Amit Shah : ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయి: అమిత్ షా:కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంగ్ల భాషపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ, ఆంగ్లం వలసవాద బానిసత్వానికి ప్రతీక అని, భవిష్యత్తులో ఈ భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని, ప్రజలే దీన్ని తిరస్కరిస్తారని పేర్కొన్నారు.
అమిత్ షా కీలక వ్యాఖ్యలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంగ్ల భాషపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ, ఆంగ్లం వలసవాద బానిసత్వానికి ప్రతీక అని, భవిష్యత్తులో ఈ భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని, ప్రజలే దీన్ని తిరస్కరిస్తారని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు స్థానిక భాషలే నిజమైన గుర్తింపునిస్తాయని, విదేశీ భాషల స్థానాన్ని అవి భర్తీ చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఆయన ప్రసంగంలో దేశానికి, సంస్కృతికి, చరిత్రకు, మతానికి సంబంధించిన విషయాలను అర్థం చేసుకోవడానికి ఏ విదేశీ భాష సరిపోదని అమిత్ షా స్పష్టం చేశారు. అసంపూర్ణమైన విదేశీ భాషలతో ‘సంపూర్ణ భారతం’ అనే భావనను ఊహించలేమని కూడా ఆయన నొక్కిచెప్పారు. స్థానిక భారతీయ భాషలే దేశ ఉనికికి కీలకమని, ఆంగ్లం మాట్లాడేవారు త్వరలోనే ఇబ్బందిపడే సమాజం ఏర్పడుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆంగ్లాన్ని వలసవాద బానిసత్వపు గుర్తుగా భావించి, దాన్ని వదిలించుకుంటారని ఆయన జోస్యం చెప్పారు.
హిందీని బలవంతంగా రుద్దడాన్ని, నూతన విద్యావిధానంలో భాగంగా ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని (స్థానిక భాష, ఆంగ్లం, హిందీ) తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సహా కొన్ని విపక్ష పాలిత రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలు భాషా విధానాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది.
Read also:Vivo : భారత్‌లో Vivo Y400 ప్రో లాంచ్: Android 15, 90W ఛార్జింగ్ హైలైట్స్!