Indonesia : ఇండోనేషియాలో అగ్నిపర్వతంపై ట్రెకింగ్ చేస్తూ బ్రెజిల్ యువతి దుర్మరణం:ఇండోనేషియాలోని అగ్నిపర్వతంపై ట్రెక్కింగ్ చేస్తూ బ్రెజిల్కు చెందిన యువతి మరణించింది. 26 ఏళ్ల పబ్లిసిస్ట్ జులియానా మారిన్స్, తన స్నేహితులతో కలిసి లోంబోక్ ద్వీపంలోని మౌంట్ రించాని అగ్నిపర్వతంపై ట్రెక్కింగ్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
మౌంట్ రింజాని మరో ప్రాణం తీసింది
ఇండోనేషియాలోని అగ్నిపర్వతంపై ట్రెక్కింగ్ చేస్తూ బ్రెజిల్కు చెందిన యువతి మరణించింది. 26 ఏళ్ల పబ్లిసిస్ట్ జులియానా మారిన్స్, తన స్నేహితులతో కలిసి లోంబోక్ ద్వీపంలోని మౌంట్ రించాని అగ్నిపర్వతంపై ట్రెక్కింగ్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. శనివారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో పర్వత శిఖరంపైకి వెళ్తున్నప్పుడు ఆమె కాలుజారి సుమారు 490 అడుగుల లోతైన లోయలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఆమె సహాయం కోసం కేకలు వేసినట్లు సమాచారం. డ్రోన్ ఫుటేజ్ ద్వారా ఆమె మొదట ప్రాణాలతోనే ఉన్నట్లు గుర్తించారు. అయితే, ప్రతికూల వాతావరణం, దట్టమైన పొగమంచు, క్లిష్టమైన భూభాగం కారణంగా సహాయక బృందాలు ఆమెను వెంటనే చేరుకోలేకపోయాయి. బాధితురాలు మెత్తటి ఇసుకలో కూరుకుపోవడంతో తాడు సాయంతో బయటకు తీసుకురావడం చాలా కష్టమైందని స్థానిక సహాయక బృందం నాయకుడు ముహమ్మద్ హరియాది తెలిపారు.
నాలుగు రోజులపాటు సాగిన సహాయక చర్యల అనంతరం, మంగళవారం జులియానా మారిన్స్ మృతదేహాన్ని కనుగొన్నట్లు ఇండోనేషియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ బృందాలు, బ్రెజిల్ ప్రభుత్వం ధృవీకరించాయి. జులియానా కుటుంబ సభ్యులు కూడా ఆమె మరణ వార్తను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.ఇండోనేషియాలో రెండో అతిపెద్ద అగ్నిపర్వతమైన మౌంట్ రించాని ఎత్తు 12,224 అడుగులు. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ పర్వతాన్ని సందర్శిస్తుంటారు. అయితే, గతంలోనూ ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. గత నెలలో కూడా ఒక మలేషియా పర్యాటకుడు ఇక్కడ మరణించినట్లు తెలిసింది.
Read also:NaraLokesh : అహంకారం వద్దు, ప్రజా సమస్యలు వినండి: టీడీపీ శ్రేణులకు లోకేశ్ సూచన
