AP : ఏపీలో శాంతిభద్రతల బలోపేతానికి ప్రభుత్వం సీరియస్: నేరగాళ్లకు చెక్ పెట్టేలా కొత్త విధానాలు

AP Government Eyes UP-Style Crackdown on Rowdies, Focuses on Welfare Benefit Suspension

AP : ఏపీలో శాంతిభద్రతల బలోపేతానికి ప్రభుత్వం సీరియస్: నేరగాళ్లకు చెక్ పెట్టేలా కొత్త విధానాలు:ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అండదండలతో చెలరేగిపోతున్న రౌడీలు, సంఘవిద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని కట్టడి చేసేందుకు ఉత్తరప్రదేశ్ తరహాలో కఠిన విధానాలు అమలు చేసే అంశంపై ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో రౌడీలు, సంఘవిద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం సన్నద్ధం

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అండదండలతో చెలరేగిపోతున్న రౌడీలు, సంఘవిద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని కట్టడి చేసేందుకు ఉత్తరప్రదేశ్ తరహాలో కఠిన విధానాలు అమలు చేసే అంశంపై ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే, ఉత్తరప్రదేశ్‌లో అమలవుతున్న వివాదాస్పద బుల్డోజర్ విధానాలు, ఎన్‌కౌంటర్లకు బదులుగా, నేర ప్రవృత్తిని అరికట్టే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కొందరు రాజకీయ అండతో నేరాలకు పాల్పడుతూ, శాంతిభద్రతలకు సవాల్ విసురుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి వారిని కట్టడి చేయకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అలవాటుగా నేరాలకు పాల్పడేవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేయడం ద్వారా వారి కుటుంబ సభ్యుల నుంచే ఒత్తిడి తీసుకురావచ్చని, తద్వారా వారిలో మార్పు వస్తుందని ఒక ప్రతిపాదనగా ఉంది. మహిళలపై నేరాలకు పాల్పడితే రౌడీషీట్ తెరుస్తామని హోంమంత్రి అనిత; గంజాయి-డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని మంత్రి లోకేశ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినా, కొందరు వాటిని పెడచెవిన పెడుతున్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎన్‌కౌంటర్లు, బుల్డోజర్లతో ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ పథకాల నిలిపివేత, నగర బహిష్కరణ వంటి చర్యలతో అక్కడ నేరస్థులు భయపడిపోతున్నారు. అయితే, ‘బుల్డోజర్ న్యాయం’పై తీవ్ర విమర్శలు, కోర్టుల అభ్యంతరాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి తీవ్ర చర్యలకు బదులుగా, చట్ట పరిధిలో నేరగాళ్లను కట్టడి చేసే మార్గాలపై అధికారులు దృష్టి సారించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణ పనులు, పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయని, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, కేంద్రం కూడా సహకరిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు చట్టప్రకారం పనిచేస్తూ అక్రమార్కులపై చర్యలు తీసుకుంటున్నారని, గంజాయి నియంత్రణకు ‘ఈగల్’, మహిళల భద్రతకు ‘శక్తి’ వంటి విభాగాలతో మార్పు కనిపిస్తోందని అంటున్నారు. అయితే, పోలీసు అధికారులను బెదిరించేలా కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో అరాచక శక్తులు మళ్లీ పేట్రేగే అవకాశం ఉందని,

ఇలాంటి వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదమని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.ఒకప్పుడు హైదరాబాద్‌లో మత ఘర్షణలు, రాయలసీమలో ఫ్యాక్షనిజం, కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండేది. శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాకే రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో నేర రహిత సమాజం కోసం ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.

Read also:యువకుడ్ని కాటేసిన 5 నిమిషాలకే చనిపోయిన పాము.. బాధితుడు సేఫ్.. తల పట్టుకుంటున్న వైద్యులు?| FBTV NEWS

 

Related posts

Leave a Comment