏదో మాట్లాడుతున్నారని ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీ అని కేతిరెడ్డి సైతం తాను చేసిన తప్పులను ఒప్పుకొని ముక్కు నేలకు రాస్తే బీజేపీలో చేర్చుకుంటామన్నారు.
