AP : చంద్రబాబుతో ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్: ఏపీ స్పేస్ పాలసీ 4.0పై చర్చ

AP's Space Ambition: Chandrababu's Vision for 2025-35 Period

AP : చంద్రబాబుతో ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్: ఏపీ స్పేస్ పాలసీ 4.0పై చర్చ:అమరావతి, జూన్ 26 (ప్రభుత్వ సమాచారం): ఆంధ్రప్రదేశ్‌ను అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలపడంతో పాటు, రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

ఏపీ స్పేస్ పాలసీ 4.0: రూ.25 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం – సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి, జూన్ 26 (ప్రభుత్వ సమాచారం): ఆంధ్రప్రదేశ్‌ను అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలపడంతో పాటు, రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం అన్నారు. లేపాక్షి మరియు తిరుపతిలలో స్పేస్ సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి, 2025-35 కాలానికి సంబంధించి అంతరిక్ష రంగంలో వ్యూహాత్మక లక్ష్యాలను నిర్దేశించారు.

గురువారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0పై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు అంతరిక్ష రంగం వైపు ఆకర్షితులయ్యేలా విద్యాసంస్థలను ఈ విధానంలో భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే, ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో వినియోగించుకునేలా కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం టెక్నికల్ కమిటీని నియమించాలని ఆదేశించారు. కమ్యూనికేషన్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న సంస్థలను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్లకు సంబంధించి సాంకేతిక అనుసంధానం జరగాలని సీఎం నొక్కి చెప్పారు.

ఈ సమీక్షలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారు, ఇస్రో మాజీ చైర్మన్ ఎస్. సోమనాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. స్పేస్ విజన్ పాలసీ-2047 కింద కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులు చేపడుతోందని, అలాగే స్టార్‌లింక్, స్పేస్‌ఎక్స్, బ్లూ ఆరిజన్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఈ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారని తెలిపారు. భవిష్యత్ అంతా అంతరిక్ష రంగానిదేనని ముఖ్యమంత్రికి సోమనాథ్ వివరించారు.అంతరిక్ష రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు మెరుగైన పెట్టుబడి రాయితీలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పెట్టుబడులను వాటి పరిమాణం ఆధారంగా వివిధ కేటగిరీలుగా విభజించారు:

1.మైక్రో: రూ.1 కోటి నుంచి రూ.2.5 కోట్ల వరకు

2.స్మాల్: రూ.2.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు

3.మీడియం: రూ.25 కోట్ల నుంచి రూ.125 కోట్ల వరకు

4.లార్జ్: రూ.125 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు

5.మెగా: రూ.500 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు

అధికారులు 25 శాతం నుంచి 45 శాతం వరకు పెట్టుబడి రాయితీ ఇచ్చేలా ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందుంచారు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే అంశంపైనా సమీక్షలో చర్చించారు.

రెండు స్పేస్ సిటీలు: లేపాక్షి, తిరుపతి

1.లేపాక్షి టెక్నాలజీ స్పేస్ సిటీ: 500 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ స్పేస్ సిటీలో డిజైన్ అండ్ డెవలప్‌మెంట్కు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్&డి, స్పేస్ స్టార్టప్‌లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, స్పేస్ అప్లికేషన్లు-సేవలకు సంబంధించిన సంస్థలు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. బెంగళూరుకు సమీపంలో ఉండటం లేపాక్షికి కలిసొచ్చే అంశం.

2.తిరుపతి మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ సిటీ: ఈ స్పేస్ సిటీని మ్యానుఫ్యాక్చరింగ్, లాంచ్ లాజిస్టిక్ సేవలు అందించే సంస్థల ఏర్పాటుకు కేటాయించారు. లాంచ్ వెహికల్ అసెంబ్లీ, శాటిలైట్-పేలోడ్ అసెంబ్లీ, మెకానికల్ సిస్టమ్-కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్-ఏవియానిక్స్ అసెంబ్లీ సంస్థలకు ఇక్కడ అవకాశం కల్పిస్తారు. శ్రీహరికోట – చెన్నైకి సమీపంలో తిరుపతి స్పేస్ సిటీ ఉండటం అనుకూలంగా ఉంటుంది. తిరుపతి స్పేస్ సిటీ నుంచి శ్రీహరికోటకు రోడ్ కనెక్టివిటీపైనా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

గ్లోబల్ స్పేస్ ఎకానమీలో ఇండియా లక్ష్యాలు

ప్రస్తుతం గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారతదేశం కేవలం 2 శాతం వాటా మాత్రమే కలిగి ఉంది. ఈ రంగంలో 2033 నాటికి 44 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియా స్పేస్ పాలసీ-2023 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) అనుమతిస్తోంది. ఇండియా స్పేస్ విజన్-2047 కింద శాటిలైట్ల తయారీ, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ల లాంచింగ్, చంద్రయాన్ 4, వీనస్ ఆర్బిటరీ మిషన్, మార్స్ ల్యాండర్ మిషన్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్-స్పేస్ స్టేషన్, నెక్ట్స్ జనరేషన్ లాంచ్ వెహికల్ (NGLV), శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణం వంటివి లక్ష్యాలుగా ఉన్నాయి. 2040 కల్లా చంద్రుడిపై మనిషి అడుగుపెట్టాలనేది ఆశయం. కేంద్ర లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ను రూపొందిస్తోంది.

Read also:Manchu Vishnu : కన్నప్ప ప్రభంజనం: రిలీజ్‌కు ముందే 1.15 లక్షల టికెట్లు సేల్!

 

Related posts

Leave a Comment