సంక్షిప్త వార్తలు : 03-06-2025:పరవాడ మండల పరిథిలో లారీ బీభత్సం సృష్టించింది. గాజువాక అనకాపల్లి రహ దారిపై లంకెలపాలెం సిగ్నల్స్ వద్ద అదుపు తప్పిన ఏపీ 39 యూసి 4551 బొగ్గు లారీ ఒక్క సారిగా సిగ్నల్స్ పైకి దూసుకు వచ్చింది ఈ ప్రమాదంలో ఓ ఆటో,కారు పూర్తిగా ధ్వంసం కాగా ఇద్దరు గాయపడ్డారు ప్రమాదంలో మరో కారు ధ్వంసమైంది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనస్థలానికి చేరుకున్నారు.
పరవాడలో లారీ బీభత్సం
విశాఖపట్నం
పరవాడ మండల పరిథిలో లారీ బీభత్సం సృష్టించింది. గాజువాక అనకాపల్లి రహ దారిపై లంకెలపాలెం సిగ్నల్స్ వద్ద అదుపు తప్పిన ఏపీ 39 యూసి 4551 బొగ్గు లారీ ఒక్క సారిగా సిగ్నల్స్ పైకి దూసుకు వచ్చింది ఈ ప్రమాదంలో ఓ ఆటో,కారు పూర్తిగా ధ్వంసం కాగా ఇద్దరు గాయపడ్డారు ప్రమాదంలో మరో కారు ధ్వంసమైంది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనస్థలానికి చేరుకున్నారు.
లారీ డ్రైవర్ పరారయ్యాడు,డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు లారీలో వున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ప్రమాదానికి గల కారణాలను పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు వాహన దారుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా రాక పోకలను పునరుద్దరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ విధానంపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం ఫైర్

హైదరాబాద్
కాంగ్రెస్ బిజెపి పార్టీల ఫ్లెక్సీలని తొలగించని అధికారులు బిఆర్ఎస్ ప్లెక్సీలను ఎందుకు తొలగిస్తారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన నాయకుడు మాజీమంత్రి హరీష్ రావు పుట్టినరోజుకి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తొలగిస్తారా. కెసిఆర్ పుట్టినరోజు ,తన పుట్టినరోజు తో పాటు బిఆర్ఎస్ రజతోత్సవం కార్యక్రమాలు అవ్వకముందే వేసిన ఫ్లెక్సీలు తీస్తారా. గాంధీభవన్ వద్ద బిజెపి పార్టీ ఆఫీస్ వద్ద నెలల తరబడి ఉంటున్న ప్లెక్సీలను ఎందుకు తీయాట్లేదని ప్రశ్నించారు.
బిఆర్ఎస్ భవన్ ముందు ఉన్న ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారు.
బిఆర్ఎస్ పార్టీ నాయకులను.. ఫ్లెక్సీలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి వణుకు పుడుతుంది. ఫ్లెక్సీలను తొలగించే అధికారులు ఒకే పార్టీకి తొత్తులుగా పనిచేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అధికారులు చేసే పనులను గుర్తుపెట్టుకుంటున్నాం. అతి ఉత్సాహం చూపే అధికారులకు వడ్డీతో సహా లెక్కలు చెల్లిస్తామని అన్నారు.
ఏటీఎంలో చోరీ యత్నం

సంగారెడ్డి
పారిశ్రామిక వాడ ఐడిఏ బొల్లారం మున్సిపల్ పరిధిలోని ఏటిఎం లో చోరీకి విఫలయత్నం జరిగింది. ఏటిఎం మిషన్ పగలగొడుతుండగా అలారం మోగడంతో దొంగ పరారైయాడు. మంగళవారం తెల్లవారు జామున 03:01 నుండి 03:24 మధ్యలో గుర్తు తెలియని నేరస్తుడు బీరప్ప బస్తీ, బొల్లారం లో గల హెచ్డిఎఫ్సీ ఏటీఎం ను పగులగొట్టి డబ్బులు దొంగతనం చేయుటకు ప్రయత్నం చేసి విఫలం అయినాడు. సీసీ ఫుటేజ్ తో పోలీసులు విచారణ చేపట్టారు. ఐడిఎ బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏడీబీ రోడ్డుపై ప్రమాదం దురదృష్టకరం
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

విజయవాడ
రాజమండ్రి – కాకినాడ ఏడీబీ రోడ్డుపై వడిశలేరు వద్ద చోటు చేసుకున్న ప్రమాదం లో అయిదుగురు దుర్మరణం పాలయ్యారని తెలిసి చింతిస్తున్నాను. ఈ ప్రమాదం దురదృష్టకరమైనదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఏడీబీ రహదారి పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఇప్పటికే సంబంధిత శాఖలకు, జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశామని అయన అన్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న టిఎస్సార్ మూవీ మేకర్స్ ‘ప్రొడక్షన్ నెంబర్ 3’!

టిఎస్సార్ మూవీ మేకర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందిన కొత్త చిత్రం షూటింగ్ విజయవంతంగా ముగిసింది. తిరుపతి శ్రీనివాసరావు నిర్మాణ సారథ్యంలో, ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకోనుంది. నటుడు హరికృష్ణ హీరోగా, భవ్యశ్రీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రేమ, త్యాగం, కుటుంబ విలువలను ఆవిష్కరిస్తూ భావోద్వేగాలతో నిండిన కథాంశంతో రూపొందింది.సినిమాటోగ్రఫీ బాధ్యతలను ప్రభాకర్ రెడ్డి నిర్వహించగా, గౌతమ్ రవిరామ్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. విజయ్ కందుకూరి రచించిన సంభాషణలు కథను మరింత బలపరిచాయి.
ప్రేమ, త్యాగం, కుటుంబ బంధాలను ఆలంబనగా చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక భావోద్వేగ అనుభవాన్ని అందించనుంది.షూటింగ్ పూర్తయిన సందర్భంగా నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ, “మా బృందం అంకితభావంతో పనిచేసింది. ఈ సినిమా అందరి హృదయాలను తాకుతుందని ఆశిస్తున్నాం” అన్నారు. దర్శకుడు ఆదినారాయణ మాట్లాడుతూ, “ప్రేక్షకులకు ఒక అర్థవంతమైన కథను అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు. త్వరలో విడుదల తేదీని, ఆసక్తికరమైన టైటిల్ తో ప్రకటించనున్న చిత్ర బృందం, ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ ఆశిస్తోంది.
