Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు: కేసీఆర్, కేటీఆర్‌ల విచారణకు డిమాండ్:ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక కుటుంబాల జీవితాలతో చెలగాటం ఆడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈరోజు కరీంనగర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ ప్రధానంగా హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక కుటుంబాల జీవితాలతో చెలగాటం ఆడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈరోజు కరీంనగర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ ప్రధానంగా హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని పేర్కొన్నారు. దీని వెనుక ఎవరున్నారు అనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలిసిపోతుందని అన్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన ఆయన, ప్రస్తుత సిట్ దర్యాప్తు సరైన దిశలో లేదని విమర్శించారు. మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అనేక కుటుంబాలను బాధించారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయారని, ఇప్పుడు సుప్రీంకోర్టు ఊరట పొందిన తరువాత ప్రభుత్వ నుంచి గౌరవాలు పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దాయన ఆదేశించాడని చెప్పిన రాధాకిషన్ రావు వాంగ్మూలం నేపథ్యంలో, మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించాల్సిన అవసరం ఉంది. సిరిసిల్ల కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై కూడా విచారణ జరగాలి” అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కలసి దోషులను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కేసును వెంటనే సీబీఐకి బదిలీ చేయాలని, ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. కేంద్రానికి సీబీఐ విచారణ జరిపే పూర్తి అధికారం ఉన్నందున, అప్పటికే నిందితులు శిక్షించబడ్డారని అన్నారు.
Read also:ఓరి నీ.. ఫేమ్ కోసం వేషాలు.. అహ్మదాబాద్ విమానంలో మృత్యుంజయడు ఎంత మాయచేశాడు?