India’s Next Census : దేశంలో త్వరలో 16వ జనగణన: హోంశాఖ నోటిఫికేషన్ విడుదల:దేశవ్యాప్తంగా 16వ జనాభా గణనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది 8వ జనగణన కావడం విశేషం. ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో డిజిటల్‌గా నిర్వహించి, 2027 మార్చి 1 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
16వ జనాభా గణన కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల
దేశవ్యాప్తంగా 16వ జనాభా గణనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది 8వ జనగణన కావడం విశేషం. ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో డిజిటల్‌గా నిర్వహించి, 2027 మార్చి 1 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
జనగణనలో భాగంగా తొలిసారి కులాల వారీగా కూడా గణాంకాలను సేకరించనున్నారు. ఈ సమగ్ర ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా సుమారు 34 లక్షల మంది గణకులు, సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో పనిచేయనున్నారు. వీరికి సహాయంగా మరో 1.34 లక్షల మంది ఇతర సిబ్బంది కూడా ఈ విధుల్లో పాలుపంచుకుంటారు.
ఈసారి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ రూపంలో జరగనుంది. గణన సిబ్బంది ట్యాబ్లెట్ పరికరాల ద్వారా వివరాలను నమోదు చేస్తారు. అంతేకాకుండా, ప్రజలు తమ వివరాలను తామే సొంతంగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించనుంది. ఇందుకోసం ప్రత్యేక పోర్టళ్లు, మొబైల్ యాప్‌లను అందుబాటులోకి తీసుకురానుంది.
సేకరించిన సమాచారం యొక్క భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డేటా సేకరణ, బదిలీ మరియు నిల్వ ప్రక్రియలను అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలతో నిర్వహిస్తామని తెలిపింది. 15 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ జనగణన దేశ అభివృద్ధి ప్రణాళికలకు కీలక సమాచారాన్ని అందించనుంది.
కేంద్రపాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూకశ్మీర్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 2026 అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి జనగణన ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం సోమవారం (జూన్ 16) మధ్యాహ్నం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2027 మార్చి 1 అర్ధరాత్రి నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది.
రెండు దశల్లో గణన
1.మొదటి దశ (ఇంటి జాబితా ఆపరేషన్ – HLO): ఈ దశలో ప్రతి ఇంటికి సంబంధించిన గృహనిర్మాణ పరిస్థితులు, ఆస్తులు, సౌకర్యాల గురించి సమాచారం సేకరిస్తారు.
2.రెండవ దశ (జనాభా గణన – PE): ఈ దశలో ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన జనాభా, సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక వివరాలతో పాటు వారి కులాల సమాచారాన్ని కూడా సేకరిస్తారు.
Read also:Microplastics : పురుషుల్లో సంతానలేమికి మైక్రోప్లాస్టిక్స్ కొత్త కారణమా?