Pawan Kalyan : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదెల గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు విరాళం

pawan kalyan donates to konidela
  • పవన్ కళ్యాణ్ సొంత గ్రామం దత్తత, అభివృద్ధికి రూ.50 లక్షల కేటాయింపు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు మండలంలో ఉన్న తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన నిధులను మంజూరు చేశారు.

నిన్న నంద్యాల కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి, డీఆర్‌ఓ రామునాయక్, పరిపాలనాధికారి రవికుమార్, సెక్షన్ సూపరింటెండెంట్ నరసింహరావులులకు ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును పవన్ కళ్యాణ్ అందజేశారు. కొణిదెల గ్రామ అభివృద్ధికి ఈ నిధులను వినియోగించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు.

ఈ ఏడాది మార్చి నెలలో పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, గ్రామ సర్పంచ్ కొణిదెల గ్రామ పరిస్థితి గురించి వివరించారు. దీంతో ఆయన ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని, తన సొంత ట్రస్ట్ నుంచి రూ.50 లక్షల నిధులను ఈ గ్రామానికి కేటాయించారు.

గ్రామంలో చేయాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించగా, గ్రామంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికను రూపొందించింది. గ్రామస్తుల అభ్యర్థన మేరకు గ్రామంలో 90 వేల లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్ నిర్మించడంతో పాటు రోడ్లు, మురుగు కాల్వలు, ఇతర వసతులు కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Read : “Go to Pakistan! – Deputy CM Pawan Kalyan Slams Congress Leaders | Intense Political Clash”

 

Related posts

Leave a Comment