సంక్షిప్త వార్తలు : 04-06-2025:రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేశారు. క్యాబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో పుస్తక ప్రతిని పవన్ తో పాటు, ఇతర మంత్రులకు లోకేష్ అందజేశారు.
జగన్ రాక్షస పాలనపై సమర శంఖంలా యువగళం
యువగళం పుస్తకంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంస
అమరావతి:
రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేశారు. క్యాబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో పుస్తక ప్రతిని పవన్ తో పాటు, ఇతర మంత్రులకు లోకేష్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృత మైందన్నారు.
ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తేవడంపై లోకేష్ ను ప్రశంసించారు. ఈ రోజుకి అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికి జనం మర్చిపోలేదన్నారు. యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను ఈ సందర్భంగా యువనేత లోకేష్… పవన్ కళ్యాణ్ తో పంచుకున్నారు.
నరసరావుపేట లో పర్యటించిన ఎమ్మెల్యే చదలవాడ
నరసరావుపేట,
నరసరావుపేట పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు పర్యటించారు. అకాల వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డెంగ్యూ,మలేరియా, విషపు జ్వరాలు, ప్రజలకు ఈ వర్షాల కారణంగా వ్యాధులు దరిచేరాకుండా ఉండేందుకు మురికి కాలువల్లో దోమల మందు స్ప్రే చేయించడం జరిగినది. ఈ కార్యక్రమం అన్ని వార్డులలో ప్రతిరోజు జరపాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు జరిపించటం జరుగుతుంది అని అన్నారు. ఈరోజు కాలనీలో మొదలు పెట్టడం జరిగింది అని అన్నారు.
కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్వచ్ఛ నరసరావుపేటకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రతి వార్డుల్లో కాలువలలో పూడికను తీసి శుభ్రం చేస్తున్నామన్నారు. వర్షం వచ్చినప్పుడు నరసరావుపేటలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు ప్రజలు కాలవల్లో చెత్త వేయకుండా శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని మున్సిపాలిటీ వారికి సహకరించాలని కోరారు.
కుమారుడిని చంపి తల్లి ఆత్మహత్య
![]()
కాకినాడ
కాకినాడ రేచర్లపేట లో కుటుంబ కలహాల నేపథ్యంలో నాలుగేళ్ల కుమారుడు హత్య చేసి తల్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న త్రీటౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్సై తులసీరామ్, స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
ఉపాధిహామీ కూలీలపై పిచ్చికుక్క దాడి.. ఐదుగురికి గాయాలు

సూర్యాపేట
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అల్లిపురంలో పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. హుజూర్ నగర్ మండలం అమరవరంలో ఉపాధిహామీ కూలీలపై పిచ్చి కుక్క దాడి చేసింది. బాధితులు హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రిలో వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఎర్రగడ్డ ఆసుపత్రిలో రోగులకు అస్వస్థత
హరీష్ రావు మండిపాటు

మెదక్
వేములవాడలో కోడెల మృతి, ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేసారు. హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేత కావడం లేదు. ఎర్రగడ్డలో మానసిక రోగులకు అన్నం పెట్టడానికి చేత కావడం లేదు. 70 మంది అస్వస్థతకు గురైతే సీఎం ఇప్పటివరకు స్పందించలేదు.
వేములవాడలో కోడెల మృత్యువాత పడుతుంటే మీకు సోయి లేదా అని నిలదీసారు. ఇప్పటివరకు గడ్డి లేక 27 కోడెలు చనిపోతే ప్రభుత్వం ఎం చేస్తున్నట్టు. మీకు చేత కాకపోతే మాకు బాధ్యత అప్పగిస్తే కోడెలను మేము కాపాడుతాం. ఎంత సేపు మాపై కక్ష కట్టి ఏ కేసుల్లో ఇరికించాలి, ఏ కమిషన్ వెయ్యాలి అన్న ఆలోచనలే కానీ అసలు సమస్యలు పట్టించుకోరా. రేపటి క్యాబినెట్ మీటింగ్ లో రైతు బంధు డబ్బులను విడుదల చేయాలని అన్నారు.
