Air India : ఎయిరిండియాకు డీజీసీఏ షాక్: భద్రతా నిబంధనల ఉల్లంఘనపై తీవ్ర చర్యలు

Air India Plane Crash: DGCA Orders Sacking of Three Senior Officials Over Safety Lapses

Air India : ఎయిరిండియాకు డీజీసీఏ షాక్: భద్రతా నిబంధనల ఉల్లంఘనపై తీవ్ర చర్యలు:అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా విమాన దుర్ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. భద్రతా లోపాలు, సిబ్బంది షెడ్యూలింగ్ లో నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఎయిరిండియాను ఆదేశించింది.

అహ్మదాబాద్-లండన్ విమాన ప్రమాదం

అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా విమాన దుర్ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. భద్రతా లోపాలు, సిబ్బంది షెడ్యూలింగ్ లో నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఎయిరిండియాను ఆదేశించింది. నిబంధనలు పాటించకుండా, లైసెన్సింగ్, సర్వీసింగ్ పరమైన లోపాలున్నప్పటికీ సిబ్బందిని విధులకు కేటాయించడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ అధికారులపై అంతర్గత క్రమశిక్షణ చర్యలు ప్రారంభించి, పది రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఎయిరిండియా యాజమాన్యాన్ని డీజీసీఏ ఆదేశించింది. తొలగించిన వారి స్థానంలో తక్షణమే కొత్తవారిని నియమించి, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కొనసాగించాలని సూచించింది.ఇటీవలి ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని 241 మంది ప్రయాణికులు, సిబ్బందితో పాటు, విమానం కూలిన ప్రదేశంలోని ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న పలువురు వైద్య విద్యార్థులు, స్థానికులు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 272కి చేరింది.

మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఇదిలా ఉండగా, బెంగళూరు నుంచి లండన్‌కు బయలుదేరిన రెండు ఎయిరిండియా విమానాలు పది గంటలు ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరిన ఘటనపైనా డీజీసీఏ స్పందించింది. ఈ ఆలస్యానికి కారణాలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రయాణికుల భద్రత విషయంలో ఉపేక్షను సహించేది లేదని డీజీసీఏ స్పష్టం చేసింది.

Read also:Andhra : ఓటర్లను చైతన్యపరచడంలో ప్రాంతీయ మీడియా సహకారం అవసరం: పి.పవన్

 

Related posts

Leave a Comment